Indian Railways: ఇండియన్ రైల్వే రూటు మార్చింది. ప్రయాణికులకు సౌకర్యాల కోసం టెక్నాలజీ వినియోగిస్తూనే, కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రైలు ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్‌పై జర్నీ డేట్ మార్చుకునే సదుపాయాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి నుంచి కొత్త పద్దతి అమల్లోకి రానుంది. రైల్వే తీసుకున్న కొత్త పద్దతిపై ప్రయాణికులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
రైల్వే ప్రయాణికులు శుభవార్త
ప్రయాణికులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది ఇండియన్ రైల్వే. టికెట్‌పై జర్నీ డేట్ మార్చుకునే సదుపాయాన్ని త్వరలో ప్రవేశ పెట్టనుంది. జనవరి నుంచి ఈ విధానం అమలు కానుంది. రైల్వేశాఖ నిర్ణయంతో ప్రయాణికులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇల్లు లేదా ఆఫీసులో సమస్యల వల్ల ట్రావెల్ సమయంలో ఒక్కోసారి జర్నీ డేట్ మారుతూ ఉంటుంది.
ఆ సమయంలో బుక్ చేసిన టికెట్‌ను రద్దు చేసి, ఆ తర్వాత కొత్త టికెట్‌ను తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. దీనివల్ల చీటికి మాటికీ టికెట్లు క్యాన్సిల్ అయ్యేవి. ఈ పద్దతి వల్ల రైల్వేకి కొంత ఆదాయం వచ్చేది. ఈసారి మాత్రం ప్రయాణికులకు అనుగుణంగా మార్పులు చేపడుతోంది. జనవరి నెల నుంచి ప్రయాణికులు ఆన్‌లైన్‌లో తాము బుక్ చేసుకున్న టికెట్‌పై ప్రయాణ తేదీని మార్చుకునే అవకాశం కల్పించనుంది.
వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త పద్దతి
స్వయంగా ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పుడున్న ఈ పద్దతి అన్యాయమైనదిగా వర్ణించారు. ఇది ప్రయాణికుల ప్రయోజనాలను దెబ్బ తీస్తోందని మనసులోని మాట బయటపెట్టారు. జనవరిలో రానున్న కొత్త విధానం ద్వారా ప్రయాణికుల ఆ తరహా సమస్యలకు ఫుల్‌స్టాప్ పడనుంది.
దీనివల్ల రిజర్వేషన్ కౌంటర్లలో రద్దీని తగ్గుతుంది. ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది. సింపుల్‌గా ఆన్ లైన్‌లో తేదీలు మార్చుకోవచ్చని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల డిజిటల్ సౌకర్యం క్రమబద్ధీకరించినట్టు అవుతుందని చెబుతున్నాయి. సాంకేతికత ద్వారా ప్రయాణీకుల సేవలను మెరుగుపరిచే ప్రయత్నంలో భాగమని అంటున్నాయి.
ALSO READ: రోడ్డు మీర మేకులు వేసి.. వాహనదారులను ట్రాప్ చేసి
జనవరి నుంచి తీసుకురానున్న కొత్త విధానంలోని కీలక అంశాలను ఇప్పుడు చూద్దాం. రైల్వే రిజర్వేషన్ టికెట్ రద్దు కాకుండా ప్రయాణ తేదీని మార్చుకునే అవకాశం ఉంటుంది. అందుకోసం ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆన్‌లైన్‌లో తేదీని సులభంగా మార్చుకోవచ్చు. అయితే మార్చుకునే తేదీలో సీట్లు ఖాళీగా ఉండాలి. కొత్త టికెట్ ధర ఎక్కువగా ఉంటే దాన్ని ప్రయాణికుడు భరించాల్సి ఉంటుంది.
ఇప్పుడు అమలు అవుతున్న విధానంలోకి వెళ్తే.. రిజర్వేషన్ కన్ఫార్మ్ అయిన టికెట్‌పై ప్రయాణ తేదీ మార్చుకునే అవకాశం ఉండేది కాదు. ఆ టికెట్‌ను రద్దు చేసి తర్వాత మళ్లీ కొత్త టికెట్ తీసుకోవాల్సి వచ్చేది. ముఖ్యంగా రైలు బయలుదేరే సమయానికి బట్టి క్యాన్సిల్ చేసిన టికెట్‌లో రీఫండ్ మార్పులు ఉంటాయి.
48 గంటల ముందు రద్దు చేస్తే 25 శాతం మినహాయించి మిగతా డబ్బు వచ్చేది. అదే 12 గంటల ముందు రద్దు చేస్తే ఛార్జీలు పెరిగేవి. రైలు బయలుదేరడానికి రెండుమూడు గంటల ముందు రిజర్వేషన్ చార్ట్ వచ్చిన తర్వాత టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ ఉండేది కాదు.