OTT Movie : ఇంటర్నెట్‌లో పిల్లలను భయపెట్టే ఆకారాలు చాలానే ఉన్నాయి. అయితే స్లెండర్ మ్యాన్ అనే భయంకరమైన ఆకారం బాగా పాపులర్ అయింది. ముఖం లేని ఒక పొడవైన ఆకారం, బ్లాక్ సూట్ వేసుకుని పిల్లలను ఎత్తుకుపోతుంటుంది. ఇప్పుడు పిల్లలకి స్లెండర్ మ్యాన్ వస్తున్నాడని చెప్పగానే సైలెంట్ గా ఒక చోట కూర్చుంటున్నారు. మరి ఈ ఆకారం అంతగా పాపులర్. ఈ కంటెంట్ తో ఒక హారర్ సినిమా తెరకెక్కింది. థియేటర్లలో అంతగా సక్సెస్ కాకపోయినా, ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
‘స్లెండర్ మ్యాన్’ (Slender man) 2018లో వచ్చిన అమెరికన్ సూపర్ నాచురల్ హారర్ సినిమా. సిల్వైన్ వైట్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో జోయ్ కింగ్, చ్లోయ్, రెన్, కేటీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2018న ఆగస్టు 10 థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
అమెరికాలోని ఒక చిన్న టౌన్‌లో హాలీ, చ్లోయ్, రెన్, కేటీ అనే నలుగురు టీనేజ్ అమ్మాయిలు ఉంటారు. వీళ్లు బెస్ట్ ఫ్రెండ్స్, ఒకరితో ఒకరు బాగా టైమ్ స్పెండ్ చేస్తుంటారు. ఒకరోజు వీళ్ళ ఇంటర్నెట్‌లో స్లెండర్ మ్యాన్ గురించి చదువుతారు. స్లెండర్ మ్యాన్ అంటే పొడవైన, ముఖం లేని, బ్లాక్ సూట్‌లో ఉండే భయంకర ఫిగర్. ఈ ఆకారం పిల్లలను కిడ్నాప్ చేస్తాడని ఒక పుకారు ఉంటుంది. వీళ్లు ఈ కథ నిజమా కాదా అని టెస్ట్ చేయడానికి ఒక రిచ్యువల్ చేస్తారు. ఈ రిచ్యువల్ చేసిన ఒక వారంలో కేటీ అకస్మాత్తుగా మిస్సింగ్ అవుతుంది. దీంతో హాలీ, చ్లోయ్, రెన్ షాక్ అవుతారు. కేటీ ఇంటికి వెళ్లి చూస్తే, ఆమె స్లెండర్ మ్యాన్ గురించి చాలా రీసెర్చ్ చేసినట్టు తెలుస్తుంది. కేటీ స్లెండర్ మ్యాన్‌తో కాంటాక్ట్ చేసి, అతను తనను తీసుకెళ్లమని కోరినట్టు అర్థమవుతుంది.
Read Also : పజిల్స్ తో పరుగులు పెట్టించే కిల్లర్… నరాలు కట్టయ్యే సస్పెన్స్, ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్