E-Paper
Advertisement

Brahmamudi Serial Today October 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు షాక్‌ ఇచ్చిన రాజ్‌ – విడాకులకు రెడీ అయిన రాజ్‌  

Brahmamudi Serial Today October 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు షాక్‌ ఇచ్చిన రాజ్‌ – విడాకులకు రెడీ అయిన రాజ్‌  
Advertisement

Brahmamudi serial today Episode: అప్పు బాధపడటం రుద్రాణి చూసి ధాన్యలక్ష్మీని తీసుకొచ్చి అప్పును చూపిస్తుంది. కావ్య, రాజ్‌ ల గొడవల కారణంగా నీ కోడలు బాధపడుతుంది. నువ్వు ఇలాగే చూస్తూ ఉంటే రాజ్‌ అన్నట్టు అబార్షన్‌ కావ్యకు కాదు నీ కోడలికి అవుతుంది.. చూస్కో మరి జాగ్రత్తగా ఉండాలి కదా అంటూ లేనిపోని కథలు నూరిపోసి వెళ్లిపోతుంది. అప్పుడే కింద నుంచి కళ్యాణ్‌ వస్తుంటే.. ఎదురుగా వెళ్లి ఒరేయ్‌ కళ్యాణ్‌ నువ్వు అప్పు కాసేపు సరదాగా ఎక్కడికైనా వెళ్లొచ్చు కదా అని చెప్తుంది. ఇప్పుడా తర్వాత వెళ్తాం లే అమ్మ ఆని కళ్యాణ్ చెప్పగానే.. ఇప్పుడే వెళ్లండి.. నేను వద్దని చెప్పినప్పుడు వెళ్లే వాళ్లు ఇప్పుడు నేను చెప్తుంటే వెళ్లడం లేదేంటి..? అంటూ కోప్పడుతుంది.

దీంతో కళ్యాణ్‌ సరే లే అమ్మా అంటాడు. ఇంకో విషయం తనను ఎప్పుడూ అలా డల్లుగా ఉండొద్దని చెప్పు.. పుట్టే పిల్లలు కూడా అలాగే డల్లుగా ఉంటారు అని చెప్తుంది ధాన్యలక్ష్మీ సరే అమ్మా అంటూ కళ్యాణ్‌ అప్పు దగ్గరకు వెళ్తాడు. పొట్టి మనం కాస్త అలా బయటకు వెళ్దామా..? అని అడుగుతాడు. కళ్యాన్‌ను చూసిన అప్పు కన్నీళ్లు తుడుచుకుంటూ నాకు ఇప్పుడు మూడ్‌ లేదు కూచి అంటుంది. మన కోసం కాదు పొట్టి అమ్మ కోసం అమ్మ నిన్ను గమనిస్తుంది. అందుకే రిలాక్సేషన్‌ కోసం బయటకు తీసుకెళ్లమని మరీ మరీ చెప్పింది. వెళ్లకపోతే హర్ట్‌ అవుతుంది. పొట్టి ఫ్లీజ్‌ వెళ్దాం పద అని కళ్యాణ్‌ అడగ్గానే.. అప్పు సరే వెళ్దాం పద అని ఇద్దరూ వెళ్లిపోతారు. ధాన్యలక్ష్మీ హ్యాపీగా ఫీలవుతుంది.

Advertisement

మరోవైపు రాజ్‌ బయట ఆలోచిస్తూ ఉంటే.. కావ్య వెళ్లి ఇక్కడేం చేస్తున్నావు.. ఇప్పుడు చూడండి నేను నిన్ను ఎలా రెచ్చగొడతాను. అని మనసులో అనుకుని తన లాయరు ఫ్రెండ్‌కు ఫోన్‌ చేసినట్టు నాటకం ఆడుతుంది. తనకు విడాకులు ఇప్పించాలని మాట్లాడుతుంది. అప్పుడే బయటకు వచ్చిన కళ్యాణ్‌, అప్పు చూసి షాక్‌ అవుతారు. అప్పు మరింత బాధపడుతుంది. అక్క అలా బాధపడుతుంటే మనం బయటకు వెళ్లి సంతోషంగా ఎలా గడపగలం నా వల్ల కాదు కూచి ఐయామ్‌ సారీ అంటూ లోపలికి వెళ్తుంది. లోపలికి వచ్చిన అప్పును ధాన్యలక్ష్మీ చూసి అప్పు ఇందాకే కదా బయటకు వెళ్తున్నానని చెప్పావు.. మరి ఇంతలోనే వచ్చేశావు.. వెల్లడం లేదా..? అని అడుగుతుంది.

