E-Paper
Advertisement

Viral Video: ఎంతకి తెగించార్రా బాబు.. రీల్స్ మాయలో పడి నిండు నూరేళ్ల జీవితం బలి.. వీడియో వైరల్

Viral Video: ఎంతకి తెగించార్రా బాబు.. రీల్స్ మాయలో పడి నిండు నూరేళ్ల జీవితం బలి.. వీడియో వైరల్
Advertisement

Viral Video: కడప నగరంలో సోషల్ మీడియా క్రేజ్.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం సాహసాలు చేయబోయి ముబారక్ (20) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం తెల్లవారుజామున సుమారు ఒంటి గంట సమయంలో ఎయిర్‌పోర్ట్ రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వ్యూస్ కోసం యువత ప్రాణాలకు తెగించి చేస్తున్న విన్యాసాలు చివరకు వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిలిస్తున్నాయి.

స్థానిక సమాచారం ప్రకారం, ముబారక్ తన స్నేహితుడితో కలిసి స్కూటీపై వెళ్తూ ప్రమాదకరమైన రీతిలో స్టంట్లు (స్కైటింగ్) చేయడానికి ప్రయత్నించాడు. వేగంగా వెళ్తున్న వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఇద్దరూ రోడ్డుపై బలంగా పడిపోయారు. ఈ ప్రమాదంలో ముబారక్ అక్కడికక్కడే మరణించగా, అతనితో పాటు ఉన్న మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు అతడిని బెంగళూరుకు తరలించారు.

Advertisement

వ్యూస్ కోసం పాకులాట
నేటి తరం యువత సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుంటోంది. కేవలం కొన్ని సెకన్ల వీడియో కోసం, పదుల సంఖ్యలో వచ్చే లైక్స్ కోసం ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తూ, అర్థరాత్రి వేళల్లో రోడ్లపై ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్ రోడ్డు వంటి నిర్మానుష్య ప్రాంతాలను స్టంట్ల కోసం ఎంచుకోవడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు తక్షణ సాయం అందడం కూడా కష్టమవుతోంది.

Also Read: ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఆగని ట్రాఫిక్ నరకం.. 40 గంటలుగా నిలిచిపోయిన వాహనాలు!

Advertisement

అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. యువత ఇటువంటి ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు. క్షణికానందం కోసం చేసే ఇటువంటి ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెస్తాయని, సోషల్ మీడియా వ్యసనం ప్రాణాంతకంగా మారుతోందని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×