Jabardasth:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను గత పుష్కరకాలంగా అలరిస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ షో గా పేరు సొంతం చేసుకుంది జబర్దస్త్ . ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు అయినటువంటి నాగబాబు (Nagababu), ప్రముఖ సీనియర్ హీరోయిన్, మాజీ మినిస్టర్ రోజా(Roja ) జడ్జిలుగా వీరి ఆధ్వర్యంలో ఈ షో ప్రారంభం అయ్యింది. ముఖ్యంగా వేణు, ధనరాజ్, శంకర్ , తాగుబోతు రమేష్ ఇలా కొంతమంది ఆర్టిస్టులతో ప్రారంభమైన ఈ కామెడీ షో అంతకంతకు ఎదుగుతూ ఎంతోమందికి ఉపయోగపడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా చాలామంది టాలెంట్ ఉన్నవారికి ఈ వేదిక కేరాఫ్ అడ్రస్ గా మారింది. అలా ఈ షోలో కామెడీ పండించి జనాలలో మంచి పేరు దక్కించుకొని ఇప్పుడు సినిమాలలో సత్తా కూడా చాటుతున్నారు.
ఇకపోతే ఈ జబర్దస్త్ షోలో తమ కామెడీతో పేరు సొంతం చేసుకున్న చమ్మక్ చంద్ర , సుధీర్, షకలక శంకర్, వేణు, ధనరాజ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కమెడియన్స్ జబర్దస్త్ లో ఒకప్పుడు తమ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకొని.. ఇప్పుడు ఇండస్ట్రీలో కమెడియన్స్ గా, దర్శకులుగా, హీరోలుగా నిలదొక్కుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఉదాహరణకు వేణు వండర్స్ అంటూ జబర్దస్త్ లో తెగ సందడి చేసిన ఈయన.. బలగం అనే సినిమా చేసి స్టార్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఎల్లమ్మ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే ధనరాజ్ ఒకవైపు హీరోగా.. మరొకవైపు నిర్మాతగా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పాత్రలు చేసి ఆకట్టుకుంటున్నారు. ఇక సుధీర్ హీరోగా సెటిల్ అయిపోయిన విషయం తెలిసిందే.
ALSO READ:Sai Kiran: 47 ఏళ్ల వయసులో శుభవార్త చెప్పిన సాయికిరణ్.. పోస్ట్ వైరల్!
ఇలా ఈ జబర్దస్త్ వేదిక ఎంతోమందికి జీవితాన్ని ప్రసాదించింది. అయితే సడన్గా తాజా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఆ ప్రోమో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏకంగా 6 మంది టీం లీడర్స్ జబర్దస్త్ గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ట్రాన్స్ జెండర్స్ అంతా ఒక స్క్రిప్ట్, లేడీస్ అంతా ఒక స్క్రిప్ట్, టీం లీడర్స్, జూనియర్స్, పిల్లలు అందరూ ఒక్కొక్క కేటగిరి ఎంచుకొని స్క్రిప్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని చెబుతూ.. భాస్కర్ మాట్లాడుతూ.. మేము 6 మంది టీం లీడర్స్ కలిసి ఒక స్క్రిప్ట్ చేస్తున్నాము. ఇందులో 10 కి 10 మార్కులు రాకపోతే మేము కచ్చితంగా జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతాం అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకవేళ ఈ 6 మంది గనుక పదికి పది మార్కులు తెచ్చుకోకపోతే ఇక జబర్దస్త్ కి దూరమైనట్లే అని చెప్పవచ్చు. మరి అసలు విషయం ఏమిటో తెలియాలి అంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.