E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీ కోసం మహా ఒప్పుకుంటుందా..? రెచ్చిపోయిన తాయారు.. మాధవ్ కు నిజం తెలుస్తుందా..?

Podarillu Today Episode : చక్రీ కోసం మహా ఒప్పుకుంటుందా..? రెచ్చిపోయిన తాయారు.. మాధవ్ కు నిజం తెలుస్తుందా..?

Podarillu Today Episode February 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. మాధవ్ ఎంత చెప్తున్నా సరే చెక్రి మాత్రం వినడు కానీ చివరికి నేను ఒప్పిస్తాను అన్నయ్య అని లోపలికి వెళ్ళిపోతాడు.. లోపలికి వచ్చిన చక్రి మహాని అడుగుతాడు. ఈ రిసెప్షన్ గురించి మీకు తెలియదా ఏంటి అని మహా సీరియస్ అవుతుంది. ఈ పెళ్లి నిజం పెళ్లి కాదని మీ వాళ్లకు చెప్పేయండి ఈ ఏర్పాట్లు గనుక ఎక్కువైతే ఇంట్లో వాళ్ళందరూ బాధపడాల్సి వస్తుంది. మా వాళ్ళు ఎలాగైతే అపార్థం చేసుకున్నారు మీ వాళ్ళు కూడా దీని అర్థం చేసుకుంటే బాగుంటుంది అని మహాలక్ష్మి అంటుంది. కానీ మహాలక్ష్మి మాత్రం ఎంత చెప్తున్నా చక్రి మాత్రం మౌనంగా ఉంటాడు. ఇది నిజం పెళ్లి కాదని మీ వాళ్ళకి చెప్పండి అని మహాలక్ష్మి అంటుంది.. ఈ ఫంక్షన్ గనక జరిగితే పర్మినెంట్గా మీ భార్యని అయిపోతాను ఇది ఉంచుకోండి అని మహా చక్రితో అంటుంది..మహా చక్రి లోపలికి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు..

ఇంట్లో ఇలా ఫంక్షన్ గురించి చెప్పకుండానే అన్ని ఏర్పాట్లు చేశారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు అని మహా చక్రిపై సీరియస్ అవుతుంది.. కానీ చక్రి మాత్రం నాకేం తెలుసండి వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు చేశారు కానీ మనం ఇప్పుడు బయటకు వెళ్లకుండా మా ఇంట్లో వాళ్ళ పరువు పోతుంది.. ఇంట్లో వాళ్ళు ఇలాంటి ఏర్పాట్లు చేస్తారని నాకు అసలు తెలియదు.. అయితే మీ పక్కన నేను మీ భార్యగా నిలుచుని ఫోటోలకి ఫోజులు ఇవ్వమంటారా అని మహా సీరియస్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బయట ఫోన్లో ఒక మెసేజ్ రావడం అందరూ చూస్తారు. వార్తల్లో చక్రి మహాల పెళ్లి గురించి చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మా చక్రి చాలా ధైర్యం చేసి ఈ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికైనా అర్థమైందా వాళ్ళిద్దరికీ పెళ్లి అయింది అని అంటూ కేశవ అంటాడు.. ఇక చక్రి మహాతో నేను మాట్లాడతాను అని లోపలికి వెళ్తాడు. మహాలక్ష్మి మాత్రం మీరు ఇంకా నిజం చెప్పలేదు కదా.. నాకు అర్థం అయిపోయింది నేనే ఈ విషయాన్ని అందరికీ చెప్పేస్తాను అని బయటకు వస్తుంది.. కానీ చక్రి మాత్రం మీరు ఏమి మాట్లాడకండి మా ఇంట్లో వాళ్ళు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు అని ఆపుతాడు..

