Thaman : సినీ ఇండస్ట్రీలో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు తమన్ ( Thaman ). ఎన్నో హిట్ సినిమాలకు సంగీతాన్ని అందించాడు. కేవలం తెలుగులో మాత్రమే కాదు అటు తమిళ్ లో కూడా పలు చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించి అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నారు. అయితే ఈయన మ్యూజిక్ డైరెక్టర్గా మాత్రమే కాదు పలు సినిమాల్లో యాక్టర్ గా నటించాడు. ఇప్పటివరకు అందరికీ బాయ్స్ సినిమా మాత్రమే తెలుసు కానీ తమన్ తమిళ సినిమాల్లో కూడా నటించాడని చాలామందికి తెలియదు. అయితే ఇప్పుడు తమన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తన మ్యూజిక్ తో సంగీత ప్రియుల్ని అలరించడమే కాదు తన మాటలతో అమ్మాయిలను ప్రేమలో కూడా పడేస్తాడని తెలుస్తుంది. ఇది మేము అన్నది కాదు.. తమన్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ వీడియో మాత్రం వైరల్ అవుతుంది. ఆ వీడియో అసలు కథ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
అమ్మాయికి ప్రపోజ్ చేసిన తమన్..
తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా అందరికి తెలుసు.. కానీ ఈయన ఒకప్పుడు సినిమాల్లో నటించాడని కొందరికి మాత్రమే తెలుసు.. అయితే తమన్ హీరో సిద్దార్థ్ తో కలిసి బాయ్స్ సినిమాలో నటించాడు. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో కనిపించాడు. అవి తెలుగు కాదు. తమిళ్ సినిమాలు.. అవును మీరు విన్నది అక్షరాల నిజమే. ఈయన తమిళ్ళో పలు చిత్రాల్లో కూడా నటించాడు. ఓ సినిమాలోని ప్రపోజల్ సీన్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ వీడియో క్లిప్ లో తమన్ ఒక ఫంక్షన్ లో అమ్మాయి దగ్గరికి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పెళ్లి వేసుకుంటాను అని ఆ వీడియోలో చెప్పడం చూడొచ్చు. తమన్ ప్రపోజల్ కి ఇంప్రెస్ అయిన అమ్మాయి వెంటనే పెళ్లి చేసుకునేందుకు ఒప్పేసుకుంటుంది . అయితే అక్కడ ఫాదర్ లేరు మనం బయటికి వెళ్లి పెళ్లి చేసుకుందాం అంటే తమన్ ఫ్రెండ్స్ ఫాదర్ ని కూడా తీసుకొస్తారు ఇక వెంటనే అక్కడే పెళ్లి అయిపోతుంది. తమన్ చెప్పిన ఒక్క మాటకే ఆ అమ్మాయి పెళ్లికి రెడీ అయిందంటే తమన్లో ని టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు అంటూ ఆ వీడియోను నెటిజన్లు మరింత వైరల్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఆ వీడియోనే వైరల్ అయింది..
Also Read : హీరో ప్రదీప్ రంగనాథన్ రియల్ స్టోరీ.. డైరెక్టర్ నుంచి హీరోగా..
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కెరీర్..
టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే టక్కున తమన్ పేరే అందరూ చెప్తున్నారు. ఆయన ఇటీవల కంపోస్ట్ చేసిన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. రీసెంట్గా వచ్చిన డాకు మహారాజు మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతమైన రెండు మూడు భారీ ప్రాజెక్టులకు మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అలాగే బాలయ్య అఖండ 2 తాండవం సినిమాకి కూడా ఇతనే మ్యూజిక్ డైరెక్టర్.. ఇక వీటితో పాటు తమిళ్లో కూడా పలు సినిమాలకు సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. తనకి తమన్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు..
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">