Satyabhama Today Episode January 31th: నిన్నటి ఎపిసోడ్ లో… సంధ్య కు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అయితే ఆ పెళ్లి చూపులకు సత్య బయలుదేరుతుంది కృష్ణ అడిగితే క్రిష్ నేను రాను అని చెప్పేస్తాడు. ఇక సత్య ఒకటే పెళ్లిచూపులుకి వెళ్తుంది. పెళ్లిచూపులు కి అబ్బాయి వాళ్ళు వస్తున్నారని ఇంట్లో హడావిడి చేస్తారు విశ్వనాథ కుటుంబం. ఇక సంధ్య మాత్రం నాకు పెళ్లి చూపులు అంటే ఇష్టం లేదని మొండిగా వాదిస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఆ విషయానికి ఒప్పుకోరు నువ్వు ఎలాగైనా పెళ్లి చేసుకోవాల్సిందే ఈ పెళ్లి సంబంధం కుదరాలని మేము కోరుకుంటున్నామని గట్టిగా చెప్పేస్తారు. సత్య కూడా సంధ్యను ఒప్పించి పెళ్లికి ఒప్పించాలని అనుకుంటుంది. ఈ సంధ్య మాత్రం సత్య నీ స్వార్థం నువ్వే చూసుకున్నావని మాటలు అంటుంది. నువ్వు బావగారిని వదిలేయ్ నేను సంజయ్ ని వదిలేస్తానని సంధ్య మొండికేసి కూర్చుంటుంది. సత్య మాత్రం ఈ పెళ్లిచూపులు అవని తర్వాత మాట్లాడుకుందాం అని రెడీ అవ్వమని చెప్తుంది.. కానీ సంధ్య మాత్రం సంజయ్ కి ఫోన్ చేసి బెదిరిస్తుంది. మనిద్దరం పెళ్లి చేసుకోకుండా ఉంటే కచ్చితంగా నా చావుకు నువ్వే కారణం అని లెటర్ రాసి వెళ్లిపోతానని బెదిరిస్తుంది దాంతో సంజయ్ గుడికి రావడానికి ఒప్పుకుంటాడు. ఇక సత్యా సంధ్యను తీసుకురానికి లోపలికి వస్తుంది అక్కడ సంధ్య ఉండదు.. దాంట్లో ఇంట్లోనే వాళ్ళందరూ కంగారు పడుతుంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్య విశాలక్షి ఇద్దరు టెన్షన్ పడుతుండగా విశ్వనాథం లోపలికి వస్తాడు సంధ్యను తీసుకు రమ్మని చెప్తే మీరు ఇద్దరు లోపల ఏం చేస్తున్నారు అనేసి అంటాడు. లెటర్ చదివి విశ్వనాథం టెన్షన్ పడతాడు ఇలాంటి పని చేస్తే దాన్ని నేను అస్సలు ఊహించలేదు ఇంత దారుణానికి ఎంత దిగజారింది.. ఇక ఈ విషయం పెళ్లి వాళ్ళకు తెలిస్తే ఎంత అవమానం పరువు పోతుంది అని టెన్షన్ పడతాడు అప్పుడే హర్ష నందిని లోపలికి వస్తారు. మేము వెళ్లి ఎక్కడుందో వెతికి తీసుకొస్తామని అంటారు పెళ్లి వద్దనుకొని వెళ్లిపోయిన దాని గురించి ఆలోచించడం ఎందుకురా ఈ విషయాన్ని పెళ్లి వాళ్ళకి చెప్పాలి ఏదైతే అది అయింది కూతురు గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది ఆ బాధ కన్నా ఇదేమి పెద్ద బాధ కాదు అని విశ్వనాథం అనుకుంటారు.
అటు గుడిలో సంధ్య కోసం సంజయ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. సత్యను ఇబ్బంది పెట్టడానికే నేను సంధ్యను లైన్ లో పెడితే ఇదేంది నాకు ఇలా తగులుకునిందని ఆలోచిస్తూ ఉంటాడు.. అప్పుడే సంధ్య అక్కడికొస్తుంది. ఇంటికి పంపించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ సంధ్య మాత్రం మన పెళ్లి ఇప్పుడే జరిగిపోవాలి లేదంటే చెప్పు నా చావును చూస్తావు ఇంకా ఎప్పటికీ నేను నీకు కనిపించను అనేసి బెదిరిస్తుంది. క్రిష్ అక్కడికి వస్తాడు.. సంజయ్ మగాడు వాడిని ఎవరు ఏమన్నారు నువ్వు ఆడపిల్లవి అది ఆలోచించవలసిన సంధ్య నీకు ఇంట్లో పెళ్లిచూపులు జరుగుతున్నాయి నీకు నచ్చకపోతే వద్దని చెప్పు ఇలా లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకోవడం చాలా తప్పు ఇంట్లో వాళ్ళు నువ్వు ఎంత బాధ పెడుతున్నావో ఆలోచించవా అనేసి క్రిష్ పెద్ద క్లాస్ పీకుతాడు. కానీ దానికి మాత్రం సంధ్య నాకు సంజయ్ అంటే ఇష్టం ఇంట్లో వాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోవడం లేదు అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. మీరు మా పెళ్లి పెద్దగా మాకు పెళ్లి చేస్తారని ఆశిస్తున్నాను అని సంధ్య బాధపడుతుంది. ఇక కరిగిపోయిన క్రిష్ వాళ్ళిద్దరు పెళ్లిని దగ్గరుండి చేయాలని నిర్ణయించుకుంటాడు..
అటు పెళ్లిచూపులు వాళ్ళకి విశ్వనాథం నిజం చెప్పేస్తాడు.. ఇక పెళ్లిచూపులు వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడతారు లేచిపోయిన కూతురు తనని బోర్డు పెట్టుకో అప్పుడు మీ ఇంటికి ఎవరు రారని అతను అంటారు. దారుణంగా తిడతారు. విశ్వనాథ కుటుంబం సంధ్య వెల్లిపోయిందని బాధపడుతూ ఉంటుంది.. పెళ్లిచూపులు వెళ్ళగానే విశాలాక్షి విశ్వనాథం ఇద్దరు కుప్పకూలిపోతారు.. ఇంట్లో వాళ్ళందరూ సందీప్ కోసం టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక గుడిలో క్రిష్ సంధ్యా సంజయ్ కు పెళ్లి ఏర్పాట్లు చేస్తారు.. క్రిష్ అనుకున్నట్లుగానే సంజయ్కి సంధ్య కు పెళ్లి చేస్తాడు. సత్య ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటుంది. ఇక సత్య ఫోన్ ని లిఫ్ట్ చేస్తాడు క్రిష్. నేనంటే నీకు ఎందుకు అంత కోపం? నా ఫోన్ లిఫ్ట్ చేయవు అని అనిపించలేదా నాతో మాట్లాడాలని లేదా అని సత్య క్రిష్అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో మహదేవయ్య ఇంటికి సంజయ్ సంధ్యను క్రిస్ తీసుకెళ్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..