Gundeninda GudiGantalu Today episode September 5th: బాలు మీరు నిజంగానే ఆ మాట అంటున్నారు బావ అని సంజుని అడుగుతాడు. అయితే సంజు కూడా నిజమే బావ నా తప్పైపోయింది అని ఆ ఒప్పుకుంటాడు. ఇక తర్వాత బాలు బాధపడిపోతూ ఉండగా మీనా మీరు ఆ మాట చెప్పకుండా మౌనికని తీసుకుని వచ్చి రాఖీ కడితే బాగుంటుంది కదా.. అని అంటుంది. అయితే ఆ మాట అనగానే నీలకంఠం మౌనికని తీసుకుని రాకుండా మేమెందుకు వస్తాం.. అమ్మ బయట కారులో ఉంది సంజు వెళ్లి మౌనికని తీసుకురా అని పంపిస్తాడు.. మౌనిక ఇంట్లోకి రాగానే అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. బాలు కి మౌనిక రాఖీ కట్టి నన్ను క్షమించు అన్నయ్య కొన్ని పరిస్థితుల వల్ల నేను అలా మాట్లాడాను అని చెప్తుంది. మొత్తానికి నేనా ఛాలెంజ్ చేసినట్లుగానే బాలుతో రాఖీ కట్టించేస్తుంది.
తన చెల్లెలు తనకు రాఖీ కట్టడం చాలా సంతోషంగా ఉంది అని దీనంతటికీ కారణం మీనాని అని బాలు మీనా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.. మీనా లోపలికి రాగానే రావే నా పూలగంప నీవల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు నాకు నా చెల్లెలు రాఖీ కట్టింది. అంటే అతను నవ్వు ఈ రాఖీ లో కనిపిస్తుంది. తన అంతటికి నువ్వే కారణం అని మీనా అని గట్టిగా కౌగిలించుకొని సంతోషంగా ఉంటాడు బాలు.. నీ మొహం లో ఈ సంతోషం చూడడానికే నేను మౌనిక దగ్గరికి వెళ్లాను కాని వాళ్ళకి ఏదో చెప్పానని చెప్పగానే బాలు అస్సలు నమ్మడు. ఏం చెప్పి వాళ్ళని ఒప్పించావో నాకు ఆ నిజం చెప్పు అని బాలు అడుగుతాడు. ఇకమీద జరిగిన విషయం అంతా బాలుకు చెప్పేస్తుంది. అమ్మనా పూలగంప నువ్వు ఇంత చేసావా నీలో ఇంత టాలెంట్ ఉందా అని పొగిడేస్తాడు. ఇక మౌనిక వరలక్ష్మీ వ్రతం ఉందని అక్కడే ఉంచుకుంటారు. నీలకంఠ కి రాఖీ కట్టి పెద్ద గిఫ్ట్ నే ఎక్స్పెక్ట్ చేస్తుంది. మొత్తానికి మేన అనుకున్న విధంగానే మౌనికను తీసుకొని వచ్చి బాలుకి రాఖీ కట్టించడం ఎపిసోడ్ కి హైలైట్ గా నిలిచింది.. ఈ సీన్ చూసిన జనాలు చాలా సంతోషంగా ఉంటారు..
సుశీలమ్మ అందరినీ కలిపి కూర్చోబెట్టి వరలక్ష్మి వ్రతం చేయించాలని ప్రభావతీతో చెప్తుంది.. కానీ ప్రభావతి మాత్రం రోహిణిని ఎట్టి పరిస్థితులను వరలక్ష్మీ వ్రతంలో కూర్చోబెట్టను అని చెప్తుంది. అదేంటి అందరూ వరలక్ష్మీ వ్రతంలో కూర్చోవాలని బామ్మ గారు చెప్పారు కదా మరి ఇప్పుడు మీరు వద్దు అని అంటున్నారు ఏమైంది అని అడుగుతుంది. ఈ మలేషియా మాయలాడి వ్రతంలో కూర్చోవడం నాకు ఇష్టం లేదు అని ప్రభావతి అంటుంది.. అదేంటి అత్తయ్య అందరూ కలిసి కూర్చుని వ్రతం చేస్తూనే బావుంటుంది కదా తనకి కూడా పెళ్లి అయింది కదా మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని మీనా అంటుంది. అయితే మీనా ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం మీ పని చూసుకో నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది. అత్తయ్య వ్రతంలో కూర్చోవద్దు అని అనిందంటే నాకు చాలా బాధగా ఉంది అని రోహిణి చాలా బాధపడిపోతూ ఉంటుంది.
రాత్రి మీనా శృతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన రోహిణి అత్తయ్య నన్ను ఈ వ్రతంలో కూర్చోవద్దు అని చెప్పింది. మీరు కనీసం అత్తయ్యకి చెప్పలేదు అని రోహిణి తెగ ఫీల్ అయిపోతుంది. ఇక్కడే ఉన్న రోహిణి ఎంతగా తన గురించి చెప్పాలని చూసినా సరే శృతి ఎప్పటికప్పుడు కౌంటర్లు వేస్తూనే ఉంటుంది. ఒకసారి నీ తరఫున మాట్లాడితేనే నువ్వు ఏమన్నా నా గురించి మాట్లాడవలసిన అవసరం మీకేంటి నేను అత్తయ్య చూసుకుంటాను అని అన్నావు కదా.. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఇలా అంటున్నావ్ ఏంటి అని శృతి రోహిణికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తూ వస్తుంది. రోహిణి అన్న మాటలు నీ పట్టుకొని శృతి మాటకు మాట సమాధానం చెప్పడంతో అటు మీనా కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోతుంది.. కానీ రోహిణి మాత్రం నన్ను సందు దొరికిందని ఇలా ఎత్తి పొడుస్తున్నావా అని ఎంతగా చెబుతున్నా సరే.. శృతి మాత్రం అస్సలు మాట వినకుండా రోహిణికి దిమ్మతిరిగిపోయేలా షాక్ఇస్తూనే ఉంటుంది..
