Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు ఆత్మను బంధించేందుకు ప్రచండ మరో ప్రయత్నం చేస్తుంటాడు. తన మంత్ర శక్తిని ఉపయోగించి ఎలాగైనా బుజ్జమ్మలోని ఆరు శక్తిని వశం చేసుకోవాలనుకుంటాడు. అందుకోసం మరోసారి మనోహరిని హెల్ప్ అడగాలనుకుంటాడు. వెంటనే తన శిష్యుడిని పిలిచి మనోహరికి ఫోన్ చేయిస్తాడు. తనకు చివరిసారి హెల్ప్ చేయమని ఈసారి ఎలాగైనా బుజ్జమ్మలోని ఆరు ఆత్మను బంధిస్తానని చెప్తాడు. అందుకు మనోహరి కోపంగా ప్రచండను తిడుతుంది. ఇప్పటి వరకు ఇచ్చిన అవకాశాలు చాలలేదా..? నువ్వు చేసే నిర్వాకం వల్ల ప్రతిసారి నేను ఇరుక్కుపోయే పరిస్థితులు వచ్చాయి. ఇక నేను ఏ హెల్ప్ చేయలేనని అంటుంది మనోహరి. ప్రచండ ఎంత కన్వీన్స్ చేయాలని చూసిన మనోహరి వినదు. కోపంతో కాల్ కట్ చేస్తుంది.
గార్డెన్‌లో కూర్చున్న అమర్, పార్థుతో దారి దోపిడీ దొంగల గురించి మాట్లాడుతుంటాడు. వారి గురించి ఎమైనా ఎంక్వైరీ చేశావా పార్థు అని అడిగితే హైవే పెట్రోలింగ్ పోలీసులకు కంప్లైంట్ చేశానని కానీ వారి ముఖాలు మనం చూడనందు వల్ల పట్టుకోవడం కొంచెం కష్టమే అన్నారు అమర్ అంటూ చెప్తుంటే.. రాథోడ్ కల్పించుకుని మీరు గట్టిగా ఎంక్వైరీ చేయండి సార్ వాళ్లు వాళ్ల వెనకున్న వాళ్లు దొరుకుతారు. అంటాడు. అప్పుడే సరస్వతి వార్డెన్, రాజు వస్తారు.
వాళ్లను పలకరించిన అమర్ ఇప్పుడొచ్చారేంటి అని అడుగుతారు. అప్పుడే వాళ్లకు మిస్సమ్మ కాఫీ తీసుకుని వస్తుంది. సరస్వతి వార్డెన్ ఆశ్రమం పిల్లలను నాగార్జునసాగర్ టూర్‌కు తీసుకెళ్తున్నానని మీరు కూడా మీ పిల్లలను ఏమైనా పంపిస్తారేమోనని అడగడానికి వచ్చానని చెప్తుంది. వార్డెన్ మాటలు వినగానే మిస్సమ్మ భయపడుతుంది. పిల్లలను బయటకు పంపలేమని చెప్తుంది. పిల్లలు మాత్రం తాము వెళ్లాలని చెప్తారు. అమర్ కూడా పిల్లల కోరిక ఎందుకు కాదనాలి చెప్పండి అంటాడు.
నీకు అంతగా భయంగా ఉంటే పిల్లలతో పాటు నువ్వు రాథోడ్ కూడా వెళ్లండి అని చెప్పగానే.. రాథోడ్ వెళ్దా మిస్సమ్మ మనం తోడుగా ఉంటే పిల్లలకు ఏమీ కాదు అంటాడు. ఇక పార్థు కూడా మీరు వెళ్లండి నేను సాగర్ పోలీసులతో మాట్లాడి మీకు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాను అంటాడు. పోలీస్ సెక్యూరిటీ చాలా లేకపోతే ఇంకా మిలటరీని ఏమైనా దించాలా అంటూ అడగ్గానే.. మిస్సమ్మ అవసరం లేదు మేమే వెళ్తాము అని చెప్తుంది. ఎప్పుడు వెళ్తున్నారని అమర్ అడిగితే ఇవాళే లంచ్ తర్వాత వెళ్తున్నామని రాజు చెప్తాడు. అందుకోసం బస్సు బుక్ చేస్తున్నాము సార్ అని సరస్వతి వార్డెన్ చెబితే.. మీరేం బుక్ చేయోద్దు నేను బస్సు పంపిస్తాను అంటాడు అమర్.
వీళ్లంతా మాట్లాడుకోవడం చాటు నుంచి మొత్తం వింటుంది చంభా. వెంటనే ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వెళ్లి మనోహరికి విషయం చెప్తుంది. ఆ ప్రచండకు ఫోన్ చేసి బుజ్జమ్మ గురించి చెప్పు.. వాళ్లను కూడా నాగార్జున సాగర్ వెళ్లి బుజ్జమ్మతో ఉన్న ఆరు శక్తిని వశం చేసుకోమను అంటుంది. అవునా సరే అయితే అంటూ మనోహరి ప్రచండకు కాల్ చేస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.