Rajasthan News: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను తీసుకెళుతున్న ట్రక్కు-మరో ట్రక్కుని ఢీకొంది. దీంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో రోడ్డుపై నున్న పలు వాహనాలు దగ్దమయ్యాయి. కొన్ని కిలోమీటర్ల మేరా ఆ శబ్దాలు వినిపించాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బాధితులను సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు.
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం
రాజస్థాన్‌లోని జైపూర్-అజ్మీర్ హైవేలో మంగళవారం రాత్రి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్‌పిజి సిలిండర్లను తీసుకెళ్తున్న ట్రక్కు, మరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన తర్వాత ట్రక్కులో ఉన్న గ్యాస్ సిలిండర్లు ఒక్కసారి పేలిపోయాయి. సిలిండర్లు పేలుళ్లతో జాతీయ రహదారి శబ్దాలతో దద్దరిల్లింది. కొన్ని కిలోమీటర్ల మేరా పేలుళ్ల శబ్దాలు బలంగా వినిపించాయి.
ట్రక్కు లోపల ఉన్న సిలిండర్లు ఒకొక్కటిగా పేలుతూనే ఉన్నాయి. పేలుడు శబ్దాలు చాలా దూరం వినిపించాయి. హైవేకు ఇరువైపులా ఉన్న ప్రాంతాల ప్రజలు ఆ శబ్దాలతో హడలిపోయారు. మంటలు కాస్త మరికొన్ని వాహనాలను అంటుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జైపూర్-అజ్మీర్ హైవేను మూసివేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వేరే ప్రాంతం ద్వారా వాహనాలను మళ్లించారు.
పేలుడు శబ్దాలు కిలో మీటరు మేరా
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ సహా ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వాహనం డ్రైవర్‌ను ప్రాథమిక చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
ALSO READ: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. 15 మంది మృతి
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ అధికారులను అలర్ట్ చేశారు. సీఎం ఆదేశాల మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఉప ముఖ్యమంత్రి ప్రేమ్ చంద్ బైర్వా. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ప్రత్యక్షసాక్షుల వెర్షన్ మరోలా ఉంది. LPG సిలిండర్లను రవాణా చేస్తున్న ట్రక్కును రోడ్డు పక్కన ఆపాడు డ్రైవర్. భోజనం కోసం డాబాకు వెళ్లాడు. ఈలోగా ఓ ట్యాంకర్ వేగంగా వచ్చి.. LPG సిలిండర్ల ట్రక్కును వెనుక నుండి ఢీ కొట్టిందని చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
గతేడాది డిసెంబర్‌లో జైపూర్‌లోని భంక్రోటా సమీపంలో ఈ హైవేపై ఓ ఎల్‌పిజి ట్యాంకర్.. ఓ ట్రక్కును ఢీ కొట్టింది, దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. హైవే సమీపంలోని ఓ ప్రాంతాన్ని అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఈ ఘటనలో 19మంది స్పాట్‌లో మృతి చెందిన విషయం తెల్సిందే.
राजस्थान के जयपुर अजमेर रोड से एक बार फिर हैरान करने वाली घटना का भयावह वीडियो सामने आया है। जयपुर ग्रामीण के मोजमाबाद थाना क्षेत्र में जयपुर -अजमेर हाईवे पर गैस सिलेंडर से भरे ट्रक में आग लगी है, जिसमें रखे कई सिलेंडर ब्लास्ट हुए हैं।#Rajasthan #ajmerroad #jaipuraccident #Ajmer pic.twitter.com/3rkLtoboBb
— ARVIND RAJPUROHIT HINDU (@avraaj1008) October 8, 2025