SA vs ENG: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament ) నేపథ్యంలో.. ఇవాళ కీలక మ్యాచ్ జరిగింది. కరాచీలోని నేషనల్ స్టేడియం ( National Stadium, Karachi ) వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా (England vs South Africa )జట్ల మధ్య 11 వ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు… అత్యంత దారుణంగా ప్రదర్శన కనబరిచింది. పరువు నిలబెట్టుకొని ఇంటికి వెళ్దామని క్రికెట్ అభిమానులు అనుకుంటే… ఇంగ్లాండ్ ఆటగాళ్లు మాత్రం… అభిమానుల పరువు తీసేలా ఆడుతున్నారు. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో జరిగిన చివరి మ్యాచ్ లో 179 పరుగులకే కుప్పకూలింది ఇంగ్లాండ్.
Also Read: SA vs ENG: బ్యాటింగ్ చేయనున్న ఇంగ్లాండ్..కర్మకాలి ఓడితే సౌతాఫ్రికా ఇంటికే ?
38.2 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ టీం… 179 పరుగులకు ఆల్ అవుట్ అయింది. టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్.. ఎవరు కూడా రాణించకపోవడంతో… ఇంగ్లాండ్ టీం అట్టర్ ఫ్లాప్ అయింది. మంచి ఊపులో ఉన్న దక్షిణాఫ్రికా టీం ముందు.. కేవలం 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. భయంకరంగా ఆడుతున్న దక్షిణాఫ్రికా ప్లేయర్లు… ఆ 180 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించి… విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు.. సెమీ ఫైనల్ కు కూడా దక్షిణ ఆఫ్రికా చేరే అవకాశాలు మరింత పెరిగిపోయాయి. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓడిపోయిన కూడా… నేరుగా సెమీ ఫైనల్ కు ( Champions Trophy 2025 Tournament semi final) వెళుతుంది. రన్ రేట్ ప్రకారం…. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన కూడా దక్షిణాఫ్రికాకు సెమీస్ అవకాశాలు మరింత పెరిగాయి. ఈ దెబ్బకు… ఆఫ్ఘనిస్తాన్ టీం ఇంటికి వెళ్లాల్సిందేనని అంటున్నారు. దీనిపై ఐసీసీ మరికాసేట్లోనే ప్రకటన కూడా చేయనుంది. ఇక అటు మరికాసేపట్లోనే రెండవ ఇన్నింగ్స్ ప్రారంభం అవుతుంది.
Also Read: Mohammad Rizwan: పాకిస్థాన్ టీంలో భూకంపం.. కెప్టెన్ పదవికి రిజ్వాన్ రాజీనామా ?
ఇది ఇలా ఉండగా… ఇప్పటికే గ్రూప్ ఏ లో టీమిండియా అలాగే న్యూజిలాండ్ జట్టు చిరు నాలుగు పాయింట్లు సంపాదించుకొని సెమీఫైనల్ కు చేరుకున్నాయి. టీమిండియా అలాగే న్యూజిలాండ్ రెండు జట్లు కూడా… పాకిస్తాన్ అటు బంగ్లాదేశ్ రెండు జట్లను ఓడించాయి. ఈ నేపథ్యంలోనే చెరో నాలుగు పాయింట్లు సంపాదించుకున్నాయి. రేపు న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మధ్య… చివరి లీగ్ మ్యాచ్ జరుగుతుంది. అందులో గెలిచిన జట్టు మొదటి స్థానంలో ఉంటుంది. అప్పుడు సెమీఫైనల్ లో ఏ జట్లు తలపడతాయి అనేది చెప్పవచ్చు. ఇక అటు గ్రూపు బి నుంచి.. ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ కు చేరింది. దక్షిణాఫ్రికా కూడా దాదాపు సెమీఫైనల్ చేరినట్టే. కాబట్టి ఈ నాలుగు జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచులు జరుగుతాయి. టీమిండియా ఆడే సెమీ ఫైనల్ దుబాయ్ వేదికగా జరుగుతుంది. టీమిండియా ఫైనల్ కు చేరినా కూడా… దుబాయ్ లోనే ఫైనల్స్ జరుగుతాయి. మిగిలిన మ్యాచ్ లు పాక్ లో జరుగుతాయి.