Jabardasth Promo: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ కామెడీ షో జబర్దస్త్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో ఏళ్లుగా ఈ షో ప్రసారం అవుతుంది. ఎంతోమంది కమెడియన్లను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఒకప్పుడు నాన్ స్టాప్ కామెడీతో ఆకట్టుకున్న స్కిట్లు ఇప్పుడు కాస్త కాంట్రవర్సీగా మారుతున్నాయి. స్కిట్ లలో కామెడీ తగ్గిందని ఈమధ్య వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతి ఎపిసోడ్ లో ఏదోకటి బయటకు రావడం ట్రోల్స్ అందుకోవడం కామన్ అయ్యింది. తాజా ఎపిసోడ్ కూ సంబందించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో నూకరాజు నోరు జారీనట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రోమో వీడియో వైరల్ అవుతుంది..
కమెడియన్ నూకరాజు స్కిట్ వీడియో కాంట్రవర్సీ అయ్యింది. మిడిల్ క్లాస్ అంటే ఏంది.. అని ఎవరో అడిగితే పైసల్ తక్కువ పిల్లలు ఎక్కువ ఉంటారు చూడు వాళ్లనే మిడిల్ క్లాస్ అంటారే.. అంటూ నూకరాజు చెప్పాడు. పైసలు తక్కువున్నప్పుడు పిల్లలు ఎందుకు ఎక్కువ.. అని అడిగితే మళ్లీ అదే రీతిలో బదులిచ్చాడు. వాళ్లకు కోరికలు ఎక్కువగా ఉంటాయి తప్ప వేరే పని ఉండదు. అందుకే పిల్లలు ఎక్కువగా ఉంటారని నూకరాజు అవమానించేల మాట్లాడతాడు.. నూకరాజు చెప్పిన ఈ డైలాగ్ ఎందుకు కామెడీగా ఉందో ఎంత కామెడీగా ఉందో తెలీదు కానీ జడ్జీలతో పాటు అందరూ నవ్వుకున్నారు. నూకరాజు ఇలా కామెడీ కంటే ఎక్కువ కాంట్రవర్శీతోనే హైలెట్ అయ్యాడు.. కామెడీ అంటే అందరిని నవ్వించాలి కానీ ఇలా కించపరచకూడదు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
జబర్దస్త్ షో కి రష్మీ లేదా అనసూయ మాత్రమే మొదట్లో యాంకర్స్ లో ఉండేవారు. అంతేకాదు అప్పుడప్పుడు స్కిట్లో కూడా మెరిసేవారు. దాంతో కామెడీ కూడా ఉండేది. కానీ ఈ మధ్య వస్తున్న జబర్దస్త్ లో జడ్జిలతో పాటుగా యాంకర్లు కూడా మారుతూ వచ్చారు.. ప్రస్తుతం కుష్బూ స్థానంలో శ్రీదేవి విజయ్ కుమార్ వచ్చారు. డబల్ యాంకర్స్ డబల్ డోర్స్ డబల్ కామెడీ అనే డైలాగ్ తో యాంకర్స్ ను కూడా ఇద్దరుగా చేసేసారు. యాంకర్‌గా రష్మీ సరిపోతుంది కదా మళ్లీ మానస్ ఎందుకు దండగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఒకవైపు వద్దు నీ కామెంట్లు వినిపించిన సరే మల్లెమాల మాత్రం తన తీరుని మార్చుకోవడం లేదు. ఇద్దరు యాంకర్లతో జబర్దస్త్ షో నడుస్తుంది. ఇక ముందు ఎన్ని మారతాయో చూడాలి..
కమెడియన్ నూకరాజు ఈమధ్య స్కిట్ లలో కామెడీ పంచులు ఏమో కానీ కొన్నిసార్లు కాంట్రవర్సీలకు కేరాఫ్ మారుతున్నారు.. నూకరాజు ఇలా కామెడీ కంటే ఎక్కువ కాంట్రవర్శీతోనే హైలెట్ అయ్యాడు. గతంలో జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన సుడిగాలి సుధీర్, ఇమ్మానుయేల్‌పై కూడా నూకరాజు ఇలానే కామెంట్లు చేశాడు.. యాంకర్ సౌమ్య రావు పై కూడా కామెంట్స్ చేశాడు. అడ్డంగా ఇరుక్కున్నాడు. మళ్లీ సారీ కూడా చెప్పాడు. అయినా తన పేరు మార్చుకోవడం లేదని ఇప్పుడు కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై నూకరాజు ఎలా స్పందిస్తారో చూడాలి..