E-Paper
Advertisement

డేటా సిటీ విశాఖ‌కు మరో బూస్ట్.. రిలయన్స్ డేటా సెంటర్ క్లస్టర్‌ ఏర్పాటు, దాదాపు 2 లక్షల కోట్లు పెట్టుబడి

డేటా సిటీ విశాఖ‌కు మరో బూస్ట్.. రిలయన్స్ డేటా సెంటర్ క్లస్టర్‌ ఏర్పాటు, దాదాపు 2 లక్షల కోట్లు పెట్టుబడి
Advertisement

VIZAG: డేటా సిటీ నగరంగా రూపు దిద్దుకోనుంది విశాఖపట్నం. దీనికి సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. గూగుల్ తన ఏఐ డేటా సెంటర్‌కు పునాది రాయి వేసింది. తాజాగా రిలయన్స్ సంస్థ కూడా రంగంలోకి దిగేసింది. ఏకంగా కోటి 60 లక్షలతో డేటా సెంటర్ క్లస్టర్‌ ఏర్పాటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఉత్తరాంధ్రకు సరైన బూస్ట్ లభించినట్లయ్యింది.

డేటా సిటీ విశాఖ‌కు మరో బూస్ట్

Advertisement

రిలయన్స్ సంస్థ దేశంలో అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్‌ను విశాఖలో ఏర్పాటు చేయనుంది. ఆ సంస్థ సుమారు రూ. 1.6 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు జాతీయ మీడియాలో జోరందుకున్నాయి. 1.5 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది.

ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది మంది యువతీయువకులకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజ కంపెనీలు విశాఖలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. గూగుల్ కూడా లక్ష కోట్లకుపైగా పెట్టుబడులను పెడుతోంది కూడా. ఇప్పుడు ఆ జాబితాలోకి రిలయన్స్ సంస్థ కూడా చేరిపోయింది.

Advertisement

రిలయన్స్ డేటా సెంటర్ క్లస్టర్‌.. దాదాపు 2 లక్షల కోట్లు పెట్టుబడి

డేటా సెంటర్ క్లస్టర్‌తోపాటు దానిని నిర్వహణ కోసం సోలార్ విద్యుత్ బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్‌ నిర్మించనుంది రిలయన్స్. ఇప్పటికే గూగుల్ ఒక గిగావాట్ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లను నిర్మిస్తోంది. రిలయన్స్‌ డేటా సెంటర్ క్లస్టర్ దానికంటే పెద్ది. సామర్థ్యం, పెట్టుబడుల్లో గూగుల్‌ను అధిగమించిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

పెట్టుబడులకు గత శనివారం మీటింగ్‌లో రిలయన్స్ ఆమోదించినట్టు తెలుస్తోంది. గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ క్లస్టర్‌ను 3 దశల్లో నిర్మంచనుంది. అందుకోసం ఏపీ ప్రభుత్వం నుంచి దాదాపు 935 ఎకరాలు కోరిందని సమాచారం. కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, డిశాలినేషన్ ప్లాంట్ వంటివి ఏర్పాటు చేయనుంది.

ALSO READ: డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఆధార్‌పై ఆధారపడవద్దు.. ఇది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే.. ఎందుకంటే?

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భూముల పరిశీలన మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం. విశాఖలో 295 ఎకరాలు గుర్చించినట్టు తెలుస్తోంది. సౌర విద్యుత్‌ ప్రాజెక్టు కోసం శ్రీసత్యసాయి జిల్లాలో భూములు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. ఒకేచోట 600 ఎకరాలు కేటాయించాలని సంస్థ కోరినట్టు సమాచారం. మిగిలిన రెండు జిల్లాల్లో ఒకేచోట అందుబాటులో ఉన్న భూములను పరిశీలన చేస్తోందట ప్రభుత్వం. భూముల అంశం కొలిక్కి వచ్చిన తర్వాత పరిశీలనకు రిలయన్స్‌ ప్రతినిధులు రానున్నారు.

Related News

ఫుడ్ లవర్స్‌కు క్రేజీ ఆఫర్.. SBI ఎటర్నల్ కార్డ్ లాంచ్.. ఉచితంగా జొమాటో గోల్డ్ సేవలు!

బంగారం-వెండి వస్తువుల ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

చిన్న వయసులోనే కోటీశ్వరుడు అవ్వడం ఎలా? ఇదిగో అత్యుత్తమ ప్లాన్.. రూ.10 వేలు ఉంటే చాలు!

పోటీకి మేం సిద్ధమే.. మస్క్ ఆరోపణలపై రిలయన్స్ స్ట్రాంగ్ కౌంటర్

మధ్యతరగతి రిటైర్మెంట్ కోసం రూ.1 కోటి సరిపోతుందా? భవిష్యత్తు కోసం మేజిక్ ఫిగర్ ఎంత?

భార్య లోన్ కట్టకపోతే భర్త పెన్షన్ డబ్బులు కట్ చేసిన బ్యాంక్.. కోర్టు తీర్పు ఇదే

తప్పుడు అకౌంట్‌కు యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్ అయిందా? డబ్బులు వెనక్కి రావాలంటే ఇలా చేయండి!

డబ్బులు కావాలని ఫోన్ చేస్తే.. బంధువులు, స్నేహితులకు ‘నో’ చెప్పడం ఎలా?

Big Stories

Advertisement
×