E-Paper
Advertisement

పొదరిల్లు.. మార్చి 29 : కాలేజీకి వెళ్లిన మహా.. ఆది ఎంట్రీతో సీన్ రివర్స్.. నారాయణను కత్తితో పొడిచిన ఆది..

పొదరిల్లు.. మార్చి 29 : కాలేజీకి వెళ్లిన మహా.. ఆది ఎంట్రీతో సీన్ రివర్స్.. నారాయణను కత్తితో పొడిచిన ఆది..
Advertisement

Podarillu Today Episode March 29th : నిన్నటి ఎపిసోడ్ లో.. చక్రి కారేశ్వర్ తో మాట్లాడి ఎలాగోలాగా బురిడీ కొట్టించి ఒక కారుని బుక్ చేస్తాడు.. మహాలక్ష్మిని అందరూ ఒంటరిగా పంపించడం ఇష్టం లేకపోయినా సరే సర్టిఫికెట్ల కోసమని అనగానే పంపిస్తారు. కార్ రాగానే అందరు జాగ్రత్తలు చెప్పి డబ్బులు ఇచ్చి పంపించాలని అనుకుంటారు.. వాళ్ళ అన్నదమ్ముల ప్రేమను చూసి మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఇక మాధవ్ చక్రి అందరూ కలిసి మహాలక్ష్మిని చాలా జాగ్రత్తగా కార్ ఎక్కించి పంపిస్తారు.. ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఫోన్ చెయ్ అమ్మ నువ్వేమీ భయపడకు అని మాధవ్ అంటాడు.. ఇప్పుడు నాన్న ఎందుకు వెళ్ళాడు అన్నయ్య మహాలక్ష్మి ఎంత భయపడిపోతుందో అని చక్రి ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన అక్కడ ఏం రచ్చ చేస్తాడు అసలే కాలేజ్ కదా ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉంటాడు చక్రి.. పోనీలేరా మనం ఎవరు వస్తామన్న మహాలక్ష్మి వద్దు అనింది కదా.. కనీసం నాన్న తోడుగా ఉంటాడు ఆయన ఏం చేయలేరా ఆయన గురించి తెలిసిందే కదా అని మాధవ్ చక్రితో అంటాడు..

నారాయణ కారు ఎక్కువగానే డ్రైవర్ తో ఒక ఆట ఆడుకుంటాడు. మేము యాదగిరిగుట్ట కు వెళ్తున్నాము అని డ్రైవర్ ఉపేంద్ర అనగానే నేను మీరెక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను అని అంటాడు. ఇక మంచి పాటలు పెట్టు అని డ్రైవర్ని విసిగించేస్తాడు నారాయణ. చక్రి మాత్రం నాన్న మహాలక్ష్మిని ఎంతగా ఇబ్బంది పెడుతున్నాడు ఏంటో అని కంగారు పడిపోతూ ఉంటాడు. నువ్వేమీ కంగారు పడకు రా నాన్న తోడుగానే వెళ్ళాడు కదా జాగ్రత్తగా తీసుకొని వస్తాడు అని మాధవ అంటాడు. ఇంటికి వచ్చిన కన్నాకి కేశవ కి మహాలక్ష్మికి తోడుగా నాన్న వెళ్ళాడు అని అనగానే. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్లి ఎంత రచ్చ చేస్తాడో అక్కడ కూడా తాగేసి పడిపోతాడు ఏంటో అని కన్నా కేశవ ఇద్దరు కూడా సీరియస్ అవుతారు.. నారాయణ చేష్టలకి మహాలక్ష్మి ఇబ్బందిగా ఫీల్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. మహాలక్ష్మి మొత్తానికి యాదగిరిగుట్ట కి చేరుకుంటుంది.. కాలేజీలో పని పూర్తవడానికి ఆలస్యం అవుతుంది మీరు ఇక్కడే ఉండండి అని నారాయణతో అంటుంది.. అక్కడే పని చేసే ఫ్యూను మహాలక్ష్మి వస్తే చెప్పమని చెప్పిమొండోడున ఆదికి ఫోన్ చేసి ఆమె వచ్చింది అని చెప్తాడు.. కేశవ్ మాత్రం శైలుకు ఫోన్ చేసి నీ ఫోన్ ఇస్తాను రా అని చెప్పేసి అంటాడు. శైలు మాత్రం అది నిజమేనని నమ్ముతుంది. ఈ  దిగొచ్చినట్టు ఉన్నాడు నా ఫోన్ నాకు ఇస్తానన్నాడు నా ఫాలోవర్స్ అందరూ తగ్గిపోయినట్లున్నారు. వెంటనే రీల్స్ చేయాలి అని ఆశగా కేశవ్ చెప్పిన లొకేషన్ కి వెళ్తుంది.. ఎలాగైనా సరే ఈ బుస్సు కి దిమ్మ తిరిగిపోయేలా చేయాలి అని అనుకుంటాడు.. మహాలక్ష్మి తన ఫ్రెండ్ ని కలిసి సర్టిఫికెట్ల కోసం అప్లై చేయాలి అని వెళ్తుంది.. నారాయణ ఉపేంద్ర అని ఒక ఆట ఆడుకుంటాడు. అసలు మీరు ఎందుకు వచ్చారండి అని ఉపేంద్ర ఒక పైపు ఎంత చెప్తున్నా సరే నారాయణ మాత్రం తనని పరువు తీసేలా మాట్లాడుతూనే ఉంటాడు..

