trinayani serial today Episode: నేత్రిలో ఉన్న నయని ఆత్మ విశాల్ వాళ్ల ఇంటికి వస్తుంది. విశాల్ ను చూసి బాబు గారు అని పిలుస్తుంది. ఆ పిలుపునకు అందరూ షాకింగ్ అటూ ఇటూ చూస్తుంటారు. నయని పిలిచిందని అనుకుంటారు. లంగావోణీలో ఉన్న త్రినేత్రని చూసి అందరూ భయంతో వణికిపోతుంటారు. కోమాలో ఉన్న నయని వదిన లేచి రావడం ఏంటని విక్రాంత్ ఆలోచిస్తుంటాడు. నయనిని చూసిన వల్లభ కళ్లు తిరిగి కిందపడిపోతాడు. నేత్రి దగ్గరకు వచ్చి నీళ్లు చల్లి లేపుతుంది. ఇంతలో విశాల్ ఆశ్చర్యంగా చూస్తూనే నయని అని పిలుస్తాడు.
నేత్రి నన్నా బాబుగారు అని అడుగుతుంది. నిన్ను కాకుండా ఇంకెవరిని పిలుస్తారు అక్కా అంటూ సుమన అంటుంది. దీంతో మిమ్మల్ని చూస్తుంటే నాకన్నా పెద్దవారిలా ఉన్నారు. నన్ను అక్కా అంటున్నారేంటి? అని నేత్రి అడగ్గానే అందరూ షాక్ అవుతారు. ఇంతలో తిలొత్తమ్మ ఎందుకు అలా మాట్లాడుతున్నావు నయని.. అయినా నువ్వు హాస్పిటల్ నుంచి లంగావోణిలో వచ్చావేంటి..? అని అనుమానంగా అడుగుతుంది. దీంతో నేత్రి నేను హాస్పిటల్ నుంచి రావడం ఏంటండి.. నేను గుడికి వెళ్లినట్లు గుర్తు అంటుంది. దీంతో మరింత షాకింగ్ గా విక్రాంత్ గుడికా.. అని అడుగుతాడు. అవునని కానీ నాకు విశాల్ బాబు రూపం తప్పా మరింకేం గుర్తుకు రావడం లేదు అని చెప్తుంది నేత్రి.
ఇంతలో పావణమూర్తి కల్పించుకుని పోనిలే బాబు జరిగింది గుర్తు రాకపోయినా నయనమ్మ క్షేమంగా వచ్చింది కదా..? అది చాలు మనకు అంటాడు. ఇంతలో నేత్రి ఎందుకు నన్ను అందరూ నయని అంటున్నారు. నేను నయని కాదు. నా పేరు త్రినేత్రి. అని చెప్పగానే అందరూ షాకింగ్ గా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటుంటారు. ఎందుకలా చూసుకుంటున్నారు. మీరే చెప్పండి విశాల్ బాబు గారు నా పేరు త్రినేత్రి కదా..? అంటూ విశాల్ ను అడుగుతుంది. అదేంటి నయని నీ పేరు త్రినయని.. నువ్వు త్రినేత్రి అని చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది మాకు అంటాడు విశాల్. దీంతో త్రినయని అన్నా మూడు కళ్లే త్రినేత్రి అన్నా మూడు కళ్లే కదా బాబు. అయినా మీరు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలవండి.
మీకు ఏ పేరు నచ్చుతుందో నాకు అదే నచ్చుతుంది అని నేత్రి చెప్పగానే.. ఇంతలో హాసిని సిగ్గేస్తుందా..? అని అడగ్గానే.. ఇంతలో సుమన అవును నువ్వు వెళ్లినప్పుడు కట్టుకున్న చీర ఎక్కడుంది అని అడుగుతుంది. దీంతో నేత్రి ఏ చీర అక్కా అని మళ్లీ అడగ్గానే సుమన ఇరిటేటింగ్ గా నువ్వు నాకు అక్కవు నేను నీకు అక్కను కాదు. నన్ను చెల్లి అను అంటూ పిలువు లేదంటే సుమన అని పేరుతో పిలువు అంటుంది సుమన. ఇంతలో నేత్రి విశాల్ ఎత్తుకున్న గాయత్రి పాపను చూస్తూ ఎంత బాగుందో అంటుంది. ఇంతలో వల్లభ కన్పీజన్ గా చూస్తూ ఏంటి ఇదంతా నాకేం అర్తం కావడం లేదు. అంటాడు. ఇంతలో విశాల్ నేత్రిని లోపలికి తీసుకెళ్లమని హాసినికి చెప్తాడు. సరేనని నేత్రిని లోపలికి వెళ్దాం పద చెల్లి అనగానే ఇల్లు చూపిస్తారా..? అని అడుగుతూ బాబు గారి ఇల్లు నా ఇల్లే కద చూపించండి అంటూ హాసిని వెనకాల వెళ్తుంది.
