BigTV English

Seethe Ramudi Katnam Serial: మహాను దొంగని చేసిన అర్చన.. సీతకు సాయం చేసిన విద్యాదేవి.. ట్విస్ట్ ఇచ్చిన రామ్

Seethe Ramudi Katnam Serial: మహాను దొంగని చేసిన అర్చన.. సీతకు సాయం చేసిన విద్యాదేవి.. ట్విస్ట్ ఇచ్చిన రామ్

Seethe Ramudi Katnam Serial Today September 13th Episode: సీత.. టీచర్ ను పిలిచి మీ గదిలో దొంగలు పడ్డారని అర్చన అత్తయ్య మీ రూంలోకి వెళ్లి ఈ బ్యాగులో దేనికోసమో వెతుకుతుంది. అని చెప్పగానే విద్యాదేవి షాక్ అవుతుంది. బ్యాగులో ఫోటో అర్చన చూడలేదు కదా అని మనసులో అనుకుని చెక్ చేసుకుని అర్చన ఈ ఫోటో చూడలేదని ఊపిరి పీల్చుకుంటుంది. ఇంతలో సీత టీచర్ మీ బ్యాగులో ఏమైనా పోయాయా? సరిగ్గా చూసుకోండి అని సైగ చేస్తుంది.


బ్యాగులో ఐదు లక్షలు పోయాయన్న టీచర్

అయితే బ్యాగులో అన్ని ఉన్నాయని కానీ ఐదు లక్షల రూపాయలు లేవంటుంది టీచర్. దీంతో అర్చన, మహాలక్ష్మీ షాక్ అవుతారు. ఒట్టేసి చెప్తున్నాను నాకేమీ తెలియదు అంటుంది అర్చన. మరి డబ్బుల కోసం కాకపోతే ఆ గదిలోకి ఎందుకు వెళ్లారు. అక్కడ ఏం వెతుకుతున్నారు. మీకు మీరుగా వెళ్లారా? లేక ఎవరైనా పంపించారా? అని సీత అడగ్గానే గిరి, జనార్ధన్ సీతను తిడతారు. తనకు తెలియదని చెప్తుంది కదా అంటారు. దీంతో ఆవిడకు ఏం తెలియకపోతే తను ఆ గదిలోకి ఎందుకు వెళ్లినట్టు.. లేదంటే ఎవరైనా పంపించారేమో చెప్పమనండి అని సీత అనగానే మహాలక్ష్మీ టెన్షన్ పడుతుంది. ఇది భయంలో నా పేరు చెప్పినా చెప్తుంది అని మనసులో అనుకుని అర్చనను తిడుతుంది. పోయిన ఆ డబ్బులు నేనిస్తాను అని జనార్దన్ ను డబ్బులు తీసుకురా అని చెప్పగానే జనా లోపలికి వెళ్లి డబ్బులు తీసుకొస్తాడు. మహా ఆ డబ్బులు విద్యాదేవికి ఇస్తుంది.


అందరి ముందు నన్ను దొంగను చేస్తావా? అంటూ మహాను నిలదీసిన అర్చన

తర్వాత తన రూంలోకి వెళ్లిన మహా దగ్గరకు అర్చన వెళ్లి ఆ విద్యాదేవికి ఎందుకు డబ్బులు ఇచ్చావు. అవి నేను తీసుకోలేదని నీకు తెలుసు కదా? అంటూ నిలదీస్తుంది. దీంతో ఆ విషయం నాకు నీకు తెలుసు. కానీ అందరికి తెలియదు కదా అని మహా అనగానే అంటే అందరి ముందు నన్ను దొంగను చేశావా? అంటుంది అర్చన. దొంగను కాదు అందరి ముందు నిన్ను కాపాడి నన్ను కాపాడుకున్నాను అంటుంది మహా. నన్ను కాపాడటం కాదు నిన్ను నువ్వు కాపాడుకున్నావు అంటుంది అర్చన. దీంతో బయపడుతూ చేస్తే ఇలాగే ఉంటుంది అర్చన అంటూ జరిగిందేదో జరిగిపోయింది డబ్బులిచ్చి ఆ గొడవ నుంచి తప్పించుకున్నాము కదా అంటుంది మహా. దీంతో అర్చన నేను వెయ్యి రూపాయలు అడిగితే ఇవ్వవు కానీ వాళ్లు లక్షలకు లక్షలు ఇస్తున్నావు అంటుంది. దీంతో సరేలే ఈరోజు వాళ్ల టైం మన టైం వచ్చినప్పుడు మనమేంటో చూపిద్దాం అంటుంది.