శృతి ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావ్ రోహిణి అత్తయ్య పూజలో కూర్చోవద్దు అని చెప్పింది. తను కూడా మనలాగే పెళ్లయిన అమ్మాయి కదా తనని అర్థం చేసుకోవాలి కదా అని ఎంత చెప్తున్నా సరే శృతి మాత్రం రోహిణికి వరుసగా షాక్ లు ఇస్తూనే ఉంటుంది. అత్తయ్య అలా చెప్పింది అంటే నువ్వు చేసిన మోసం వల్లే కదా.. నువ్వు ఇంకేమీ మాట్లాడద్దు అని శృతి, రోహిణికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.. కానీ మీనా మాత్రం నువ్వేమీ బాధపడకు రోహిణి అత్తయ్యకి నచ్చ చెప్పేది ఒక్క మావయ్య గారు మాత్రమే ఆయనకు నేను చెప్తాను అని అంటుంది. ఎలాగైనా సరే నేను ఈ వ్రతంలో కూర్చోవాలి ఇది నా ఇజ్జత్కే సవాల్ అంటూ రోహిణి మరో ప్లాన్ చేసేందుకు సిద్ధమవుతుంది.
మా అత్తయ్య నన్ను వ్రతంలో కూర్చోవద్దు అని చెప్పింది. మనోజ్ తో కలిసి కూర్చొని నేను ఈ వ్రతం చేసుకోవాలి. ఏదో ఒకటి చేసిన సరే ఈ వ్రతంలో కూర్చోవాలి దాని కోసం నేను మాస్టర్ ప్లాన్ వేస్తున్నాను అని రోహిణి అంటుంది. నువ్వు ఇలా చేసినందుకే మీ అత్తయ్య వ్రతంలో కూర్చోవద్దని చెప్పింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేసి అడ్డంగా దొరికిపోతే మాత్రం నేను ఇంట్లో కూడా ఉండనివ్వరు అని బిజీ ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాటని ఎలాగైనా సరే తన కంట్రోల్లో పెట్టుకోవాలి అని రోహిణి ప్లాన్లు మీద ప్లాన్ వేస్తుంది.. రోహిణి ఏదో ఒకటి చేసి మళ్లీ నేను వ్రతంలో కూర్చుని మా అత్తయ్య మనసులో మంచి దానివి అని అనిపించుకోవాలి అని ప్లాన్ చేస్తుంది అనుకున్నట్లుగానే తన ప్లాన్ ని వర్కౌట్ చేసే ప్రయత్నం చేస్తుంది..
కామాక్షి ప్రభావతి ఉంటారని తెలిసి ఒక సోదావిడ కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అయితే కామాక్షి మాత్రం ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అని ఎంత చెప్తున్నా సరే.. వినకుండా నేను సోది చెప్తాను మీ గురించి మొత్తం నిజం చెప్తాను అని అంటుంది. అయితే ఆవిడ చెప్పినట్లుగానే రోహిణి పూజలో కూర్చుంటే అదృష్టం కలిసి వస్తుంది అని అనగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నీ కొడుకుకు అదృష్టం పట్టేలా చేయడానికి నీ కోడలు ఎప్పుడూ ముందుంటుంది తన చేత ఈ పూజ చేయించు అప్పుడే నీకు అంత మంచి జరుగుతుంది అని రోహిణి ప్లాంట్ ప్రకారం ఆ సోదావిడ నిజం చెప్తుంది. కానీ అక్కడ ప్రభావతి మాత్రం నమ్మినట్లే కనిపిస్తుంది. మరి రోహిణి నీ పూజలో కూర్చొనిస్తున్న లేదా అన్నది ఎపిసోడ్లో సస్పెన్స్ గా మారింది.
ఉదయం లేవగానే అందరూ వరలక్ష్మీ వ్రతం కాబట్టి అన్ని సిద్ధం చేసి పెడతారు. అయితే రోహిణి మాత్రం వరలక్ష్మీ వ్రతంలో తనని కూడా కూర్చోనిస్తుంది అని అనుకుంటుంది. కానీ రోహిణి ప్లాను వర్కౌట్ అవదు ప్రభావతి నువ్వు వ్రతంలో కూర్చోవాల్సిన అవసరం లేదు. వెల్లు నీ గదిలోకి అని చెప్తుంది. ఆ మాట వినగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక తన గదిలోకి వెళ్ళగానే మనోజ్ ని నేను కూడా ఈ పూజలో కూర్చుంటున్నాను అని ఎంతగా అడిగినా సరే మనోజ్ మాత్రం మా అమ్మ మాటే ఫైనల్ అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..