Intinti Ramayanam Serial Today Episode: అవని అక్షయ్ దగ్గరకు వచ్చి ఏవండి ఈ ఫైల్స్ క్లియర్ చేయండి అని చెప్తుంది. ఇవి చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉండిపోయాయి అని చెప్పగానే అక్షయ్ కి చాలా కోపం వస్తుంది. అవనిని గుర్రుగా చూస్తూ.. నేను ఏమైనా మిషన్ అనుకుంటున్నావా..? లేకపోతే రోబోను అనుకుంటున్నావా..? అసలు ఇక్కడున్న ఈ పనులు చేయడానికే నాకు టైం సరిపోదు. అలాంటిది ఇవి తెచ్చి మళ్లీ నాకు ఇస్తున్నావేంటి అంటూ కోప్పడతాడు అక్షయ్. అక్షయ్ మాటలకు అవని షాక్ అవుతుంది.
ఇంతలోనే తేరుకుని నేను చెప్పేది కాస్త మొత్తం వినండి.. ఈ ఫైల్స్ చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉండిపోయాయి. అందుకే ఈ ఫైళ్లు క్లియర్ చేయమని చెప్తున్నాను అంటుంది అవని. ఆ మాటలకు అక్షయ్ మరింత కోపంగా లేదు లేదు నేను ఈ ఫైళ్లు అసలు క్లియర్ చేయను. సాయంత్రం వరకు నాకు ఈ వర్కే సరిపోతుంది. ఇక అవి ఎప్పుడు చేయాలి. ఒకవేళ అవి చేయాల్సి వస్తే నా ఈ వర్క్ ఆపేయాలి. కాబట్టి ఆ ఫైళ్స్ నేను ఎట్టి పరిస్థితుల్లో చూడను అంటూ కరాకండిగా చెప్పేస్తాడు అక్షయ్. దీంతో అవని సరే అంటూ అక్కడి నుంచి వెళ్లి తన పని తాను చేసుకుంటుంది.
ఇంతలో చాముండేశ్వరి కోపంగా అక్షయ్ దగ్గరకు వస్తుంది. ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటున్నావా..? లేకపోతే ఆఫీసు అనుకుంటున్నావా..? నీ పనులన్నీ మీ ఆవిడతో చేయిస్తున్నావేంటి..? పైగా అధికారం చూపిస్తున్నావేంటి..? ఏదైనా ఉంటే నీ ఇంట్లో చూపించుకో కానీ ఆఫీసులో పనికిరాదు అంటూ అక్షయ్ మీద సీరియస్ అవుతుంది చాముండేశ్వరి. చాముండేశ్వరి మాటలకు అక్షయ్ షాక్ అవుతాడు. కానీ బయటకు ఏమీ అనలేక మనసులో బాధపడుతుంటాడు. ఇంతలో చాముండేశ్వరి అవని దగ్గర ఉన్న ఫైళ్స్ తీసుకుని వచ్చి అక్షయ్ కి ఇస్తూ ముందు ఈ ఫైళ్స్ క్లియర్ చేయ్.. తర్వాత వేరే పని ఏదైనా చూసుకో అంటూ వార్నింగ్ ఇస్తుంది.
దీంతో అక్షయ్ మనసులోనే బాధపడుతూ ఇక నా వల్ల కాదు నేను చేయలేను అనుకుంటాడు. చాముండేశ్వరి మాత్రం ఏంటి అక్షయ్ పలకడం లేదు. అసలు నువ్వు ఈ వర్క్ చేస్తావా..? లేదా.? చెప్పడం లేదేంటి..? చేయని అని మాత్రం చెప్పొద్దు.. నువ్వు కచ్చితంగా ఈ వర్క్ చేయాల్సిందే అన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ వర్క్ కంప్లీట్ చేశాకే నువ్వు ఇంటికి వెళ్లాలి అని చెప్పగానే.. అక్షయ్ కి ఏం చేయాలో తోచక భయపడుతూనే సరే మేడం అంటూ చాముండేశ్వరి చేతిలో ఫైల్స్ అన్ని తీసుకుని క్లియర్ చేస్తానులే మేడం.. అంటూనే ఇదిగోండి ఈ లెటర్ తీసుకోండి అని చెప్తాడు. చాముండేశ్వరి ఆ లెటర్ తీసుకుంటూ ఏంటిది అని అడుగుతుంది.
అది నా రాజీనామా లెటర్ అని అక్షయ్ చెప్తాడు. నేను ఇక ఈ ఆఫీసులో ఉండను.. నేను వెళ్లిపోతాను అని చెప్పగానే చాముండేశ్వరి, అవని షాక్ అవుతారు. అసలు ఈయనేంటి ఇలా చేస్తున్నారు అని మనసులో అనుకుంటుంది. వెంటనే చాముండేశ్వరి దగ్గరకు వెళ్లి మేడం మీరు ఆయన రిజైన్ లెటర్ యాక్సెప్ట్ చేయకండి అని చెప్తుంది. దీంతో అక్షయ్ కోపంగా మీరు యాక్సెప్ట్ చేసినా చేయకున్నా నేను ఈ జాబ్ చేయను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. అవని, అక్షయ్‌ని కన్వీన్స్ చేయాలని చూస్తుంది కానీ అక్షయ్ వెళ్లిపోతాడు. ఇంతటితో ఇవాళ్టీ ఇంటింటి రామాయణం సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.