Nindu Noorella Saavasam Serial Today Episode: అంజు, మనోహరితో మాట్లాడి వెళ్లాక మనోహరి, రణవీర్‌కు కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన రణవీర్ చెప్పు మనోహరి ఈ టైంలో కాల్ చేశావు అని అడుగుతాడు. దీంతో మనోహరి మన పాప విషయం ఎంత వరకు వచ్చింది. దానిని వెతికే ప్రయత్నం చేస్తున్నావా..? లేదా..? అని అడుగుతుంది. దీంతో రణవీర్ ఏంటి సడెన్ గా నీకు దుర్గ గుర్తుకు వచ్చింది అని అడుగుతాడు. దీంతో మనోహరి ఏం లేదు అది ఎలా ఉందో చూడాలనిపిస్తుంది అని చెప్పగానే.. చూడాలని ఉందా..? లేక నీ చేతులతో వదిలేసిన దుర్గ మీద కొత్తగా ప్రేమ పుట్టుకొస్తుందా..? అని అడగ్గానే.. దాని మీద నాకు ప్రేమేంటి..? నాన్‌సెన్స్.. అంటుంది మనోహరి.
అయితే ఇప్పుడు దుర్గ గురించి ఎందుకు అడుగుతున్నావు అని రణవీర్ అడగ్గానే.. చెప్పాను కదా అది ఎలా ఉందో ఒక్కసారి చూడాలనుకున్నాను అని అంటూ మనోహరి చెప్పగానే చూసి ఏం చేస్తావు చూసి సారీ చెప్తావా..? తిరిగి దగ్గరకు తీసుకుంటావా..? అన్ని వదిలేసి తన అమ్మగా సెటిల్ అయిపోతావా..? నీ మనసులో ఏముంది..? అని రణవీర్ అడగ్గానే.. ఏం లేదు జస్ట్ తెలుసుకుందామని అడిగాను అంతే.. పాపను వెతికే ప్రాసెస్ పాస్ట్ చేయ్ అని చెప్తుంది. దీతో రణవీర్ కోపంగా నేను ఎంత వెతికినా ఏం లాభం.
అమరేంద్ర దుర్గ గురించి తెలిసినా కూడా చెప్పడం లేదు కదా..? అంటాడు. అమర్‌కు నీ గురించి తెలిసినా కూడా నిన్ను ఏమీ చేయడం లేదు కదా అంటుంది మనోహరి. దీంతో రణవీర్ అనుమానంగా నాకెందుకో ఈ రెండింటికీ కనెక్షన్ ఉందేమో అనిపిస్తుంది. అమరేంద్రకు దుర్గ గురించి తెలిసినా చెప్పడం లేదు. నా గురించి తెలిసినా ఏమీ అనడం లేదు.. ఏమంటావు అని రణవీర్ అడగ్గానే.. ఈ విషయం గురించి తర్వాత ఆలోచిద్దాం ముందు పాపను వెతకడం స్పీడప్ చేయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది.
ఆరు గార్డెన్‌లో అటూ ఇటూ తిరుగుతూ మిస్సమ్మ, అమర్ కోసం ఎదురుచూస్తుంటుంది. గుప్త వెటకారంగా చూస్తూ.. నువ్వు ఎన్నిమార్లు చూసిననూ రావాల్సిన వారు రావాల్సిన సమయమునకే వచ్చెదరు బాలిక. నువ్వు ఎదరుచూస్తున్నావని ముందుగా రారు.. నువ్వు చూడటం లేదని ఆలస్యంగా రారు అని చెప్పగానే.. మీకు అసలు మనస్సాక్షి ఉందా గుప్త గారు..నా బాధ ఆవేదన మీకు అర్థం అవుతుందా అని ఆరు అడగ్గానే.. అవగతం చేసుకుని మేము ఏమి చేయగలం బాలిక.. ఎప్పుడు ఏది జరగవలయునో అదే జరుగును అని గుప్త చెప్పగానే.. మీకు అన్న అక్క అమ్మ భార్య లాంటి బంధాలే లేవా..? అని ఆరు అడగ్గానే.. ఎందులకు లేవు.. మేము కూడా మీ వలే గృహస్థులమే.. మాకు కూడా అన్ని బంధములు ఉన్నవి.. కాకుంటే మీకు మరణం ఉన్నది.. మేము మాత్రం అమరులం అని చెప్తుండగానే..
అందుకే మీకు నా బాధ అర్థం కావడం లేదు. అందరూ ఉంటారు ఎప్పటికీ ఉంటారు. కానీ నేను నా వాళ్లకు లేకుండా పోయాను అంటూ ఆరు బాధపడుతుంది. ఇంతలో అమర్ కారు వస్తుంది. గుప్త చూసి నీ సహోదరి వచ్చింది బాలిక అని చెప్తాడు. కారు దిగకుండా ఆలోచిస్తూ అలాగే కూర్చున్న మిస్సమ్మను అమర్.. భాగీ ఇల్లు వచ్చింది.. దిగు భాగీ అని చెప్తాడు. కారు దిగిన మిస్సమ్మ గార్డెన్ వైపు చూస్తుంది. ఆరు హాయ్ అని చెప్తుంది. మిస్సమ్మ ఏమీ అనదు.. అమర్ లోపలికి తీసుకెళ్తాడు. మిస్సమ్మ ఆరు వైపు చూస్తూ లోపలికి వెళ్తుంది. దీతో ఆరు బాధగా ఏంటి గుప్త గారు నేను సొంత అక్కను అని తెలిసినా కూడా బాగీలో ఎలాంటి రియాక్షన్ కూడా లేదు. నన్ను చూసి కూడా నాతో మాట్లాడకుండా వెల్లిపోయింది. ఎందుకు నవ్వుతున్నారు గుప్త గారు అని అడగ్గానే..
నీకు నీ సహోదరి ముఖంలో కోపము కనిపించింది కానీ మనసున్న ఉన్న బాధ తెలియడం లేదు కదూ.. తను ఆగ్రహంతో వెళ్లడం లేదు బాలిక. నీ కొరకై బరువెక్కిన గుండెతో భారం అయిన మనసులో వెళ్లుచున్నది. పక్కన నీ పతిదేవుడు లేనిచో ఇప్పుడే నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆలింగనం చేసుకుని మనసారా ఏడ్చేది. తన గుండెల్లో గూడు కట్టుకున్న బాధ కరిగే వరకు కన్నీరు మున్నీరు అయ్యేది అంటూ గుప్త చెప్పగానే.. నాకు నా చెల్లిని పట్టుకుని ఏడ్వాలని ఉంది. తనను ఓదార్చాలనిపిస్తుంది. ఇన్నాళ్లు తన దగ్గర ఈ నిజం దాచినందుకు క్షమాపణ చెప్పాలని ఉంది అంటూ ఆరు ఎమోషనల్ అవుతుంటే.. అటులనే బాలిక కానీ దేనికైనా సమయం పడుతుంది. అని గుప్త చెప్పగానే ఆరు ఆలోచిస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.