కాలేజీలో సర్టిఫికెట్ల గురించి తెలుసుకున్న మహాలక్ష్మి అక్కడ అప్లై చేసిన తర్వాత మళ్ళీ సర్టిఫికెట్లు తీసుకొని ఎలాగైనా సరే.. ఇవాళ తొందరగా ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటుంది.. అయితే విషయం తెలుసుకున్న ఆది అక్కడికి వస్తాడు.. మహాలక్ష్మి ఆదిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాన్న అవసరం లేదు కానీ నాన్న చదివించిన చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు నీకు కావాలా ఎందుకే ఇలా చేస్తున్నావు అని ఆది సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు.. మహాలక్ష్మి మాత్రం నా సర్టిఫికెట్ల గురించి అడగడానికి నువ్వెవరు నీకు నాకు ఏ సంబంధం లేదని కాల్చేశారు కదా.. అక్కడితోనే అవి అయిపోయాయి ఇక మళ్లీ రావాల్సిన అవసరం లేదు కదా అని మహాలక్ష్మి అంటుంది..

Advertisement

Also Read :మీనా దగ్గరకు వెళ్లిన బాలు.. శివ కోసం వచ్చిన పోలీసులు.. ఆత్మహత్య చేసుకుంటాడా..?

నువ్వు ఎప్పుడు ఎప్పుడు కాలేజీకి వస్తావా అని కనిపెట్టుకొని చూస్తున్నాను. మొత్తానికి వచ్చేసావు ఇక నిన్ను ఇంటికి తీసుకెళ్లి అక్కడే లాక్ చేసేస్తాను అని ఆది అంటాడు. ఆ మాట వినగానే మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రావే ఇంటికి తీసుకెళ్లాలి అని మహాలక్ష్మిని బలవంతం చేస్తాడు ఆది.. అదంతా చూసిన నారాయణ ఇలాంటిది ఏదో జరుగుతదానమ్మ నీకోసం నేను వచ్చాను అని అంటాడు.. వీళ్ళిద్దరూ కలిసి కాసేపు గొడవపడతారు.. ఇక తర్వాత అందరూ కలిసి మహాలక్ష్మిని బలవంతంగా తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తారు.. నారాయణ మాత్రం అరే ఉప్పిగా నువ్వు కార్ స్టార్ట్ చేయరా.. నువ్వెక్కమ్మా వీడి సంగతి నేను చూసుకుంటాను అని నారాయణ అంటాడు.. ఇక తర్వాత మహాలక్ష్మి కారు ఎక్కగానే నారాయణను ఆది కత్తితో పొడుస్తాడు.. అది చూసిన మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×