వెళ్దామనే అనుకున్నాను అత్తయ్యా కానీ వెళ్లలేకపోయాను నన్ను క్షమించండి అత్తయ్యా అంటూ లోపలికి వెళ్లిపోతుంది అప్పు. అసలు ఏమైంది దీనికి అని ధాన్యలక్ష్మీ అనుకుంటుండగా అంతా గమనించిన రుద్రాణి ఇప్పుడు చెప్తాను అంటూ వచ్చి ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతుంది. అప్పు బయటకు వెళ్లకపోవడానికి కారణం ఆ కావ్యే.. అని చెప్పగానే.. ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి అని అడుగుతుంది ధాన్యలక్ష్మీ. అవును ధాన్యలక్ష్మీ నీ కోడలు ఆనందాలను సంతోషాలను దూరం చేస్తుంది ఆ కావ్యే.. పాపం అప్పు హ్యాపీగా ఉండాలనే ప్రయత్నిస్తుంది. కానీ ఏం లాభం.. ప్రతిక్షణం ఇంట్లో గొడవలు జరుగుతుంటే ఎవరైనా ఎలా హ్యాపీగా ఉండగలరు చెప్పు.

Advertisement

ఇందాక నీ మాట గౌరవంతో తన బిడ్డ మీద ప్రేమతో హాయిగా కాసేపు బయటకు వెళ్లడానికి బయలుదేరారు. శుభకార్యానికి వెళ్లే ముందు అశుభం ఎదురైనట్టు ఆ కావ్య ఎదురైంది. ఫోన్‌లో విడాకుల గురించి మాట్లాడుతూ కనిపించింది.  ఇక అంతే అక్క కష్టాన్ని చూడలేక చెల్లి గుండె కరిగిపోయి మళ్లీ మనసు మార్చుకున్నట్టు ఉంది. అందుకే మళ్లీ ఇంట్లోకి వచ్చేసింది. పాపం కావ్య కారణంగా నీ కోడలు అప్పు చాలా నలిగిపోతుంది ధాన్యలక్ష్మీ. ఇప్పటికైనా కళ్లు తెరువు దాన్యలక్ష్మీ ఏదో ఒక ప్రాబ్లం రాకముందే అలర్ట్‌ అవ్వు. లేకపోతే ఆ తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. చూడు ధాన్యలక్ష్మీ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పు. అంటూ తన మాటలతో ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

తర్వాత కావ్యను అబార్షన్‌ చేయించుకోవడానికి రమ్మని పిలుస్తాడు. దీంతో కావ్య కోపంగా రానని కారణం చెబితేనే వస్తానని లేదంటే నేను కూడా మీకు దూరంగా ఉంటాను వెంటనే డివోర్స్‌ తీసుకుంటాను అని చెప్పగానే రాజ్‌ కూడా అయితే వెళ్లు వెళ్లి డివోర్స్‌ పేపర్స్‌ తీసుకుని రా ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతాను అంటాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంద్రాదేవి రాజ్‌ను తిడుతుంది. ఇంతలో అప్పు స్పృహ తప్పి కింద పడిపోతుంది. అందరూ కంగారుగా అప్పు అంటూ వెళ్లగానే కావ్యను ధాన్యలక్ష్మీ తిడుతుంది. నా కోడలును ముట్టుకోవద్దు అంటుంది. అత్తయ్య నేను ఏం చేశాను.. అని అడుగుతుంది కావ్య. దీంతో మీ గొడవల వల్లే తను ఇలా అయిపోయింది. మీ కారణంగా నా కొడలికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడు.. కళ్యాన్‌ డాక్టర్‌కు ఫోన్‌ చేయరా అంటుంది దాన్యలక్ష్మీ.

కట్ చేస్తే రూంలో డాక్టర్‌ వచ్చి అప్పును చెక్ చేసి ఆమెకు మెంటల్‌ గా ఎక్కువగా స్ట్రెస్‌ కాకుండా చూసుకోండి అని చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత కళ్యాణ్‌ అప్పు పక్కన కూర్చుని ఎమోషనల్ అవుతాడు. తర్వాత రాజ్‌, కళ్యాణ్‌ను పిలిచి నన్ను క్షమించరా..? ఇవాళ అప్పుకు ఈ పరిస్థితి రావడానికి నేనే కారణం కదా అందుకే క్షమించరా అని అడుగుతాడు. అదేం లేదు అన్నయ్య ఇందులో నీ తప్పేం లేదు అంటూ కళ్యాణ్‌ చెప్తుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Gundeninda Gudigantalu Balu : బిగ్ బాస్ లోకి బాలు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ అంతా..?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Big Stories

Advertisement
×