Court Movie OTT:చిన్న సినిమాగా వచ్చి.. భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం కోర్ట్ (Court). హీరో నాని (Hero Nani) సమర్పణలో ప్రశాంతి నిర్మించిన ఈ చిత్రం గత నెల 14వ తేదీన థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. ఈనెల 11న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి సిద్ధం కానుంది. సుమారు రూ.10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి నానికి భారీ లాభాన్ని అందించింది అని చెప్పవచ్చు. ఇక ఇందులో ప్రియదర్శి(Priyadarshi ), హర్ష రోషన్(Harsha Roshan), శ్రీదేవి(Sridevi ), శివాజీ (Sivaji)తదితరులు కీలకపాత్రలు పోషించారు.
రూ.10 కోట్ల బడ్జెట్ తో ఐదింతలు లాభం..
నాని తన సొంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా పతాకం పై ఈ సినిమాను తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కించారు. ముఖ్యంగా ఈ కోర్ట్ రూమ్ డ్రామా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అనుకున్న దానికంటే ఎక్కువ వసూలు వచ్చాయి. ఇక ఈ సినిమాతో రామ్ జగదీష్ (Ram Jagadeesh) అనే ఒక కొత్త డైరెక్టర్ కూడా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. లవ్ స్టోరీ చుట్టూ రాసుకున్న కథను చాలా ఎఫెక్టివ్ గా చూపించారు రామ్ జగదీష్.. ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా.. ప్రశాంతి త్రిపురనేని,దీప్తి గంటా నిర్మాతలుగా.. నాని సమర్పకుడిగా వ్యవహరించారు.
కోర్టు మూవీ కథ..
ఇందులో వాచ్మెన్ కొడుకు అయిన చందు (హర్ష), జాబిల్లి (శ్రీదేవి) ప్రేమలో పడతారు. కులం, స్థాయి అంటే పిచ్చి ఉండే శ్రీదేవి బాబాయ్ మంగపతి (శివాజీ) కి వీరి ప్రేమ విషయం తెలుస్తుంది. వీరిని ఎలాగైనా సరే విడగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు మంగపతి. ఆఖరికి చందు పై కావాలనే పోక్సో కేసు పెట్టించి, జైలుకు పంపిస్తాడు. ఇక చందుకి శిక్ష తప్పదు అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తరుణంలో చందు తరఫున వాదించేందుకు లాయర్ సూర్య తేజ (ప్రియదర్శి ) ఈ కేసును చేపడతారు. ఇక చందు ఏ తప్పు చేయలేదని సూర్య నిరూపిస్తారా? అసలు ఈ కేసులో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు అనే అంశాలు ఈ కోర్టు చిత్రంలో చాలా అద్భుతంగా చూపించారు . ఈ మూవీ చాలా ఆసక్తికరంగా సాగింది. అంతేకాదు నాని కూడా ఊహించని రేంజ్ లో ఈ సినిమా కలెక్షన్లు రాబట్టింది అంటే ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ లభించిందో అర్థం చేసుకోవచ్చు. నాని విషయానికి వస్తే.. ప్రస్తుతం నాని ఒకవైపు హీరోగా, మరొకవైపు సినిమాలను నిర్మిస్తూ ఇలా భారీగా విజయపథం వైపు అడుగులు వేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈయన హిట్ 3, ప్యారడైజ్ సినిమాలలో హీరోగా నటిస్తున్నారు.
#Court ⚖️ Streaming from April 11 on Netflix.#CourtStateVsANobody #Court #RamJagadeeshA #priyadarshiniindalkar #BIGTVCinema @NameisNani @PriyadarshiPN pic.twitter.com/pXjYEhz4Yy
— BIG TV Cinema (@BigtvCinema) April 7, 2025