Gundeninda GudiGantalu Today episode October 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. కామాక్షి ప్రభావతిని ఇంకా టెన్షన్ పెడుతుంది. మీనా రూమ్ లో ఏదైనా లెటర్ రాసిపెట్టి వెళ్ళిందేమో ఒకసారి వెతుకుదాం పద అని కామాక్షి ప్రభావతితో అంటుంది. లెటర్ ఏంటి అంటే మరణ వాంగ్మూలం మా అత్త నన్ను హింసిస్తుంది అని లెటర్ రాసి చనిపోవడానికి వెళ్లిందేమో అని కామాక్షి ఇంకాస్త బయట పెట్టుకుంది. వాళ్ళిద్దరూ వెతుకుతుంటే రోహిణి, శృతి కూడా అక్కడికి వచ్చి వెతుకుతారు.. రూమ్ అంత వెతక అక్కడ ఒక లెటర్ కనిపిస్తుంది. దాన్ని చూసిన కామాక్షి ఈ లెటర్ ని రాసి చనిపోయిందేమో అని ప్రభావతి ఇంకా టెన్షన్ పెడుతుంది. ప్రభావతి తనను జైల్లో పెట్టినట్టు కలగంటుంది. ప్రభావతి కలగనడం చూసిన కామాక్షి వదిన అప్పుడే జైలుకు వెళ్లినట్టు కల గన్నావా? గమనించావా అని ఎగతాళి చేస్తూ మాట్లాడుతుంది.. మొత్తానికి మీన రావడంతో అంతా కూల్ అవుతారు. మీనా చూసిన బాలు ఎమోషనల్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మీనా ఇంట్లోకి రాగానే అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. నేనేమీ చెప్పకుండా వెళ్ళలేదు కదా ఎందుకు అందరూ టెన్షన్ పడ్డారు అని మీనా అంటుంది. నేను శృతికి చెప్పే వెళ్లాను కదా ఏం శృతి చెప్పే వెళ్లాను కదా ఏం శృతి నీకు చెప్పాను కదా వేడి నీళ్లు ఇచ్చినప్పుడు నీకు ఇదే కదా నేను చెప్పింది అని అంటుంది.. నాకు నువ్వు చెప్పావా అయితే నేను ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాను అప్పుడు చెప్పినట్టున్నావ్ దానికి నేను సరే అన్నాను ఇప్పుడు గుర్తొచ్చింది అని శృతి అంటుంది. ఇప్పుడేమంటావ్ అమ్మ వదిన చెప్పేసే వెళ్లింది అని రవి అంటాడు.
చెవిలో బ్లూటూత్ పెట్టుకొని అందరూ ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు అలాగ మారిపోయింది కాలమని బాలు కూడా అంటాడు. ఎంత చేసినా సరే ఇలాంటి మాటలు మీరు అంటూనే ఉంటారు అని మీనా ప్రభావతిపై రెచ్చిపోతుంది. కావాలనే పని తప్పించుకోవడానికి వెళ్ళింది లేకపోతే ఎందుకు వెళ్తుంది అని ప్రభావతి మళ్లీ అంటుంది. పని తప్పించుకోడానికి నేనేం వెళ్ళలేదు ఒకసారి మన ఇంటికి వచ్చి పూలు కట్టిన అక్క వాళ్ళ ఇంటికి వెళ్లి మాలలు కట్టాను నాకు 3000 ఇచ్చింది ఇదిగోండి డబ్బులు అని మీనా అంటుంది.
ప్రభావతి బాగా గడ్డి పెట్టింది కదా మీనా అని సత్యం అంటాడు. ఇక కామాక్షి కూడా మీనాకు సపోర్ట్ చేస్తూ ప్రభావతికి చురక లాంటి ఇస్తుంది. ఇలాంటి బుద్ధి నీకు నీ పెద్ద కోడలికి ఉంటుందేమో రుచి పచ్చిలేని కూరలు చేసి వండడం అని రోహిణి కూడా మధ్యలోకి లాగి దుమ్ము దులిపేస్తుంది కామాక్షి. ఇక మీనా బాలు టెన్షన్ పడాడు అని అనడంతో మీనా తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని బాలు పై ప్రేమను కురిపిస్తుంది. ఇక ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటారు. పాటల మధ్యలో శివ బాలు పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన విషయాన్ని బయట పెడతారు..
Also Read: ‘ఇంటింటి రామాయణం’ అవని గురించి సీక్రెట్స్..అదే పెద్ద మిస్టేక్..
ఇక తర్వాత రోజు గుణతో శివ మాట్లాడడం విన్నారు మీనా అందరికీ కలిపి గడ్డి పెడుతుంది. ఇక మీదట ఇచ్చి బాలు విషయంలో నేను జోక్యం చేసుకోనని చెప్పి గుణతో వెళ్లిపోతాడు. రోహిణి షాప్ ని చూసుకోమని చెప్పి మనోజ్ బయటకు వెళ్ళిపోతాడు. షాప్ కి దిలీప్ రావడం చూసి రోహిణి షాక్ అవుతుంది. డబ్బులు కావాలని ఎన్ని సార్లు అడుగుతావు నా దగ్గర డబ్బులు లేవు అని రోహిణి అంటుంది. ఈ షాప్లో ఖరీదైన ఫన్నీచర్స్ ని నేను తీసుకెళ్లి పోతాను అని తనకు నచ్చిన వాటిని తీసుకొని వెళ్ళిపోతాడు. మనోజు ఆ డబ్బులు ఏవి అని అడుగుతాడు రోహిణి సైలెంట్ గా తప్పించుకుని వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…