BigTV English

Congress Party: మీనాక్షి నటరాజన్ యాక్షన్ ప్లాన్.. కాంగ్రెస్‌లో ఇక పప్పులుడకవు!

Congress Party: మీనాక్షి నటరాజన్ యాక్షన్ ప్లాన్.. కాంగ్రెస్‌లో ఇక పప్పులుడకవు!

Congress Party: కాంగ్రెస్ పార్టీ అంటే అంతర్గత ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరు. నాయకులు ఎవరికి వారు తమ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటారు. స్వేచ్ఛ ఉంది కదా అని తమకు అనుగుణంగా మలుచుకుంటూ పార్టీ లైన్ దాటుతుండే వారు. ఈ స్వేచ్ఛతో పార్టీ కి వచ్చే తిప్పలు అన్ని ఇన్ని కావు.. ఆ క్రమంలో ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి మంచిని మైక్ లో చెప్పండి. చెడుని చెవిలో చెప్పండి అంటూ చేసిన కామెంట్స్ పార్టీలో హాట్‌గా టాపిక్‌గా మారాయట. నూతన ఇన్ ఛార్జ్ మీనాక్షి సైతం రాగానే తన మార్క్ చూపెడుతుందడంతో లైన్ దాటుతున్న నాయకుల్లో తెలియని ఫియర్ మొదలైందంట. ఇన్ని రోజులు అనుభవించిన స్వేచ్ఛకు ఇక బ్రేక్‌లు పడినట్లేనని తెగ ఇదై పోతున్నారంట.


అంతర్గత ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరు కాంగ్రెస్

కాంగ్రెస్ మహా సముద్రం లాంటి పార్టీ.. ఏ రాజకీయ పార్టీలో లేని స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ లో ఉంటుంది. సొంత పార్టీ నేతల్నే స్థాయీ బేధం లేకుండా టార్గెట్ చేస్తుంటారు నాయకులు.. మరే పార్టీలో అలా ఉండదు.. తమ పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం గురించి ఆ పార్టీ నాయకులు కూడా గొప్పగా చెప్పుకుంటారు. అయితే నాయకులకు అంత స్వేచ్ఛ వల్ల అనేకసార్లు మిస్ ఫైర్ అయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఆ పరిస్థితికి బ్రేక్ వేసేందుకు రెడీ అయ్యారంట తెలంగాణ నూతన ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్. అందులో భాగంగా రాగానే తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటుతో తన మార్క్ చూపించారనే చర్చ జరుగుతోంది. మార్క్ చూపించడమే కాదు అది కంటిన్యూ అవుతుందనే సంకేతాలు కూడా ఇస్తున్నారంట.


పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని వార్నింగ్

పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినా, పార్టీ ఇంటర్నల్ విషయాలు బయట మాట్లాడినా చర్యలు తప్పవనే ఇండికేషన్ ఇవ్వకనే ఇచ్చారు నటరాజన్.. పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని కులగణ సర్వే చేసింది. ఈ సర్వేని ఉద్ధేశించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తప్పుపడుతూ.. తన సొంత యూట్యూబ్ ఛానల్‌లో ఆ సర్వే నివేదికను తగల పెడుతూ అసభ్యకరంగా మాట్లాడారు. దాంతో ఆయనకు పార్టీ షోకాజ్ నోటీసు లు ఇచ్చింది. దానికి మల్లన్న వివరణ ఇవ్వలేదు. దాంతో పార్టీ చాలా రోజులు తీన్మార్ మల్లన్న పై వేటు వేయడానికి ఆలోచించింది. అయితే మీనాక్షి నటరాజన్ వచ్చిన వెంటనే ఈ ఇష్యూపై రియాక్ట్ అయి.. తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తూ ఇష్టానుసారం వ్యవహరించే నేతలు ఒక్కసారిగా అలెర్ట్ అవుతున్నారంట.

వీహెచ్ నివాసంలో మున్నూరు కాపుల సమావేశం

మరోవైపు పార్టీ సీనియర్ నేత వీహెచ్ సైతం తన నివాసం లో రాజకీయ పార్టీ లకు అతీతంగా మున్నూరు కాపు సామజికవర్గానికి చెందిన నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం లో అఖిలపక్ష కమిటీ వేయడంతో పాటు మున్నూరు కాపులకు కాంగ్రెస్‌లో ప్రాధాన్యత తగ్గిందని కామెంట్లు చేశారు. అలాగే కులగణనపై మీటింగులో పాల్గొన్న ప్రతిపక్ష నేతలు నెగిటివ్‌గా మాట్లాడారు. తమ బలం చూపించుకోడానికి పార్టీ కతీతంగా ఒక సభ పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు.

వీహెచ్‌కు క్లాస్ తీసుకున్న మీనాక్షి నటరాజన్

బీఆర్ఎస్, బీజేపీ మున్నూరు కాపు నేతలు కూడా పాల్గొన్న ఈ మీటింగులో ఆ వర్గానికి మంత్రి వర్గంలో చోటు దక్కక పోవడంపై విమర్శలు గుప్పించారు. కులగణనలో మున్నురు కాపుల జనాభా సంఖ్యను తక్కువగా పేర్కొన్నారని ఎత్తి చూపించారు. ఆ మీటింగ్ వ్యవహారం తెలుసుకున్న మీనాక్షి నటరాజన్ వీహెచ్‌తో పాటు అందులో పాల్గొన్న కాంగ్రెస్ నేతలపై సీరియస్ అయ్యారంట. పార్టీలో సీనియర్ నాయకులు అలా ఇంట్లో అన్ని పార్టీ ల నేతలతో సమావేశమై.. కులగణలపై , కాంగ్రెస్ పార్టీ లో మున్నూరు కాపులకు ప్రాధాన్యత గురించి చర్చించడం ఏంటని సీరియస్ అయ్యారంట. దానికి సంబంధించి వి.హనుమంతరావుని గాంధీ భవన్ కి పిలిపించి మందలించారన్న టాక్ వినిపిస్తోంది.

Also Read: జగన్ బాటలో కేసీఆర్.. ఆపై మారిన వ్యూహం

ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఇక పప్పులు ఉడకవు

అదలా ఉంటే సిఎం రేవంత్ రెడ్డి సైతం మంచి మైక్‌లో చెప్పాలని.. చెడు చెవిలో చెప్పాలని విస్తృత స్థాయి సమావేశంలో పేర్కొన్నారు. బహిరంగంగా పార్టీ లైన్ మాట్లాడితే సహించేది లేదని ఆయన ఇచ్చిన ఆ ఇండికేషన్ హాట్ టాపిక్‌గా మారింది. సీఎం అలా చెప్పడం.. మీనాక్షి నటరాజన్ పార్టీ లైన్ దాట్టొదు అని, ఎవరి పని వారు చేయాలని క్లియర్‌గా స్పష్టం చేయడం. దానికి తగ్గట్లే రాగానే తీన్మార్ మల్లన్నపై వేటు పడటంతో కాంగ్రెస్‌ నేతలు అలర్ట్ అవుతున్నారంట. సీనియర్ నాయకుడు వీహెచ్ మీటింగ్ పై ఆమె సీరియస్ అవ్వడంతో.. ఇక ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే పార్టీలో తమ పప్పులు ఉడకవని నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్‌కి మంచి రోజులు వచ్చాయని, అందరికీ క్రమశిక్షణ అలవడుతుందని సీనియర్లు ఆనందపడిపోతున్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×