E-Paper
Advertisement

విశ్వాసం అంటే ఇదేనేమో.. రూ.5 బిస్కెట్ ప్యాకెట్ కోసం 130 కిలోమీటర్ల పాదయాత్ర! వీడియో వైరల్

విశ్వాసం అంటే ఇదేనేమో.. రూ.5 బిస్కెట్ ప్యాకెట్ కోసం 130 కిలోమీటర్ల పాదయాత్ర! వీడియో వైరల్
Advertisement

Loyal Dog: సాధారణంగా మనుషుల మధ్యే కృతజ్ఞతా భావం తగ్గిపోతున్న ఈ రోజుల్లో, ఒక మూగజీవి చూపిన అనురాగం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేవలం ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్ అందించినందుకు ఆ శునకం చూపిన కృతజ్ఞత, భక్తి నేడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హనుమాన్ భక్తులు తమ మాల విరమణ కోసం కొండగట్టు అంజన్న క్షేత్రానికి బయలుదేరగా, ఆ ప్రయాణంలో ఒక అనూహ్య అతిథి తోడైంది.

వివరాల్లోకి వెళితే..
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు నుంచి కాలినడకన కొండగట్టుకు బయలుదేరిన దీక్షాపరులకు ఉట్నూరు సమీపంలో ఒక శునకం తారసపడింది. మార్గమధ్యలో సేద తీరుతున్న సమయంలో భక్తులు ఆకలితో ఉన్న ఆ శునకానికి ఒక ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్‌ను ప్రేమతో అందించారు. ఆ చిన్న సాయమే ఆ మూగజీవి మనసును గెలుచుకుంది. అప్పటి నుండి ఆ భక్తులను వదిలిపెట్టకుండా వారి వెంటే అడుగులు వేయడం ప్రారంభించింది.

Advertisement

దాదాపు ఐదు రోజుల పాటు ఎండనక, వాననక ఆ శునకం భక్తులతో కలిసి సుమారు 130 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. భక్తులు నడుస్తుంటే వారితో పాటు నడవడం, వారు ఆగితే పక్కనే ఆగడం చేస్తూ ఒక నీడలా మారింది. ఆంజనేయ స్వామి భక్తుల భజనలు, నామస్మరణల మధ్య ఆ శునకం కూడా భక్తితో సాగుతున్నట్లుగా అనిపించడం అక్కడి వారిని మంత్రముగ్ధులను చేసింది.

సుదీర్ఘ ప్రయాణం కావడంతో ఆ మూగజీవి కాళ్లు వాచిపోయి, నడవడానికి ఇబ్బంది పడటం గమనించిన దీక్షాపరుల మనసు ద్రవించింది. సాటి జీవి పట్ల కారుణ్యం చూపడం మాల ధారణలోని అసలు ఉద్దేశమని భావించిన భక్తులు, ఆ శునకానికి సాక్సులు తొడిగి, గాయాలకు మందులు రాసి ప్రేమగా సేవలందించారు. ఆ బాధలోనూ అది తోక ఆడిస్తూ వారి ప్రేమను స్వీకరించడం చూసి అందరూ పరవశించిపోయారు.

Advertisement

Also Read: ప్రేమ కోసం ప్రాణాలు తీసుకున్న లవర్స్.. వారికి గుడి కట్టి పెళ్లి చేస్తున్న గ్రామస్తులు

చివరికి కొండగట్టు ధామం చేరుకునే వరకు ఆ శునకం వారి వెంటే ఉండి తన విశ్వాసాన్ని చాటుకుంది. “విశ్వాసం అంటే ఇదేనేమో” అని చూసే ప్రతి ఒక్కరూ అనుకునేలా ఆ మూగజీవి ప్రవర్తన ఉంది. కేవలం ఒక బిస్కెట్ ప్యాకెట్‌కు బదులుగా అది చూపిన ఈ అంతులేని అనురాగం, మానవత్వానికి, జంతుప్రేమకు ఒక గొప్ప నిదర్శనంగా నిలిచిపోయింది.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×