BigTV English

Stock Market: స్టాక్ మార్కెట్లకు గ్రహణం.. 5 నిమిషాల్లోనే 19 లక్షల కోట్లు ఆవిరి

Stock Market: స్టాక్ మార్కెట్లకు గ్రహణం.. 5 నిమిషాల్లోనే 19 లక్షల కోట్లు ఆవిరి

Stock Market: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ దెబ్బకు వివిధ దేశాల స్టాక్ మార్కెట్లు పేకమేడలా కుప్పకూలుతున్నాయి. సామాన్యుడి నుంచి వ్యాపార వేత్తల వరకు అంతా ఒక్కటే గోల. ట్రంప్‌ టారిఫ్‌ల దెబ్బకు ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు వణుకు తున్నాయి.  దాని ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్‌పై పడింది.


ట్రంప్ దెబ్బకు కూలిన మార్కెట్లు

సోమవారం ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే భారీ కుదుపు మొదలైంది.  బీఎస్ఈ 3000 పాయింట్లు, నిఫ్టీ నిఫ్టీ 1000 పాయింట్లు పతనమైంది. ట్రంప్‌ సుంకాల ఎఫెక్ట్ మార్కెట్ పై స్పష్టంగా కనిపించింది. బాంబే స్టాక్‌ మార్కెట్లలో వివిధ కంపెనీల షేర్లు దాదాపు 5 శాతం నష్టపోయాయి. అందులో బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా సహా మౌలిక రంగాల కంపెనీ షేర్లు ఎక్కువగా పతనమయ్యాయి.


ఐదేళ్ల తర్వాత ఆ స్థాయిలో పతనం

ఐదేళ్ల కిందట సరిగ్గా 2020లో నిఫ్టీకి ఇదే అతి భారీ పతనం. కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి 23న సెన్సెక్స్‌ దాదాపు 4వేల పాయింట్లు, నిఫ్టీ 1135 పాయింట్లకు పతనం అయిన విషయం తెల్సిందే. ఈలోగా మదుపరులకు అనుకూలంగా నిర్ణయాలు కేంద్రం తీసుకోవడంతో మార్కెట్ క్రమంగా కోలుకుంది. ఆనాటి భయాలు ఇప్పటికీ మదుపురులను వెంటాడుతున్నాయి. చిన్న చిన్న మదుపుదారులు వణికిపోతున్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టారిఫ్‌ల ప్రకటన అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాందోళనలు పెరిగాయి. మార్కెట్‌ సెంటిమెంటు ప్రతికూలంగా మారింది. ఈ వారం ఆదిలో దాని ప్రభావం మార్కెట్లపై తీవ్రంగా పడింది. తొలుత ప్రీ ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్‌ 4 వేల పాయింట్ల వరకు పడిపోయింది.

ALSO READ: 40 ఏళ్లకే పదవీ విరమణ, మారిన ట్రెండ్ ఏంటో తెలుసా?

నిఫ్టీలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ రూ.20 లక్షల కోట్ల మేర ఆవిరైనట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలో మాంద్యం వస్తుందన్న భయాలు తోడయ్యాయి. దాని ప్రభావం లోహ కంపెనీల షేర్లు భారీ నష్టాలను చవి చూశాయి. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ 19 పైసలు తగ్గి 85.63 వద్ద ఊగిసలాడుతోంది.

విలవిలలాడుతున్న ఆసియా మార్కెట్లు

ట్రంప్‌  దెబ్బకు ప్రపంచ స్టాక్‌మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. ఆసియా, ఆస్ట్రేలియా మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. చైనా- 6.5 శాతం, జపాన్‌-నిక్కీ 8 శాతం, కొరియా-కోస్పి సూచీ 5 శాతం పతనం అయ్యాయి. ఇక ఆస్ట్రేలియా స్టాక్‌ మార్కెట్‌ 6 శాతం, హాంకాంగ్‌ స్టాక్‌మార్కెట్లు 9 శాతం పతనం అయ్యాయి.

గత నెలల్లో సంకేతాలు

అమెరికా ఫ్యూచర్‌ స్టాక్స్‌ నష్టాల్లో ఉన్నాయి. డోజోన్స్‌ 2.2 శాతం పతనం అయ్యింది. దీని ప్రభావం సోమవారం మార్కెట్లు మొదలుకాగానే సూచీలు నేలబారు చూశాయి. మార్చి సెకండ్ వీక్‌లో అమెరికా స్టాక్ మార్కెట్ పతనం ధాటికి దాదాపు 20 రోజుల వ్యవధిలో 349 లక్షల కోట్లు ఆవిరైపోయింది.

సింపుల్ గా చెప్పాలంటే యూకె, ఫ్రాన్స్ వంటి దేశాల జీడీపీ కంటే ఎక్కువ. ఈ నేపథ్యంలో మార్కెట్ పతనం, ఆర్థిక మాంద్యానికి సిద్ధమైందనే సంకేతాలున్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషించారు. మరోవైపు మార్కెట్లు కుప్పకూలుతున్నా శ్వేత సౌధం మాత్రం ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆర్థిక మాంద్యం భయాలను తోసిపుచ్చారు అధికారులు.

మార్కెట్ల మహా పతనాన్ని ట్రంప్‌ సర్కార్ ఏమాత్రం పట్టించుకోలేదు. సుంకాలను మెడిసిన్‌ అంటూ అధ్యక్షుడ్ని వర్ణించడం కలకలం రేపుతోంది. మార్కెట్ల పతనంపై ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ నష్టాలు మూట కట్టుకోవడానికి ఇన్వెస్టర్లు రెడీగా ఉండాలంటూ మార్కెట్ నుంచి సంకేతాలు బలంగా వస్తున్నాయి.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×