E-Paper
Advertisement

Podarillu Today Episode : మహా పెళ్లి ఫిక్స్.. పెళ్లి పనులు మొదలెట్టిన ప్రతాప్.. చక్రీతో గొడవ..?

Podarillu Today Episode : మహా పెళ్లి ఫిక్స్.. పెళ్లి పనులు మొదలెట్టిన ప్రతాప్.. చక్రీతో గొడవ..?
Advertisement

Podarillu Today Episode December 15th: మీ అమ్మాయికి పూర్తిగా లోకజ్ఞానం తెలీదు.. ఎలా పెంచాలో కూడా తెలియకుండానే పెంచారు అదే మీరు చేసిన పొరపాటు అని అతను అంటాడు.. మీరేం బాధపడకండి.. మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది కెనడాకు వెళ్ళిన తర్వాత నాకు నచ్చినట్లుగా నేను మార్చుకుంటాను అని అంటాడు.. ఆ మాట వినగానే మహా పూజలు అవుట్ అవుతాయి.  మహా ఈ పెళ్లి కొడుకు నాకు నచ్చలేదు అయినా కానీ మీరు ఎవరు వినట్లేదు ఏంటి అని హారికతో చెప్తుంది.. అబ్బాయికి ఏం తక్కువయింది నువ్వు పెళ్లి చేసుకొని కెనడాకు వెళ్ళిపోతావు.. ఈ సంబంధం గురించి నువ్వే ఆలోచించు ఎందుకంటే ఇది నీ జీవితం కాబట్టి నువ్వు ఆలోచించుకొని ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.. బాగా ఆలోచించు అని అంటాడు తీసుకో అని సలహా ఇస్తుంది.. మహా మాత్రం తన ప్రాజెక్టు గురించి ఆలోచిస్తూ ఉంటుంది.. మహా తను ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది. తను మాత్రం ప్రాజెక్టు గురించి ఇంకా ఏమి చెప్పలేదు అని అంటాడు. పెళ్లి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..మాధవ్ తనకు పెళ్లి సంబంధం ఓకే అవ్వలేదు అని బాధపడుతూ ఉంటాడు. అందరం మొగోళ్ళు వెళ్తే ఏం బాగుంటుంది. నలుగురు ఆడవాళ్ళు అన్న వెళ్తే మనకి మర్యాద ఇస్తారు అని నారాయణ అంటాడు.. నలుగురు ఆడవాళ్ళని ఎక్కడినుంచి తీసుకొస్తావు నువ్వేమైనా లైన్లో పెట్టావా అని చక్రి అంటాడు.. మీ అమ్మ వెళ్ళిన తర్వాత నేను అలాంటి పనులు చెయ్యను మీ అమ్మ మీద ఒట్టు అని అంటాడు.. మా అమ్మ మీద ఒట్టు వేసి మా అమ్మని చంపేసావు కనీసం పైనున్నప్పుడైనా ప్రశాంతంగా ఉండనివ్వవా అని చక్రి అంటాడు.. అమ్మాయికి దగ్గరుండి గారెలు నేర్పించాడు అని అనగానే చక్రి గారెలు వంకతో ఆమె చేయి పట్టుకున్నాడు అని అంటాడు. ఆ మాట వినగానే మాధవ్ సీరియస్ అయ్యి చక్రిపై టమోటా విసిరేస్తాడు.. సరే నాకు ట్రిప్ వచ్చింది నేను వెళ్తున్నాను అని చక్రి అంటాడు. కేశవ కూడా నాకు పని ఉంది నేను వెళ్తాను అని అంటాడు..

Advertisement

అరే భోజనం చేసి వెళ్లండి రా అని ఎంతగా చెప్తున్నా సరే ఇప్పుడు టైం లేదులే మేము వెళ్తాము అని అంటారు.. కన్నా మాత్రం అన్నయ్య నువ్వు నిజంగానే ఆమె చేయి పట్టుకున్నావా అని అడుగుతాడు. మహా తనకి సంబంధం నచ్చకపోయినా బలవంతంగా చేస్తున్నారని బాధపడుతూ ఉంటుంది.. అందరూ మహా దగ్గరికి వెళ్లి నువ్వు చాలా అదృష్టవంతురాలివి పెళ్లి ఫిక్స్ అయిపోయింది అని అంటారు.. ఆ జుట్టు పోలిగాడు మీకు ఎలా నచ్చాడు? దగ్గరుండి చూస్తేనే నాకు ఏదోలా ఉంది అలాంటిది మీకు ఎలా నచ్చాడు నాకు నచ్చలేదు అని మహా అంటుంది.. వాడికేం తక్కువ అన్ని ఉన్నాయి. ముందు అలానే ఉన్నా తర్వాత మీరిద్దరే కలిసిపోయి కాపురం చేసుకుంటారు అని లలిత అంటుంది..

