Nindu Noorella Saavasam Serial Today Episode: సరస్వతి వార్డెన్ అమర్‌కు నిజం చెప్పలేకపోయిందని గార్డెన్ లో కూర్చుని ఆరు బాధపడుతుంది. అయితే చెప్పుటకు ఆవిడెవరు..? వినుటకు ఇతడెవరు అంటూ గుప్త చెప్పగానే.. ప్రతిసారి వార్డెన్ చెప్పడానికి వస్తూనే ఉన్నారు.. కానీ చెప్పలేకపోతున్నారు అంటూ బాధపడతుంది ఆరు. అయితే పని చేయడమే నీ వంతు ఫలితం ఆ పై వాడి వంతు.. అదియే విధి అంటాడు గుప్త. దీంతో ఆరు ఇరిటేటింగ్‌గా ప్రతి సారి విధి విధి అంటూ నస పెట్టకండి గుప్త గారు.. ఆ మాట వింటేనే చిరాకు వస్తుంది అని ఆరు అనగానే.. ఏమిటి నీకు అనుకూలంగా ఉన్న విధిపైనే నీకు ఆగ్రహమా..? అంటాడు గుప్త.
విధి నాకు అనుకూలంగా ఉండటమా..? ఎప్పుడు గుప్త గారు.. మీరు చెప్తున్న విధి నాకు ఏం ఫేవర్ చేసింది. నన్ను చంపేసి నా భర్త పిల్లల నుంచి దూరం చేసింది అంటుంది.. ఆరు. కానీ ఆ విధియే కదా నువ్వు మరణించినా కూడా నీ కుటుంబం చెంతనే ఉండేలా చేసింది అంటాడు గుప్త. ఏంటి ఆత్మలాగా.. ఇది కూడా ఒక జీవితమేనా..? అంటుంది ఆరు. మరణానంతర జీవితం బహు కొద్ది మందికే దక్కింది బాలిక అంతటి అదృష్టం దక్కింది నీకు అంటాడు గుప్త. దీంతో ఆరు కోపంగా నన్ను చంపేసి ఈ మాయ మాటలకు చెప్పకండి ఫ్లీజ్.. అంటుంది. దీంతో అయినతో నీకు ఒక సత్యము చెప్పెదను.. అంటూ గుప్త వెంటనే నువ్వు మా లోయం రావాలి. లేదంటే ఇక నువ్వు చాలా కష్టాలు పడతావు అంటూ హెచ్చరిస్తాడు. తర్వాత ఆరు ఆస్థికలు ఎలాగైనా గంగలో కలిపేలా అమర్‌కు చెప్పాలని గుప్త డిసైడ్ అవుతాడు. అందుకోసం స్వామీజీ వేషం వేసుకుని అమర్ దగ్గరకు వెళ్లాలనుకుంటాడు. అదే విషయం ఆరుకు చెప్తాడు. ఆరు కూడా సరే అంటుంది.
దీంతో గుప్త స్వామీజీ వేషంలోకి మారిపోయిన జీ శ్రీమన్నారాయణ అంటూ అమర్ ఇంట్లోకి వెళ్తాడు. గుప్తను చూసిన అమర్ వాళ్లు ఎవరు స్వామి మీరు అని అడుగుతారు. మిస్సమ్మ వచ్చి స్వామి మీ లాంటి వాళ్లు మా ఇంటికి రావడం మా అదృష్టం స్వామి.. కూర్చోండి స్వామి అంటుంది. స్వామి వేషంలో ఉన్న గుప్త అమర్ ఇంట్లో కూర్చుని నేరుగా మీ ఇంట్లో చాలా రోజులుగా చాలా సమస్యలు వస్తున్నాయి కదా అని అడుగుతాడు. అమర్ అవును కానీ ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదు.. అయినా ఈ విషయాలు మీకెలా తెలుసండి అని అడుగుతాడు అమర్.. మేము త్రికాలజ్ఞులము నాయన మాకు అంతా అవగతం అవుతుంది. ఆ జగన్నాథుడి ఆదేశం మేరకే మేము ఇప్పుడు మీ ఇంటికి వచ్చాము.. మీ ఇంట్లో చనిపోయిన వారి ఆస్థికలు ఇంకా గంగలో కలపకుండా అలాగే పెట్టుకున్నారు కదా..? అని అడగ్గానే.
అందరూ షాక్ అవుతారు.. అవును స్వామి.. చనిపోయిన నా భార్య అస్థికలు ఇంట్లోనే ఉన్నాయి.. కానీ ఎన్ని సార్లు గంగలో కలపుదామని ప్రయత్నించినా కలపలేకపోయాము అని అమర్ చెప్పగానే.. అయితే ఈసారి ప్రయత్నం చేసి చూడండి నాయన. ఎందుకంటే తక్షణమే ఆ ఆస్తికలు మీరు గంగలో నిమజ్జనం చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్తాడు. గుప్త మాటలకు మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. అమర్ మాత్రం ఎందుకు స్వామి.. నిమజ్జనం చేయకపోతే.. చనిపోయిన నా భార్యకు ఏమౌతుంది.. మళ్లీ ఈ ఇంటికి ఏమైనా సమస్యలు వస్తాయా..? చెప్పండి స్వామి.. అంటూ అమర్ అడగ్గానే..
ఆస్థికలు నిమజ్జనం చేయడం వల్ల నీ ఇంటికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు నాయన.. కానీ ఆ ఆత్మకు మళ్లీ పునర్జన్మ ఉండదు నాయన.. నీవు ఎంతగానో ప్రేమించిన నీ భార్య మల్లీ జన్మించాలంటే వెంటనే తన ఆస్థికలను నిమజ్జనం చేయాలి. అలా చేస్తే ఆవిడ మళ్లీ నీ ఇంట్లోనే నీ కడుపులోనే పుట్టే అవకాశం కూడా ఉంటుంది నాయన.. గతించిన నీ భార్య నీ కూతురుగా పుట్టి నీ ఇంట్లోనే అడుగుపెడుతుంది నాయన అంటూ గుప్త చెప్పగానే.. మనోహరి షాక్ అవుతుంది. అమర్, మిస్సమ్మ ఆశ్చర్యపోతారు. గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్న ఆరు.. ఎమోషనల్ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.