Rashmika Manadanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒక్క సినిమాతో ఆమె లైఫ్ పూర్తిగా మారిపోయింది. పుష్ప సినిమాతో ఆమె జీవితం మూడుపువ్వులు ఆరుకాయలుగా మారింది అని చెప్పడంలో సందేహం లేదు.. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా నటిస్తూ తన సత్తాని చాటుతుంది. రీసెంట్ గా థామా చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది.. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్లు కూడా ఎక్కువగానే వచ్చాయి.. ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉంది రష్మిక. ఈనెల 7న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్నో ఛానల్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది. తాజాగా జీ తెలుగులో ప్రసారమవుతున్న జగపతిబాబు షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ పాల్గొంది.. ఇందులో తన చేతికున్న రింగు గురించి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సీనియర్ హీరో జగపతిబాబు ఈమధ్య బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే షో కి హోస్టుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది హీరోలు హీరోయిన్లు ఆ షోలో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా ఈ షో కి రష్మిక మందన గెస్ట్ గా వచ్చారు. నీ గర్ల్ ఫ్రెండ్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఈ షో కి వచ్చిన ఆమె తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో తన చేతికున్న రింగు గురించి జగపతిబాబు అడిగారు. చేతికి ఆ రింగ్స్ ఏమైనా సెంటిమెంటా? ఏంటి’ అనే ప్రశ్నకు సమాదానం చెప్పింది రష్మిక.. ఆమె మాట్లాడుతూ.. ఇవి చాలా ఇంపార్టెంట్ రింగ్స్అని చెప్పారు. వాటిల్లో ఓ రింగ్ ఫేవరెట్ అయ్యింటుంది. దాని వెనుక ఓ హిస్టరీ ఉంది. అంటూ జగపతి బాబు అనగా… రష్మిక సిగ్గు పడిపోయారు.. మొత్తానికి ఎంగేజ్మెంట్ రింగ్ అని కన్ఫామ్ అయిపోయింది. సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది..
Also Read : అక్కడ ‘బాహుబలి ది ఎపిక్’ ఆల్ టైం రికార్డ్ బ్రేక్.. ఎన్ని కోట్లంటే..?
రష్మిక మందన్న బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు తో పాటుగా బాలీవుడ్ లో కూడా హిట్ చిత్రాలలో నటిస్తూ వస్తుంది.. ఈమధ్య ఆయుష్మాన్ ఖురానా తో స్క్రీన్ షేర్ చేసుకుంది.. వీరిద్దరూ కలిసి థామా చిత్రంలో నటించారు. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతుంది రష్మిక. ఆ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతోంది.. ఈ సినిమా రష్మికకు 100 కోట్ల వసూళ్లను అందిస్తుందేమో చూడాలి..