Suma Kanakala : బుల్లితెర యాంకర్ సుమ ప్రతి తెలుగు పండగను ప్రత్యేకంగా జరుపుకుంటుంది. అందుకే సంబందించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా మహాశివరాత్రి సందర్బంగా ఆమె ఓ ప్రముఖ శివాలయంలో శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తున్న వీడియోను, ఫోటోలను ఆమె షేర్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ శివాలయం ఎక్కడ ఉందో మనం పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
యాంకర్ సుమ మహాశివరాత్రి మహాలింగోద్భవ పవిత్ర ఘట్టం ముగిసి మూడురోజులైన తర్వాత బళ్లారిలో కోట్లాది రూపాయలతో నిర్మించిన ‘ శ్రీ అమృతేశ్వర ఆలయంను సందర్శించారు. ప్రముఖ సినీ నిర్మాత , వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి అతి అరుదైన కృష్ణ శిలలతో బళ్లారిలో కోట్లాది రూపాయలతో నిర్మించిన ‘ శ్రీ అమృతేశ్వర ఆలయంలో ఈ మహాశివరాత్రి పర్వదిన వేళ గర్భగుడిలో వేదవేత్తల మంత్రధ్వనుల మధ్య తాను స్వయంగా మహాస్పటికలింగాని కి అభిషేకం చేసుకోవడం ఎంతో తన్మయత్వానికి గురిచేసిందని సుమ చెప్పారు..
అనంతరం సుమ మాట్లాడుతూ.. ఈ అపురూప పవిత్ర అభిషేక ఘట్టం తన జీవన యానంలో ఒక అందమైన పవిత్ర జ్ఞాపకంగా మిగులుతుందని ప్రముఖ తెలుగు యాంకర్ సుమ కనకాల పేర్కొన్నారు..
Also Read : తమన్ లవ్ స్టోరీ.. ఒక్క మాటకే పెళ్లికి ఒప్పేసుకున్న అమ్మాయి..
అలాగే.. శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అడుగడుగునా, అనుభూతిని, ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఈ అమోఘమైన శ్రీ అమృతేశ్వర ఆలయ నిర్మాణ సమయంలో సాయి కొర్రపాటి ఎన్నో కష్టాలని కటాక్షాలుగా మార్చుకుని నిస్వార్ధ సేవగా అంకితం చేయడం వల్లనే శివ భక్తుల పాలిట కల్పవృక్షమై తరాలపాటు చెప్పుకునేలా ఈ ఆలయం వరాలు వర్షిస్తోందని చెప్పారు..
ఇక గత సంవత్సరం మాఘమాసంలోనే ప్రారంభించబడిన ఈ శ్రీ అమృతేశ్వర ఆలయ ప్రారంభ వేడుకలో సాయి కొర్రపాటి సన్నిహితులు, దర్శక ధీరులు ఎస్. ఎస్. రాజమౌళి, శ్రీమతి రమా రాజమౌళి , విఖ్యాత సంగీత దర్శకులు ఎం. ఎం. కీరవాణి , శ్రీమతి శ్రీవల్లి, కేజీఎఫ్ హీరో యశ్ , విఖ్యాత జానపద గాయని మంగ్లీ, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం భక్త బృందాలకు సాయి కొర్రపాటి చేసిన అద్భుతమైన ఏర్పాట్లకు వేల కొలది భక్తులు ప్రశంసలు కురిపించడం గమనార్హం.. ఈ ఆలయాన్ని ఇప్పటికే ఎంతో మంది సిని, రాజకీయ ప్రముఖులు సందర్శించారు. ప్రస్తుతం సుమ కనకాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సుమ కెరీర్ విషయానికొస్తే.. పలు షోలతో బిజీగా ఉంది. ఆహాలో రీసెంట్ గా సెలెబ్రేటిలతో వంటలు చేయించే ప్రోగ్రాం చేస్తుంది. ఆ షోకు జనాల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది.