Satyabhama Final Episode : సంధ్య సంజయ్ ప్లాన్ ను బయటపెట్టేస్తుంది. బావగారిని దెబ్బ కొట్టాలని మరో ప్లాన్ వేస్తున్నాడు అక్క అనేసి అంటుంది. ఏంటది అంటే బావగారి వల్ల అసలు తల్లిని చంపింది మావయ్య అంట. ఆవిషయాన్ని బావగారికి చెప్పి మామయ్య అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేస్తున్నాడు అని చెబుతుంది. అది విన్న క్రిష్ వెంటనే కోపంతో మహదేవయ్య దగ్గరికి వెళ్తాడు.. ఆవేశంగా బయటకు వెళ్లడం సత్యతో పాటు అందరూ చూస్తారు. సత్య, సంధ్యలు మహదేవయ్య ఇంటికి పరుగులు తీస్తారు. సంజయ్ తన తండ్రిని క్రిష్ చంపేస్తాడనని కలలు కంటూ ఎంజాయ్ చేస్తుంటాడు. మహదేవయ్య చనిపోతే తనకు అడ్డులేదని ఈ సామ్రాజ్యం అంతా తనదే అని గెంతులేస్తాడు. క్రిష్ మహదేవయ్య ఇంటి తలపులు తన్ని లోపలికి వెళ్లడం చేతిలో కత్తి చూసిన మహదేవయ్య చిన్నా అని భయపడతాడు. ఎందుకు చంపినావ్ మా అమ్మని ఎందుకు చంపావ్ అని క్రిష్ అడిగితే క్రిష్కి నిజం తెలిసిపోయిందని మహదేవయ్య క్రిష్ని బతిమాలుతాడు. నా కన్న తల్లిని ఎందుకు చంపావ్ అని క్రిష్ అడుగుతూ నువ్వు చేసిన ద్రోహం తెలియగానే నా గుండె ముక్కలు అయిపోయిందని కేకలేస్తాడు… అక్కడితో ముందు రోజు ఎపిసోడ్ అయిపోతుంది..
ఫైనల్ ఎపిసోడ్ హైలెట్స్ విషయానికొస్తే.. సంజయ్ మహదేవయ్య ను చంపడానికి ట్రై చేస్తాడు. మహదేవయ్యా సంజయ్ ని ఎదిరించి కృష్ణ ఇంటికి తీసుకురావాలని మొండికేసుకుంటాడు. అటు కృషి తన బ్రెస్లై ట్ పోయిందని వెతుక్కుంటూ మహదేవ ఇంటికి వస్తాడు. మహదేవయ్యా సంజయ్ మధ్య గొడవ జరుగుతుండడం చూసి మధ్యలో మహదేవయ్యను కాపాడ్డానికి వచ్చేస్తాడు. సంజయ్ అతను మా డాడీ నాకు వదిలేసి నువ్వు వెళ్ళిపో అని క్రిష్ తో గొడవకు దిగుతాడు మూర్ఖంగా ప్రవర్తిస్తాడు..
భైరవి సహా ఇంట్లో అందరూ వచ్చి బతిమలాడినా వినడు. ఇంతలో క్రిష్ వచ్చి కత్తికి అడ్డం నిలబడతాడు. నీ కొడుకుని కొట్టినందుకు క్షమించు అని మహదేవయ్యను అడుగుతాడు. మళ్లీ మహదేవయ్యని చంపేందుకు వస్తే మహదేవయ్య కాలితో తంతాడు.. క్రిష్ నీకు తెలుసుకదా ఏం చేయాలో అని సైగ చేస్తాడు మహదేవయ్య. భైరవి కూడా నేను తప్పుచేశాను క్రిష్ అని బాధపడుతుంది. మళ్లీ మహదేవయ్యని చంపేందుకు వస్తే మహదేవయ్య కాలితో తంతాడు.. క్రిష్ నీకు తెలుసుకదా ఏం చేయాలో అని సైగ చేస్తాడు మహదేవయ్య. భైరవి కూడా నేను తప్పుచేశాను క్రిష్ అని బాధపడుతుంది.. కన్న కొడుకుని ఇన్ని రోజులు చూడలేదు కదా అని వాడి మీద ప్రేమను కురిపించాలి అనుకున్నాను ఇక వాడు చెప్పినట్టుగా నేను చేశాను కానీ చివరికి నన్ను నా భర్తనే చంపాలని చూసాడు చూసావా పెనిమిటి నిన్ను చంపాలని చూసాడంటే ఇంక నేను ఎందుకు ఊరుకుంటానని భైరవి అంటుంది.
అటు సంజయ్ వీరందరి ప్రేమను చూసి షాక్ అవుతాడు. ఇక క్రిష్ తన బాపు పై కోపాన్ని చూపిస్తాడు. మహాదేవయ్య కూడా కొడుకుపై కోపం, ప్రేమను ఒకేసారి చూపిస్తాడు. వచ్చే జన్మలో వీడు మన కొడుకుగా పుట్టాలి అని ఏడుస్తారు మహదేవయ్య, భైరవి. నన్ను మీ తమ్ముడికి ఇచ్చేస్తావా అని క్రిష్ ఏడుస్తాడు. ఇద్దరూ హగ్ చేసుకుని కన్నీళ్లు పెడతారు. ఇద్దరి మాటలు విని అక్కడున్నవారంతా నవ్వుకుంటారు. మహదేవయ్య, భైరవి ఇద్దరూ సత్యకి క్షమాపణలు చెబుతారు. ఇక అందరూ సంతోషంగా ఉంటారు.. జయమ్మ కలిసి పోయారు ఈ జన్మకి నాకి సంతోషం చాలు ఇదంతా కాదు నా చేతుల్లో మీరు ముని మనవాలని ఎప్పుడు పెడతారు అని అడుగుతారు అప్పుడు అందరూ నవ్వుతారు దాంతో శుభం కార్డు పడిపోతుంది.. ఇక సత్యభామ సీరియల్ అయిపోతుంది .. ఈ సీరియల్ ప్లస్ లో స్టార్ మా కొత్త సీరియల్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఆ సీరియల్ ఏంటో త్వరలోనే తెలియనుంది..