Small Screen:గత కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు అనూహ్యంగా విడాకులు తీసుకుని అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. పెళ్లయిన 6 నెలలకే వివాహం తీసుకున్న జంటలు కొన్నైతే.. పెళ్లయిన 30 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్న జంటలు కూడా మనకు ఇండస్ట్రీలో కనిపిస్తూ ఉంటాయి. మరికొన్ని జంటలు ప్రేమించి, పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో సంతోషంగా ఉండి.. అనూహ్యంగా 9 లేదా 10 సంవత్సరాలకు విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇప్పటికే ఎన్నో జంటలు ఇలా విడాకుల బాట పట్టి అభిమానులను నిరాశ పరుస్తున్న వేళ.. తాజాగా మరో బుల్లితెర జంట కూడా విడాకులు ప్రకటించి, అభిమానులను ఆశ్చర్యపరిచింది. మరి వారెవరు? విడాకులు తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
విడాకులు తీసుకున్న బుల్లితెర జంట..
గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెరపై తమ నటనతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా తమ వైవాహిక బంధంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన జంట ముగ్ధా చాపేకర్ (Mugdha Chaphekar), రవీష్ దేశాయ్(Ravish Desai). వీరిద్దరూ తొమ్మిదేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని రవీష్ దేశాయ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేస్తూ.. “నేను , ముగ్ధా మా తొమ్మిదేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నాము. గత ఏడాది నుంచి మా ఇద్దరి మధ్య ఇదే విషయంపై చర్చలు నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాము. అయితే మాకు అవసరమైన గోప్యతను ప్రతి ఒక్కరు అందిస్తారని అభ్యర్థిస్తున్నాము. దయచేసి మా గోప్యతకు భంగం కలిగించకండి” అంటూ పోస్ట్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇంత చూడచక్కని జంట, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వీరు ఇలా విడాకులు తీసుకోవడం వెనుక అసలు కారణం ఏంటి? అని అభిమానులు సైతం ఆరా తీస్తున్నారు. అయితే ఈ విడాకులు వార్తలపై ముగ్ధా చాపేకర్ స్పందించలేదు.
ముగ్ధా చాపేకర్, రవీష్ దేశాయ్ ప్రేమ, పెళ్లి..
2014లో వచ్చిన ‘సత్రంగి ససురాల్’ అనే సీరియల్ ద్వారా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా రెండేళ్ల పాటు డేటింగ్ చేసుకున్న వీరిద్దరూ 2016లో వివాహం చేసుకున్నారు
ముగ్ధా చాపేకర్ కెరియర్..
ముగ్ధా చాపేకర్ విషయానికి వస్తే ప్రముఖ టీవీ సీరియల్ ‘కుంకుమ భాగ్య’ లో ప్రాచీ మెహ్రా కోహ్లీ పాత్రలో నటించి , ఈ పాత్రతో భారీ గుర్తింపు సొంతం చేసుకుంది. ఇందులో కృష్ణ కౌల్ తో ఈమె తెరపై జత కట్టడం గమనార్హం. ముఖ్యంగా ఈ జంటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అంతేకాదు వీరిద్దరి జంట ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి కూడా అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారు అనడంలో సందేహం లేదు.
రవీష్ దేశాయ్ కెరియర్..
రవీష్ దేశాయ్ కెరియర్ విషయానికి వస్తే మేడ్ ఇన్ హెవెన్, షీ – సీజన్ 2, స్కూప్ వంటి వాటిల్లో కనిపించిన ఈయన చివరిగా స్పోర్ట్స్ డ్రామా విజయ్ 69 లో అభిమన్యు పాత్రను పోషించారు.
Court Movie OTT: స్ట్రీమింగ్ కి సిద్ధమైన నాని ‘కోర్ట్’.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే..?