Suma Adda : తెలుగు బుల్లితెరపై వస్తున్న షోలలో ఈటీవీలో వస్తున్న షోలకు మంచి టిఆర్పి రేటింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అందులో యాంకర్ సుమ ప్రోగ్రాంలకు జనాలు ఆసక్తి కనబరుస్తుంటారు. ఆమె ఏ షోలో కనిపిస్తే ఆ షో హిట్ అవుతుంది. అందులోనూ సుమా యాంకర్ గా చేసే సుమ అడ్డాకు ఫాలోయింగ్ ఎక్కువే.అయితే ఈ షో టైమ్ ఇప్పుడు మూడోసారి మారబోతోంది. మారిన టైమ్ మార్చి 16 నుంచి మళ్లీ షో మొదలు కాబోతుంది. గతంలో ఈ షోకు మంచి క్రేజ్ రావడంతో ఇప్పుడు మళ్లీ ఈ షోను తీసుకువచ్చారు ఈటీవీ.. గతంలో వీక్ డేస్ లో ఈ షో ప్రసారం అయ్యేది. కానీ ఇప్పుడు ఆదివారం ఈ షో రాబోతుంది. దాంతో వ్యూస్ పెరిగే అవకాశాలు ఉన్నాయని మేకర్స్ భావిస్తున్నారు.. తాజాగా ఈ షో ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ ప్రోమో హైలెట్స్ ఒకసారి చూసేద్దాం..
సుమ అడ్డా ప్రోమో..
యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహారిస్తున్న సుమ అడ్డా ప్రోమోలో.. జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ వచ్చాడు. గతంలో లాగే ఈసారి కూడా తన కామెడీ పంచులతో కడుపుబ్బా నవ్వించేసాడు. మ్యాడ్ స్క్వేర్ సినిమా మూవీ యూనిట్ వచ్చింది. ఈ సినిమాలో అనుదీప్ కూడా చిన్న గెస్ట్ రోల్ చేసాడు. దీంతో ఈ టీమ్ తో అనుదీప్ కూడా సుమ అడ్డా షోకి వచ్చాడు.. అనుదీప్ తన కామెడీతో ఫుల్ గా నవ్వించాడు. దీంతో ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. గతంలో కూడా ఈయన సుమ షోకు వచ్చారు. అప్పుడు బాగా ఫెమస్ అయ్యారు. దాంతో మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి వచ్చేసాడు. అనుదీప్ వచ్చిన ఈ ఫుల్ ఎపిసోడ్ మార్చ్ 16 ఆదివారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఈటీవీలో టెలికాస్ట్ కానుంది.. అస్సలు మిస్ అవ్వకుండా ఆ ఎపిసోడ్ ను చూసి ఎంజాయ్ చెయ్యండి. ప్రోమో ఎలా ఉందో ఓ లుక్ వేసుకోండి.
Also Read : రష్మిక పై ట్రోల్స్.. సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్..
డైరెక్టర్ అనుదీప్..
టాలీవుడ్ డైరెక్టర్ అనుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. జాతి రత్నాలు సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఆ సినిమా ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత సినిమాలు కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో వీడియోలు రూల్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. గతంలో యాంకర్ సుమ క్యాష్ షోకి అనుదీప్ వచ్చి ఫుల్ కామెడీ చేయడంతో బాగా వైరల్ అయ్యాడు.. అనుదీప్ కి కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఒక్కసారే అనుకుంటే రెండో సారి కూడా సుమ క్యాష్ షోకి వెళ్లి మరోసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ ఇచ్చాడు. ఆ సోలో ఆయన చేసిన రచ్చ అంతా కాదు అందుకు సంబంధించిన వీడియోలు రీల్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్అవుతూనే ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ షోకి మ్యాడ్ స్క్వేర్ సినిమా మూవీ యూనిట్ వచ్చింది. ఈ సినిమాలో అనుదీప్ కూడా చిన్న గెస్ట్ రోల్ చేసాడు. దీంతో ఈ టీమ్ తో అనుదీప్ కూడా సుమ అడ్డా షోకి వచ్చాడు.. మళ్లీ సుమపై పంచులేసి హైలెట్ అయ్యాడు. ప్రస్తుతం ప్రోమో అయితే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. మ్యాడ్ స్క్వేర్ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతుంది.