BigTV English

Jubilee Hills Bypoll: అటు క్లాస్.. ఇటు మాస్.. జూబ్లీహిల్స్‌లో బైపోల్‌లో హైవోల్టేజ్!

Jubilee Hills Bypoll: అటు క్లాస్.. ఇటు మాస్.. జూబ్లీహిల్స్‌లో బైపోల్‌లో  హైవోల్టేజ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ లో తీన్మార్ వార్ లోడింగ్ అవుతోంది. బైపోల్ చుట్టూ క్రమంగా మ్యాటర్ వేడెక్కుతోంది. డిసెంబర్ లోగా ఎన్నిక జరగాల్సి ఉండడంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అలర్ట్ అవుతున్నాయి. క్యాడర్ ను రెడీ చేస్తున్నాయి. రివ్యూలతో స్పీడ్ పెంచేస్తున్నాయ్. మాగంటి మరణంతో వస్తున్న ఈ బైపోల్ పొలిటికల్ గా ఉత్కంఠ పెంచుతోంది. గతంలో మునుగోడు బైపోల్ కు ఏమాత్రం తగ్గకుండా పాలిటిక్స్‌లోడ్ అవుతున్నాయి.


కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి ప్రతిష్టాత్మకం

జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలతు చాలా ప్రతిష్ఠాత్మకంగా మారిపోయింది. ప్రజల్లో పట్టు పెరిగిందని నిరూపించుకోవడం కాంగ్రెస్ కు ముఖ్యం. మొన్న కంటోన్మెంట్ పోయింది.. ఇప్పుడు జూబ్లీహిల్స్ కూడా పోతే పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోతుందన్న భయం బీఆర్ఎస్ ది. ఇక్కడ గెలవకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన వైబ్రేషన్ కంటిన్యూ చేయడం కష్టమని బీజేపీ అనుకుంటోంది. పైగా వచ్చేది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్. GHMC పరిధిలో బీజేపీ క్రమంగా పుంజుకుంటోంది. ఇక్కడ గెలుపు ఆ పార్టీకే కాదు.. మిగితా పార్టీలకూ చాలా కీలకం. అందుకే జూబ్లీహిల్స్ లో పొలిటికల్ గేమ్ షురూ కాబోతోంది. దసరా తర్వాత రిలీజ్. జూబ్లీహిల్స్ బస్తీలన్నీ మార్మోగిపోవాల్సిందంతే. ముఖ్యమైన లీడర్లంతా జూబ్లీహిల్స్ లోనే మకాం వేసేలా స్కెచ్చులు రెడీ అవుతున్నాయ్. సో ఎప్పుడూ లేనంత పొలిటికల్ హీట్ ఖాయమైపోయింది. మరి జూబ్లీహిల్స్ జనం పల్స్ ఎటువైపు?


జూబ్లీహిల్స్ బైపోల్ గెలుపు కోసం ఏ పార్టీ వ్యూహం ఎలా ఉంది? ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువున్నాయ్? ఇప్పుడు వన్ బై వన్ డీ కోడ్ చేద్దాం. అసలు బలమైన అభ్యర్థుల వేట ముగిసిందా? బస్తీమే సవాల్ అంటారా? ముఖ్యమైన లీడర్లంతా జూబ్లీహిల్స్ ప్రచారంలో దిగాల్సిందేనా? అంటే అవునన్న సమాధానమే వస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పొలిటికల్ స్కెచ్ లు ఎలా ఉన్నాయ్?

గతంలో కంటోన్మెంట్ బైపోల్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు గెలిచి సత్తా చాటింది. అక్కడ శ్రీగణేష్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ గెలిచిన స్థానం. మాగంటి గోపీనాథ్ మరణంతో బైపోల్ వస్తోంది. మరి అక్కడ కూడా పాగా వేసేలా కథ మార్చాలనుకుంటోంది. నిజానికి బైపోల్స్ లో సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి సహజంగానే ఎడ్జ్ ఉంటుంది. ఆ అనుకూలతను పార్టీ విజయం దిశగా మలచుకోవాలనుకుంటోంది.

డివిజన్ల ఇన్‌ఛార్జిల మీటింగ్‌లో దిశానిర్గేశం

జూబ్లీహిల్స్ బైపోల్ కోసం ముగ్గురు మంత్రులు, అన్ని కార్పొరేషన్ల ఛైర్మన్లను కాంగ్రెస్ రంగంలోకి దింపింది. తుమ్మల, పొన్నం, వివేక్ ముగ్గురు మంత్రులకు ప్రచార వ్యూహాలు, నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ బైపోల్ కోసం సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌లు రివ్యూ చేశారు. కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల ఇన్‌ఛార్జిలతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే విషయం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని, అయితే పార్టీ గెలుపుకోసం పనిచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పోలింగ్ బూత్ ల వారీగా ప్రచార ప్రణాళికలను రెడీ చేసుకోవాలన్నారు. నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా కల్పించాలన్నారు. సో కాంగ్రెస్ నుంచి ముగ్గురు నలుగురి పేర్లు వినిపిస్తున్నా నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలిసింది.

