BigTV English

Pawankalyan: పవన్ కు ఇష్టమైన ఫుడ్డు ఏమిటో తెలుసా? అదేమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Pawankalyan: పవన్ కు ఇష్టమైన ఫుడ్డు ఏమిటో తెలుసా? అదేమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Nagababu revealed about the favourate food of Pawankalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు ల మధ్య ఉన్న అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రత్యేకంగా పెద్దన్నయ్య చిరంజీవి అంటే భక్తితో కూడిన భయం పవన్ కి. కానీ నాగబాబు వద్ద మాత్రం మొహమాటం లేకుండా అన్ని సొంత విషయాలూ పంచుకుంటారు. ఇద్దరి మధ్య పదేళ్ల గ్యాప్ ఉంది. అయినా నాగబాబు కూడా పవన్ ని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. కుటుంబం అంటే ఎంతో ప్రేమను కనబరిచే పవన్ కళ్యాణ్ తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక పెద్దన్నయ్య, వదిన, తల్లికి పాదాభివందనం చేశారు. అది ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. ఒకానొక సందర్భంలో నాగబాబు తన తల్లికి ముగ్గురం కలిసి ఉండటం అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. తన తల్లి కూడా ఎక్కువగా చిరంజీవి, తమ్ముడు పవన్ సినిమాలను చూస్తారని ..ఫలానా సినిమాలో..ఫలానా సన్నివేశంలో బాగా చేశావని మెచ్చుకుంటుందని నాగబాబు చెప్పేవారు.


పవన్ తరపున ప్రచారం

ప్రస్తుతం అమ్మ అన్నయ్య దగ్గరే ఉన్నా..తాను మాత్రం రెండు వారాలకొకసారి తల్లిని చూసొస్తానంటారు. తమ్ముడు మాత్రం తల్లిని చూసేందుకు తనకున్న బిజీ షెడ్యూల్ వలన తక్కువగా కలుస్తాడని..ఒకవేళ తల్లిని చూడటానికి వచ్చినా ఏ గంటో లేక రెండు గంటలో తప్ప ఎక్కువ ఉండడని తమ్ముడు పవన్ గురించి నాగబాబు చెప్పారు. అయితే పవన్ రాజకీయ పార్టీ జనసేన కు సంబంధించిన వ్యవహారాలను అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటారు నాగబాబు. జనసేన ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతున్నారు నాగబాబు. మొన్న అసెంబ్లీ ఎన్నికలలో పవన్ తరపున నాగబాబు విస్తృత ప్రచారం చేశారు. కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పవన్ కు మద్దతుగా నిలిచారు. జనసేన కార్యకర్తలు కూడా నాగబాబు తోనే తమ సమస్యలు ఎక్కువగా చర్చిస్తారు. పవన్ కున్న బిజీ షెడ్యూల్ తో కేవలం ఆయనను కలిసేందుకే తప్ప తమ సమస్యలపై మాట్లాడాలంటే నాగబాబునే కలుస్తుంటారు. అయితే రాజకీయాలలో బిజీగా ఉన్న నాగబాబు అప్పుడప్పుడు సినిమాలలో క్యారెక్టర్ యాక్టర్ గానూ రాణిస్తున్నారు. ప్రస్తుతం సినిమాల కన్నా ఎక్కువగా రాజకీయాలపైనే దృష్టి పెట్టారు నాగబాబు.


Also read: సైమా అవార్డ్స్ 2024 : నాని సినిమాలకు 8 అవార్డులు.. విజేతలు వీరే

మీడియా రంగంలో నాగబాబు

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా తానే స్వయంగా మీడియా రంగంలో దిగారు. సొంతంగా ఓ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దాని గురించి అధికారిక ప్రకటన చేశారు కూడా. వచ్చే ఎన్నికల నాటికి పవన్ కు బలమైన మద్దతునిచ్చే మీడియా సంస్థగా దీనిని అభివృద్ధిలోకి తెచ్చే ప నిలో ఉన్నారు నాగబాబు. అయితే ఇటీవల ఓ సందర్భంలో పవన్ ఇష్టాఇష్టాల గురించి మాట్లాడుతూ పవన్ కు అత్యంత ఇష్టమైన ఫుడ్డు గురించి చెప్పుకొచ్చారు. పవన్ కు ఆంధ్రా పులావ్ అంటే బాగా ఇష్టమట. హైదరాబాద్ బిర్యానీలాగానే ఆంధ్రా పులావ్ కూడా బాగా పాపులర్. అయితే పులావ్ వండిన రోజున మామూలుగా కన్నా ఒక ముద్ద ఎక్కువే పవన్ లాగించేస్తారట.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ మూడుు వారాలపాటు మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుని బిజీగా మారనున్నారు.

Related News

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Big Stories

×