ఆ తర్వాత మహాను ఎలాగైనా కన్వెజ్ చేయాలని చక్రి అనుకుంటాడు.. అయితే బయటికి రాగానే మాధవ్ మళ్ళీ ఏమైంది రా ఎందుకు అమ్మాయి రెడీ అవ్వలేదు అని అడుగుతాడు. తను బాధపడుతుంది అన్నయ్య నేను ఎంత చెప్పినా కూడా వినడం లేదు అని చక్రి అంటాడు.. మహా మాత్రం ఈ విషయం ఎలాగైనా చెప్పి వాళ్ళు బాధపడిన సరే నిజం చెప్పాలని అనుకుంటుంది.. ఒకవైపు మాధవ్ వీళ్ళిద్దరి ఫంక్షన్ జరుగుతుందా లేదా అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. అప్పుడే బయటికి వచ్చిన మహాతో నిజం చెప్పాలని అంటుంది..

మా ఇంట్లో చేసిన పనికి నేను పెళ్లి చేసుకున్నాను అని మొదలు పెడుతుంది.. మీ పెళ్లి గురించి వార్తల్లో కూడా వచ్చేసింది అమ్మ ఇందాకే చూసాము అని మాధవ్ అంటాడు.. ఏంటి వార్తల్లో వచ్చిందా ఏంటి మీరు మాట్లాడేది ఏంటి నాకు అర్థం కావడం లేదు అని చెప్పగానే ఆ వీడియోని చూసి మహా షాక్ అవుతుంది.. అయితే మేము నిజంగానే పెళ్లి చేసుకోలేదు అని మహా చెప్తుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని మాధవ్ అడుగుతాడు.. అసలు జరిగిన విషయం ఇది అన్నా అని చక్రి అంటాడు.. ఇప్పుడు అందరూ వచ్చేసారు.. మనము అందరి ముందర పరువు పోగొట్టుకోకూడదు అంటే కచ్చితంగా దగ్గరికి వెళ్ళాలి అని మాధవ్ మహా కి అడుగుతాడు..

Also Read : వేదవతి కన్నీళ్లు.. తండ్రి కోసం వచ్చిన అమూల్య.. విశ్వం ఇంట్లో దొంగతనానికి భాగ్యం ప్లాన్..

చక్రిపై సీరియస్గా ఉన్న మహా ఈ వీడియో గురించి తెలుసుకొని ఇక చేసేది ఏమీ లేదు అని స్టేజ్ మీదకి వెళ్లడానికి ఒప్పుకుంటుంది.. తాయరు ఇదంతా చూసి కంగారు పడిపోతూ ఉంటుంది.. అసలు వీళ్ళిద్దరూ ప్రేమించే పెళ్లి చేసుకున్నారా చూస్తుంటే ఏదోలా ఉంది అని అనుమాన పడుతుంది.. కానీ మొత్తానికి చక్రిమహాలు స్టేజి మీదకి వెళ్ళగానే అందరూ చాలా అందంగా ఉన్నారు అంటూ మాట్లాడుకుంటారు.. ఇక గాయత్రి మాత్రం మా పెళ్లి ఇలా ఉంటే బాగుంటుంది అని ఊహించుకుంటుంది.. ఇలాంటివన్నీ మహా గాయత్రీ కి సారీ చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Podarillu Today Episode May 24th : మహా తండ్రి వచ్చాడు..సాయంత్ర

Intinti Ramayanam Today Episode: అవని దెబ్బకు పల్లవి అవుట్.. కమల్ ప్లాన్ సక్సెస్.. అవని నెక్స్ట్ ప్లానేంటి..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి మళ్ళీ ఇరుక్కుంటుందా..? ప్రభావతికి నిజం తెలిస్తే.. మీనా ప్లాన్ సక్సెస్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మద కోసం కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ..మళ్ళీ ఫిట్టింగ్ పెట్టిన శ్రీవల్లి..అయ్యో అమూల్య..

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. అన్నీ స్పెషలే..

Illu Illaalu pillalu prema : భర్తతో నాలుగేళ్ల ప్రయాణం.. ప్రేమ బేబీ బంప్స్ పిక్స్ వైరల్..

Karthika Deepam 2 Serial Today Episode May 23rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ప్లాన్ అట్టర్ ప్లాప్ – సుమిత్రకు దగ్గరైన దీప  

Podarillu Today Episode : ప్రతాప్ ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లకు కరిగిపోయిన మహా.. చక్రీని మహా వదిలేస్తుందా..?

Big Stories

×