హాసిని నేత్రిని తీసుకెళ్లాక అందరూ నయని ఏంటి ఇలా మాట్లాడుతుంది. అసలు ఆస్పత్రి నుంచి ఇలా తిరిగిరావడం ఏంటి..? అని మాట్లాడుకుంటారు. విశాల్ ను తప్పా ఎవరిని గుర్తు పట్టడం లేదు. అంటే మతిస్థిమితం కోల్పోయిందా..? ఏంటి అని తిలొత్తమ్మ అనుమానంగా అంటుంది. అయితే వచ్చింది నయని వదినేనా అని నాకు డౌటుగా ఉదంటాడు విక్రాంత్. విక్రాంత్ మాటలకు అందరూ షాక్ అవుతారు.
తర్వాత తిలొత్తమ్మ, వల్లభ నయని గురించి మాట్లాడుకుంటారు. అసలు వచ్చింది నయనేయా..? లేక మరెవరైననా..? అంటూ ఇద్దరూ ఇరిటేటింగ్ గా ఫీలవుతుంటారు. త్రినయని కాదు త్రినేత్రి అంటుంది. విశాల్‌ను గుర్తు పడుతుంది. సుమనను అక్కా అంటుంది. హాసిని అక్కా అంటుంది. అంతా కన్పీజన్ గా ఉందని తిలొత్తమ్మ ఆలోచిస్తుంది. తలకు గాయం అయినందుకు నిజంగానే మతిస్థిమితం కోల్పోయిందా..? లేకపోతే కావాలనే నాటకం ఆడుతుందా…? అని తిలొత్తమ్మ వల్లభతో అంటుంది. వల్లభ మాత్రం ఏం అర్థం కాక పిచ్చి చూపులు చూస్తుంటాడు.
నయని ప్రవర్తన అర్థం కావడం లేదని విశాల్ గాయత్రి దేవి ఫోటో దగ్గర నిలబడి చెప్తుంటాడు. తలకు గాయం అవ్వడం వల్లే ఇలా మారిందా…? అని అనుమానపోతాడు. ఇంతలో నేత్రి అక్కడకు వస్తుంది. గాయత్రిదేవి ఫోటో చూసి ఈవిడ ఎవరు అని అడుగుతుంది. ఎక్కడుంటారు అనడంతో విశాల్ మా అమ్మ గురించి కూడా మర్చిపోయింది అని మనసులో అనుకుంటాడు. ఇంతలో హాసిని వచ్చి నువ్వేంటి చెల్లి నాకు చెప్పకుండా ఇక్కడకు వచ్చావు అని అడుగుతుంది. బాబుగారిని దగ్గర నుంచి చూడాలనిపించి వచ్చానని చెప్తుంది నేత్రి.
విశాల్ తల్లి ఫొటో దగ్గరకు వెళ్లి త్రినయని త్రినేత్రిగా వచ్చిందని తలకు గాయం కావడం వల్లే అలా మారిందేమో అని అంటాడు. ఇక త్రినేత్రి విశాల్ దగ్గరకు వస్తుంది. గాయత్రీదేవి ఫొటో చూసి ఈవిడ ఎవరు ఎక్కడున్నారు అని త్రినేత్రి అడుగుతుంది. తన తల్లి గురించి కూడా మర్చిపోయిందని అనుకుంటాడు. ఇక హాసిని వచ్చి నువ్వేంటి చెల్లి నా కళ్లు కప్పి మా మరిది దగ్గరకు వచ్చావని అంటే దగ్గరగా చూడాలి అనిపించిందని… అందుకే వచ్చానని నేత్రి చెప్పగానే విశాల్ నువ్వు దేవీపురం వెల్లి వచ్చి రెండు రోజులు కూడా కాలేదు. అప్పుడే బాగా గ్యాప్ వచ్చినట్టు మాట్లాడుతుంది చూడు అని హాసిని చెప్పగానే..
దేవీపురం అనే మాట వినగానే నేత్రికి వాళ్ల బామ్మ, అత్తా, మామలు, నయనికి కారు యాక్సిడెంట్ జరిగింది. తను విష ప్రసాదం తిన్న విషయాలు గుర్తుకు వస్తాయి. దీంతో అదే విషయం విశాల్, హాసినికి చెప్తుంది. దీంతో తనకు యాక్సిడెంట్ అయినట్టు గుర్తుకు వచ్చిందా..? అని అడిగితే అవునని.. నేను ప్రసాదం తీసుకున్న తర్వాత కళ్లు తిరిగి కిందపడిపోయాను అంటుంది. దీంతో హాసిని మళ్లీ మొదటికి వచ్చింది అని నేత్రిని అక్కడి నుంచి తీసుకుని వెళ్తుంది.
విక్రాంత్ టెన్షన్‌గా డాక్టర్‌కు ఫోన్ చేస్తాడు. డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇంతలో సుమన వచ్చి ఎవరికి ఫోన్ చేస్తున్నారు అని అడిగితే డాక్టర్‌కు చేస్తున్నాను కానీ లిఫ్ట్ చేయడం లేదని చెప్పగానే సుమన ఆ నెంబర్ నాకివ్వండి నేను గట్టిగా కడిగిపారేస్తాను అని.. సుమన డాక్టర్ ను తిడుతుంది. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.