ప్రజల్లో సానుకూలత నిరూపించుకునే టైం

తెలంగాణ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ పాలనపై ప్రజల్లో సానుకూలత ఉందని నిరూపించుకోవడానికి జూబ్లీహిల్స్ బైపోల్ గెలుపు చాలా కీలకం. తాము ఈ 20 నెలల్లో చేసిన కార్యక్రమాలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్న సంకేతాలు రుజువు చేసుకోవాలంటే ఇక్కడ విక్టరీ ఇంపార్టెంట్ గా మారింది. దీంతో రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై పాజిటివ్‌ వైబ్ క్రియేట్ చేయవచ్చని భావిస్తోంది హస్తం పార్టీ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. దీంతో బైపోల్స్ లో పట్టు సాధించి గ్రేటర్ పోల్స్ లో సత్తా చాటాలనుకుంటోంది. ప్రతి డివిజన్‌కు రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ల ఛైర్మన్‌లను నియమించారు. పైగా ముగ్గురు మంత్రులు పొన్నం, తుమ్మల, వివేక్‌లతో సమన్వయం చేసుకోవడం, రెగ్యులర్ గా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సీఎం సూచించారు.

ఇన్‌ఛార్జుల నుంచి వివరాలు అడిగిన సీఎం

ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించిన ఇన్‌ఛార్జులను సీఎం రేవంత్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రచారంలో ఏమైనా లోపాలుంటే మార్పులు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని పేదల్లో చాలా మందికి వైట్ రేషన్ కార్డులు కూడా ఇచ్చేశారు. పెండింగ్ రేషన్ కార్డుల్ని కూడా త్వరలో క్లియర్ చేసేలా చూసుకుంటున్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి

అటు బీఆర్ఎస్ కు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపు ఇంపార్టెంట్ గా మారింది. నిజానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యుల్నే ఏకగ్రీవం చేసే సంప్రదాయం గతంలో ఉండేది. కానీ కేసీఆర్ వచ్చాక.. అలాంటి సంప్రదాయానికి చెక్ పెట్టారు. గతంలో అభ్యర్థిని పెట్టారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినా.. మిగితా పార్టీలు పోటీ పెడుతున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ లో అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించకపోయినా మాగంటి గోపీనాథ్ భార్య పేరునే పరిశీలిస్తున్నారంటున్నారు. మాగంటి కుమార్తెలు నియోజకవర్గంలో ఇప్పటికే అందరినీ కలుస్తున్నారు. ఇప్పటికే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, కంటోన్మెట్ ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని చేజార్చుకోవడం, లోక్‌సభ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడం బీఆర్ఎస్‌కు ఇబ్బందికరంగా మారింది. మరోవైపు ఇటీవల కవిత సస్పెన్షన్ వ్యవహారం కూడా తీవ్ర దుమారం రేపింది. బీఆర్ఎస్ లో అవినీతి వ్యవహారాలపై ఆమె మాట్లాడడంతో పార్టీ ప్రతిష్ఠ మసకబారుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే వస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం గులాబీ పార్టీకి చాలా కీలకంగా మారింది. కొన్ని సర్వేల్లో తమకే అనుకూలంగా రిజల్ట్ వస్తోందని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రచారాలు చేసుకుంటోంది.

జూబ్లీహిల్స్‌లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అడుగులు

ఇక బీజేపీ కూడా జూబ్లీహిల్స్ లో గెలవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు సాధించడం ఆ పార్టీకి కొత్త జోష్ తెచ్చింది. ఈ ఊపును కొనసాగించడం కమలం పార్టీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇటీవలే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ఎన్ రామచందర్‌రావుకు ఈ ఎన్నికలు తొలి సవాల్ గా మారబోతున్నాయి. పార్టీ అభ్యర్థి విజయంతో విక్టరీ షురూ చేయాలన్న టార్గెట్ తో ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో, ప్రచార సన్నాహక సమావేశాల్లో పార్టీ కాస్త స్లోడౌన్ అయినట్లుగా కనిపిస్తోంది.

Also Read: పబ్లిక్ గార్డెన్‌లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు..

మజ్లిస్ పార్టీ పోటీ పెడుతుందా కాంగ్రెస్‌కు సపోర్టా?

జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో సగం వరకు ముస్లిం ఓటర్లు ఉన్నారు. గెలుపులో వీరు కీలకం. 2014లో జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో బరిలో దిగి ఢీ.. అంటే ఢీ అనేలా పోటీ పడి స్పల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన మజ్లిస్‌.. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కోసం బరిలో దిగకుండా సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించింది. 2023లో జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ లో ఫ్రెండ్లీ అభ్యర్థిగా బరిలో దిగిన ఎంఐఎం ఓడిపోయింది. సో ఈ బైపోల్ లో ఎంఐఎం తన అభ్యర్థిని దింపుతుందా.. లేదంటే కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తుందా అన్నది కూడా గెలుపులో కీలకంగా మారబోతోంది.

Story By Vidya Sagar, Bigtv

Related News

Telangana Liberation Day: పరేడ్ గ్రౌండ్‌లో విమోచన దినోత్సవ వేడుకలు.. అమరవీరులకు నివాళులర్పించిన కేంద్రమంత్రులు

Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. బంగారం షాపుల యజమానుల్లో టెన్షన్

Public Garden: పబ్లిక్ గార్డెన్‌లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు..

CM Revanth Reddy: విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు బిగ్‌షాక్..! మరో మూడు రోజులు భారీ వర్ష సూచన..

NVS Reddy: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి..

TGPSC: టీజీపీఎస్సీ ముట్టడించిన తెలంగాణ జాగృతి నాయకులు.. వారి ప్రధాన డిమాండ్ ఇదే..

Big Stories

×