Inter Student Suicide: ఏపీలో దారుణం.. బస్సు ఆపమని చెప్పి కిందకు దిగి కాలువలోకి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని మోర్త గ్రామానికి చెందిన జూనియర్ ఇంటర్ విద్యార్థిని మంగళవారం సాయంత్రం దుమ్మెన్ను కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని మోర్త గ్రామానికి చెందిన కొప్పుల పూజిత(17) ప్రస్తుతం మండలంలోని ఒో ప్రవైటు జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. అయితే రోజులాగే ఉదయం కాలేజీకి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా.. బస్సు దిమ్మెన్ను కాలువ వద్దకు రాగానే.. వాంతులు అవుతున్నాయి బస్సు ఆపమని చెప్పింది. ఆ తర్వాత హడావిడిగా బస్సు దిగి ఒక్కసారిగా కాలువ వంతెనపైకి ఎక్కి దూకేసింది. దీంతో తోటి విద్యార్థులు, బస్సు డ్రైవర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తక్షణమే బస్సు, డ్రైవర్, అక్కడి స్థానికులు రక్షిద్దామని ప్రయత్నించగా.. కాలువ ఉదృతి ఎక్కువగా ఉండటంతో ఆమె కొట్టుకుపోయింది.
అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే ఉండ్రాజవరం పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్‌లు, డైవర్ల సహాయంతో కాలువు దిగువ భాగాల్లో కూడా శోధించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ సంఘటన తెలిసిన పూజిత తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు షాక్‌లో ఉన్నారు. అయితే ఈమె తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, సుబ్బలక్ష్మి మనస్పర్థలా వల్ల విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం వారిద్దరు వేరువేరుగా ఉంటున్నారు. పూజితకు అక్క, అన్నయ్య కూడా ఉన్నారు. అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి చదువుకుంటోంది పూజిత.. అయితే పూజిత చదువులో బాగా ఉండేదని, కానీ ఇటీవల మానసిక ఆందోళనలు కనిపించాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేపి దర్యాప్తు చేస్తున్నారు. అసలు పూజిత ఎందుకు ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలు ఎమైనా ఉన్నాయా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో ఆలోచిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాలువలోకి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..
పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం దమ్మెన్నులో ఘటన
కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తూ దారిలో కాలేజీ బస్సు ఆపి కాలువలోకి దూకిన విద్యార్థిని కొప్పుల పూజిత
పూజిత స్వస్థలం ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామం
విద్యార్థిని పూజిత కోసం… pic.twitter.com/sc68eagDZ0
— BIG TV Breaking News (@bigtvtelugu) October 8, 2025