నాకు నిజంగానే వాడు అస్సలు నచ్చలేదు నేను ఉద్యోగం చేయాలి అని అనుకుంటున్నాను అని మహా ఎంత చెబుతున్నా సరే ఏ ఒక్కరు కూడా తన మాటని పట్టించుకోరు.. పెళ్లయిన తర్వాత అల్లుడు గారిని ఒప్పించి ఉద్యోగం చేయొచ్చు అని లలిత అంటుంది.. మాట వినగానే మహా కోపం ఎక్కువ అయిపోతుంది.. ఇంకా పెళ్లి ఫిక్స్ అవ్వలేదు కానీ అప్పుడే నువ్వు అల్లుడుగారు అని ఫిక్స్ అయిపోయావా అని అంటుంది మహా.. పెళ్లి ఫిక్స్ అవ్వడము కళ్యాణమండపము మాట్లాడడం కూడా పూర్తయింది అని ఆది అంటాడు. కళ్యాణ మండపం కూడా పూర్తయిపోయిందా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు అని మహా అంటుంది..

Advertisement

అబ్బాయి చాలా మంచివాడు బాగా ఆస్తులు ఉన్నాయి నిన్ను బాగా అర్థం చేసుకుంటాడు. నేను అన్ని కనుక్కొని నీకు సంబంధం ఫిక్స్ చేశాను అని ప్రతాప్ అంటాడు. ఉదయం హైదరాబాద్ కు వెళ్లి బట్టలు నగలు కొనాలి అని అంటాడు.. మాధవ్ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే గాయత్రీ ఎదురుగా వస్తుంది.. పెళ్లి సంబంధం చూడటానికి వెళ్లావు కదా అమ్మాయి బాగుందా అని అడుగుతుంది. నువ్వు నా బాహుబలి వి నువ్వు నాకే సొంతమని గాయత్రి అంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసిన తాయారు కోపంతో రగిలిపోతుంది..

గాయత్రీ ని కర్ర తీసుకొని వచ్చి కొడుతుంది. గబ్బిలాలు తిరిగే ఆ బూత్ బంగ్లా కి నా కూతురుని తీసుకొని వెళ్లాలని అనుకుంటున్నావేమో… అస్సలు జరగదు అని తాయారు మాధవ్ కి వార్నింగ్ ఇస్తుంది. మీరు ఇలా గట్టిగా అరిచి రోడ్లో వెళ్లే వాళ్లందరికీ వినిపించాలంటే గాయత్రి గురించి తప్పుగా అనుకుంటారు అని మాధవ్ అంటాడు.. ఇంకొకసారి నా కూతురుతో మాట్లాడడం చూసావంటే మర్యాదగా ఉండదు అని మాధవ్ కి వార్నింగ్ ఇస్తుంది.. తాయారు గాయత్రి చెప్పే మాటను అస్సలు పట్టించుకోదు. బావ తప్పేమీ లేదమ్మా నేనే బావ తో మాట్లాడుతున్నాను అని గాయత్రి అంటుంది. నువ్విలా కాదు పదా ఇంటికి వెళ్దాం అనేసి గాయత్రీ ని ఈడ్చుకుని వెళ్ళిపోతుంది.

దీంతో ఆ మాధవ్ గాడు మాట్లాడుతున్నాడు. నా కూతురికి మాయ మాటలు చెప్పి ఆ ఇంటికి పెళ్లి చేసుకుని తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు అని తాయారు తన అన్నతో చెప్తుంది. చూడమ్మా గాయత్రి నువ్వు వాడితో మాట్లాడొద్దు వాడు మాయ చేసానా నిన్ను ఏదో ఒకటి చేస్తాడు అని అతను కూడా అంటాడు. ఎదిగిన పిల్ల మీద చేయి చేసుకోవద్దని తన అన్న చెప్పడంతో గాయత్రీ ని లోపలికి పంపిస్తుంది. అప్పుడే వాళ్ళ ఆయన ఫోన్ చేయడంతో సీరియస్గా మాట్లాడుతుంది తాయారు. మహా మాత్రం ఈ పెళ్లి ఎలా చెడగొట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది..

Also Read : దీపికా పై రణవీర్ కామెంట్స్.. 8 గంటల్లో సినిమా కష్టం.. ఇద్దరి మధ్య గొడవలా..?

ఆ ప్రాజెక్టు దాదాపు పూర్తి అయిపోయింది అది గనక ఓకే అయితే నేను మంచి ఇంజనీర్ అవుతాను అని అనుకుంటుంది.. ఈ విషయం ఎలాగైనా నాన్నకు చెప్పి పెళ్లిని కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేయించాలి అని. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రతాప్ ఏమైంది అమ్మ ఇంకా ఇలా ఉన్నావు వెళ్లి పడుకోవా.. అని అడుగుతాడు.. నేనే మీ దగ్గరికి వద్దామని అనుకున్నాను నాన్న. మీకు ఒక విషయం చెప్పాలి అని తన ప్రాజెక్టు గురించి చెప్తుంది. ఆ మాట వినగానే ప్రతాప్ నువ్వు పెళ్లయిన తర్వాత కూడా ఈ ప్రాజెక్టు అలాంటివి చేసుకోవచ్చు అని అంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన లలిత నువ్వు అల్లుడు గారిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు అని అంటుంది.. మహా ఎంతగా ఈ పెళ్లి వద్దు అని అంటున్నా సరే వాళ్ళు మాత్రం బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తారు… అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Big Stories

Advertisement
×