Also Read: మహాను దొంగని చేసిన అర్చన.. సీతకు సాయం చేసిన విద్యాదేవి.. ట్విస్ట్ ఇచ్చిన రామ్

సీతకు సాయం చేసిన విద్యాదేవి

మరోవైపు విద్యాదేవి ఐదు లక్షలు తీసి సీతకు ఇస్తుంది. ఆ డబ్బులు మీవే టీచర్. మా ఇద్దరి అత్తలకు బుద్ది చెప్పాలనే మీతో అబద్దం చెప్పించాల్సి వచ్చింది అంటుంది సీత. నువ్వు ఏం చేసినా అందులో ఓ అర్థం ఉంటుంది సీత అని టీచర్ అనగానే మహాలక్ష్మీ అత్తయ్య అర్చనతో మీ గదిలో ఏదో వెతకమని పంపించింది. మీకు తెలియకుండా అలా చేయడం తప్పు కదా? అందుకే వాళ్లను డబ్బుతో ఇరికించాను. అది నాకు అర్థం అయింది. వాళ్ల వేళ్ళతోనే వాళ్ల కంట్లో పొడిచావు. వాళ్లను దారికి తీసుకురావడం నీవల్లే అవుతుంది ఈ డబ్బు నీకు మీ అత్తయ్య ఇచ్చింది తీసుకో.. అంటుంది టీచర్. నువ్వు ఈ ఐదు లక్షలు పెట్టుబడిగా పెట్టి ఏదైనా వ్యాపారం ప్రారంభించు నీకంతా మంచే జరుగుతుంది అని ఐదు లక్షలు సీత చేతిలో పెడుతుంది. దీంతో సీత ఎమోషనల్ గా ఫీలవుతుంది. టీచర్ కు థాంక్స్ చెప్తుంది. ఈ డబ్బులే పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తాను అంటుంది సీత.

బొటిక్ బిజినెస్ చేస్తానన్న సీత

తర్వాత బెడ్ రూంలో రామ్ కోసం ఎదురు చూస్తుంది సీత. రామ్ రాగానే అర్జెంట్ గా నీకో గుడ్ న్యూస్ చెప్పాలి అంటుంది. దీంతో రామ్ ఎగ్జైంటింగ్ గా మనకు ముహూర్తం పెట్టారా? అనగానే చీ నీకెప్పుడూ అదేనా? అంటూ నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నానని రేపే షాప్ తెరవబోతున్నాను. అని సీత చెప్పగానే డబ్బులు ఎలా అని అడుగుతాడు రామ్. దీంతో టీచర్ గారు ఐదు లక్షలు ఇచ్చారని బిజినెస్ పెట్టుకుని పైకి రమ్మని ప్రోత్సహించారు అని చెప్తుంది. ఇంతకీ ఏం షాపు పెడుతున్నావు అని రామ్ అడగ్గానే బకెట్ షాపు అని సీత చెప్పగానే ఇదేం బిజినెస్ అంటూ కంగారుపడతాడు రామ్. అదే చీరలకు, జాకెట్లకు డిజైన్స్ వేసి అమ్ముతుంటారు కదా అని సీత చెప్పగానే ఓహో బొటిక్ అన్నమాట అంటాడు రామ్. అవునని, రేపే షాపు ఓపెనింగ్ అని మీ పిన్నితో ఈ షాపు ఓపెన్ చేయించాలనుకుంటున్నాను అని వాళ్లను నువ్వే తీసుకురావాలి మామ అని చెప్పగానే రామ్ సరే అంటాడు.

షాపు ఓపెనింగ్ కు మహాను పిలిచిన రామ్

తర్వాత మహాలక్ష్మీ, జనార్థన్కు విద్యాదేవి రూంలోకి అర్చనను తానే పంపించానని చెప్తుంది. ఎందుకు అని జనా అడగ్గానే ఆవిడ ఎవరో తెలుసుకుందామని పంపిచానని చెప్తుంది మహా. ఇంతలో రామ్ రావడంతో అందరూ సైలెంట్ గా అయిపోతారు. రామ్ వచ్చి సీత బొటిక్ ఓపెన్ చేస్తుందని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. షాపు ఓపెనింగ్ కు డబ్బులు ఎక్కడివి అని అడుగుతారు. విద్యాదేవి ఇచ్చారని షాపు రేపే ఓపెనింగ్ అని మీరందరూ రావాలని రామ్ చెప్తాడు. దీంతో తాము రాలేమని అందరూ చెప్పడంతో నేటి సీతే రాముడి కట్నం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.

Related News

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…

Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన  స్రవంతి..బయటపడ్డ నిజాలు!

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

×