BigTV English
Advertisement

Telangana Govt: గుడ్ న్యూస్.. ఈ వారమే వీరి ఖాతాల్లో రూ.లక్ష జమ

Telangana Govt: గుడ్ న్యూస్.. ఈ వారమే వీరి ఖాతాల్లో రూ.లక్ష జమ

Telangana Govt: ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్దిదారులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. నిరు పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు తీసుకొచ్చింది ఈ స్కీమ్. తొలి విడతగా లబ్ధిదారులకు ఈ వారం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయ్యింది. ఇల్లు మంజూరై బేస్‌మెంట్ వరకు నిర్మించుకున్నవారికి మాత్రమే నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైంది.


ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఉంచుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఏప్రిల్ ఆరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1265 ఇళ్ల వివరాలను అప్‌డేట్ చేసింది. తొలి విడత సాయం లక్ష రూపాయలు అందించేందుకు సిద్ధమైంది. ఈ స్కీమ్ కింద బేస్‌మెంట్ వరకు పూర్తయిన వివరాలను సేకరించారు అధికారులు. ఇళ్ల ఫోటోలు తీసి వాటికి జియో టాకింగ్ చేసి ఆన్‌లైన్‌‌లో ఉంచుతున్నారు.


పునాదులు తర్వాత ఇల్లు నిర్మించుకునేందుకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.1 లక్ష రుణం ఇప్పించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కొందరు లబ్ధిదారులకు ఆయా రుణాలు అందజేశారు కూడా.

రాష్ట్రవ్యాప్తంగా ఆ తరహా లబ్ధిదారుల వివరాలు సేకరించి వారికి లక్ష రూపాయల రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. జనవరి 26న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 71 వేల మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసింది. దాదాపు 44 వేల మందికి సంబంధించిన పత్రాలు అందజేశారు.

ALSO READ: ఆ ఏడు అడుగుల కండక్టర్ కు సాయం చేయండి

కాస్త ఆర్థికంగా ఉన్నవారు ఇంటి పనులు చేపట్టారు. చాలామంది పునాదులు నిర్మించుకున్నారు. అలాంటి వారికి లక్ష రూపాయల వరకు రుణాలు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో హడ్కో నుంచి మూడు వేల కోట్ల లోన్ తీసుకుంది ప్రభుత్వం. మంజూరు చేసిన నిధులు హౌసింగ్ కార్పొరేషన్‌కు వచ్చాయి.

వారంలో ఖాతాలోకి నిధులు

ఇందులో భాగంగా ఈ వారంలో లబ్ధిదారులకు తొలి విడత సాయంగా రూ.1 లక్ష అందించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది. నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కీమ్ కావడంతో ఎలాంటి అవకతవకలకు ఛాన్స్ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో కొందరికి చెక్కులు ఇవ్వాలని, మిగతావారికి వారి వారి బ్యాంకు ఖాతాల్లో లక్ష రూపాయల జమ చేయాలని నిర్ణయం తీసుకుంది.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు మంజూరుపై కేంద్రంతో చర్చలు జరిపింది తెలంగాణ ప్రభుత్వం. పీఎంఏవై కింద ఇల్లు పొందాలంటే ఆవాస్ ప్లస్ యాప్‌తో సర్వే చేయాలి. ఆపై లబ్ధిదారుల వివరాలు నమోదు చేయాలి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ రూపొందించి లబ్ధిదారుల వివరాలు పొందుపరిచింది.

యాప్‌లో నమోదు చేసిన లబ్ధిదారుల వివరాలను సమర్పించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సూచించారు. పీఎంఏవై పథకం కింద అర్బన్ ప్రాంతాల్లో లక్షా 13 వేల ఇళ్లను తెలంగాణకు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనికింద పట్టాణాల్లో ఇళ్లకు రూ 1.5 లక్షలు, రూరల్ లో అయితే రూ. 77 వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తోంది.

Related News

Sridhar Babu: యూట పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ హోరు.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్!

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Big Stories

×