BigTV English

Nindu Noorella Savasam: రామ్మూర్తితో అమర్ అలా ఎందుకు అన్నాడు ? మేజర్ అమర్ కు ఏం చెప్పాడు ?

Nindu Noorella Savasam: రామ్మూర్తితో అమర్ అలా ఎందుకు అన్నాడు ? మేజర్ అమర్ కు ఏం చెప్పాడు ?

Nindu Noorella Saavasam Serial Today September 13th Episode: అమర్, మిస్సమ్మ ఇద్దరూ కలిసి రామ్మూర్తిని తమ ఇంటికి రమ్మని పిలుస్తారు. గణపతి పండుగ అందరం కలిసి అక్కడే జరుపుకుందామని అడుగుతారు. అమర్ మాటలకు ఏం చెప్పాలో తెలియక రామ్మూర్తి అయోమయంగా చూస్తుంటాడు. మీరు అక్కడికి రావడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు నాన్నా అంటూ మిస్సమ్మ, రామ్మూర్తిని అడుగుతుంది. అయితే ఇప్పటికే ఆ ఇంటికి చాలా రుణ పడ్డానని ఇంకా అక్కడికి వచ్చి రుణ పడలేనని రామ్మూర్తి బాధపడుతుంటే అమర్ అది మీ కూతురు ఇల్లు అంటే మీ ఇల్లు. మీ ఇంటికి మీరు రావడానికి బాకీ పడ్డాను అంటారేంటి? అని మీరు తప్పకుండా రావాలని నేను బయట వేయిట్ చేస్తుంటాను. మీ కూతురితో ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అని చెప్పి అమర్ బయటకు వెళ్తాడు.


అమర్ ను డబ్బులు అడిగిన మంగళ

అమర్ వెనకాలే బయటకు వెళ్లిన మంగళ ఏదో చెప్పాలని ఆగిపోతుంది. దీంతో అమర్ ఏంటో చెప్పండి మీకేమైనా డబ్బులు కావాలా? నన్ను అడగడానికి మొహమాటపడితే రాథోడ్ ను అడగండి అని చెప్తాడు. దీంతో మంగళ అది కాదు బాబు మీ భార్య అరుందతి. అదే మా ఆయన పెద్ద కూతురు గురించి అని మంగళ చెప్పగానే అమర్ షాక్ అవుతాడు. బాధగా మంగళను చూస్తూ ఆ విషయం మీకెలా తెలిసింది. మిస్సమ్మకు, రామ్మూర్తికి కూడా ఆ విషయం తెలుసా? అని అమర్ అడగుతాడు. దీంతో వాళ్లకు తెలియదని నాకు మాత్రమే తెలుసని.. మీకు తెలిసిన నిజం ఎందుకు వాళ్లకు చెప్పడం లేదో అని డౌటు వచ్చి నేను కూడా వాళ్లకు చెప్పలేదు అంటుంది. అయినా మీరు ఎందుకు వాళ్లకు నిజం చెప్పలేదు అని మంగళ అడగ్గానే నేను చెప్పే ఒక్క నిజంతో ఆయన బ్రతకడానికి కారణం లేకుండా చేయలేకపోయాను. తన అక్క లేదనే నిజం తట్టుకుని నిలబడే శక్తి మిస్సమ్మకు లేదు. ఇందరి జీవితాలను తారుమారు చేసే నిజం మనసు విరిచేసే నిజం చెప్పకపోవడమే మంచిది అనిపించింది అందుకే వాళ్లకు చెప్పకుండా నాలోనే దాచుకున్నాను అంటాడు అమర్. దీంతో మీరు చాలా మంచి పని చేశారు బాబు అంటూ ఆయన పెద్ద కూతురు గురించి కలవరపడుతున్నారు. ఆయన మంచాన పడి ఉండటం చూడలేకపోతున్నాను. ఇంతకు ముందు ఉద్యోగానికి వెళ్లేవాడు. కాబట్టి ఎక్కువగా కూతురు గురించి ఆలోచించే వాడు కాదు. కానీ ఇప్పుడు ఖాళీగా ఉండే సరికి తన కూతురు జాడ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆయన మనసు మళ్లించడానికి మేము బిజినెస్ చేయాలనకుంటున్నా.. దానికోసం ఒక పదిలక్షలు మీరు ఇప్పించగలరా? అంటూ అరుంధతి గురించి నిజం చెప్పకుండా ఉండేందుకు తనకు డబ్బుల కావాలని డిమాండ్ చేసినట్లు అడుగుతుంది మంగళ. అమర్ సరే ఇస్తానని చెప్తాడు. ఇంతలో అక్కడికి రామ్మూర్తి, మిస్సమ్మ రావడంతో సైలెంట్ గా ఉండిపోతుంది.


Also Read: బిగ్ టీవీ ‘కిర్రాక్ కపుల్స్’ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది, వీళ్ల పంచులకు పడీ పడి నవ్వాల్సిందే!

మంగళను తిట్టిన రామ్మూర్తి

తర్వాత భాగీ, అమర్ వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిపోయాక అమర్తో ఏం మాట్లాడావు అని మంగళను అడుగుతాడు రామ్మూర్తి. నేనేం అడగలేదని చెప్తుంది. దీంతో డబ్బులు అడిగావా? అంటూ రామ్మూర్తి గట్టిగా నిలదీస్తే మంగళ తడబడుతూ నేనేం అడగలేదు. నీ పెద్దకూతురు గురించి మాట్లాడాను అంటుంది. దీంతో రామ్మూర్తి ఎమోషనల్ అవుతాడు. బాబు గారి ఇంట్లో ఆ పట్టుపంచె చూసినప్పటి నుంచి మనసంతా ఏదోలా ఉంది అంటాడు.

అమర్ ఇంటికి వచ్చిన ఫోర్స్ తో వచ్చిన మేజర్

తర్వాత అమర్ ఇంటికి మిలటరీ మేజర్ వస్తాడు. అమర్ ఏమైంది సార్ అని అడగ్గానే ప్రాబ్లం ఏమీ లేదు అమర్. జస్ట్ రొటీన్ చెక్ అప్. అండ్ సెక్యూరిటీని కొంచెం టైట్ చేస్తున్నాం. అని అమర్ ను పక్కకు తీసుకెళ్లి ఇండిపెండెన్స్ డే రోజు మనం అరెస్ట్ చేసిన వారిలో మెయిన్ వాడు జైలు నుంచి తప్పించుకున్నాడు. వాడు ఇప్పుడు నిన్ను, నీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు. అందుకే నీకు, నీ ఫ్యామిలీకి సెక్యూరిటీ పెంచాము. అని చెప్పి అమర్ ను జాగ్రత్తగా ఉండమని మేజర్ వెళ్లిపోతాడు. తర్వాత అమర్, మిస్సమ్మను పిలిచి రేపు వినాయకచవితికి మీ అమ్మా నాన్నా వస్తున్నారా? అని అడగ్గానే వస్తున్నారు ఉదయం బయలుదేరుతారంట అని మిస్సమ్మ చెప్తుంది. దీంతో అమర్ ఏమీ రావొద్దని చెప్పు వాళ్లకు.. అనగానే నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.

 

Related News

Tv Actress: విడాకులు తీసుకొని విడిపోయిన బుల్లితెర జంట…పెళ్లైన నాలుగేళ్లకే?

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big Stories

×