E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today September 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ  

Nindu Noorella Saavasam Serial Today September 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు రాసిన డైరీ తీసుకుని అమర్‌ చదువుతుంటాడు. అది చూసిన ఆరు హ్యాపీగా ఫీలవుతుంది. గుప్త గారు ఆయన నా డైరీ మొత్తం చదివేస్తున్నారు అని చెప్తుంది. చదవవలెనని విధి లిఖితం బాలిక అని చెప్తాడు గుప్త. డైరీ చదువుతున్న అమర్‌ ఒక పేజీ చదివి షాక్‌ అవుతాడు. దీంతో ఆరు ఏంటి గుప్త గారు ఆయన చదువుతూ షాక్‌ అయ్యారు.. ఆ పేజీలో ఏముంది అని అడుగుతుంది. నువ్వు దిన చర్య రాసిన దానివి నీకు గుర్తు ఉండదా..? అంటాడు గుప్త. అప్పుడేం రాశానో ఇప్పుడేం గుర్తుకు ఉంటుంది గుప్తగారు అంటూ ఆరు  తను రాసింది గుర్తు చేసుకుని అప్పట్లో నాకు మనోహరి మీద వచ్చిన కొన్ని అనుమానాల గురించి డైరీలో రాసినట్టు గుర్తు కొంపదీసి ఆయన ఆ పేజీ చదివేశారా..? అని అడుగుతుంది.

ఆ పుటను మనోహరి ఏనాడో చించివేసినది. నువ్వు రాసిన దినచర్య నుంచి ఆ పత్రము ఏనాడో తొలగించబడినది అని చెప్తాడు. దీంతో ఆరు మరి ఆయన ఏం చదువుతున్నారు అని అడుగుతుంఇది. దీంతో ఇన్ని మార్లు మమ్మలను అడుగుట ఏల నువ్వే నీ పతి దేవుని దగ్గరకు వెళ్లి ఆ పత్రమును చదువుము అని చెప్పగానే.. ఆరు అమర్‌ దగ్గరకు వెళ్తుంది. వెంటనే అమర్‌ డైరీ మూసేస్తాడు. డైరీ తీసుకుని బయటకు వెళ్లిపోతాడు. దీంతో ఆరు డిసపాయింట్ అవుతుంది. చ ఆ పేజీలో ఏముందో చూడలేకపోయాను గుప్త గారు అంటుంది. దీంతో చింతించకుము బాలిక మరి కాసేపట్లో నీకు ఆ పుటలో ఏముందో తెలియును అంటాడు. ఎలా తెలుస్తుంది అంటూ ఆరు అడగ్గానే.. నీ పతిదేవుడు చెప్పెదడు.. అంటాడు గుప్త.. ఏం చెప్తారు అని ఆరు అడగ్గానే.. నీవు గతంలో చేసిన నిర్వాకములన్నీయూ చెప్పును.. అంటాడు.. అంతగా నేనేం చేశాను.. అంటూ ఆరు అడగ్గానే.. నీవే ఆలకించుము పద బాలిక అంటూ ఇద్దరూ అక్కడి నుంచి బయటకు వస్తారు.

Advertisement

గార్డెన్‌లో ఉన్న ఆరు.. గుప్త గారు నా చెల్లి వచ్చేసింది.. తనకు నిజం తెలిసిపోయినట్టు ఉంది అని చెప్తుంది. నీ స్నేహితురాలు కూడా వచ్చింది బాలిక అంటాడు గుప్త. మిస్సమ్మ, రాథోడ్‌ లోపలికి వెళ్తుంటే.. వెనక భాగీ ఆగండి అంటూ మనోహరి వస్తుంది.   అందరూ లోపలికి వెళ్లగానే.. అమర్‌ హాల్లోనే కూర్చుని ఉంటాడు. మిస్సమ్మ కంగారు పడుతూ.. ఏవండి నేను మీకు ఒక విషయం చెప్పాలి అంటుంది. దీంతో అమర్ కాస్త ఆగు భాగీ అంటాడు. మనోహరి భయపడుతుంది. బయట గార్డెన్‌లో ఉన్న ఆరు గుప్త గారు ఇప్పుడు ఆయన చేతిలో దానికి ఉంటుంది. నన్ను చంపినందుకు దాన్ని రెండు చెంపలు వాయించి బయటకు పంపిస్తారు. పోలీసులను పిలిచి జైలుకు పంపిస్తారు. అది జీవితాంతం జైలులో ఉండిపోతుంది. రండి రండి చూద్దాం అంటూ డోర్‌ దగ్గరకు వెళ్తారు.

లోపల రాథోడ్‌ సార్‌ మిస్సమ్మ చెప్పేది త్వరగా వినండి సార్‌ అంటాడు. దీంతో అమర్‌ కూడా నేనే మీకో విషయం చెప్పాలి. అదేంటంటే మనోహరి గురించి.. అంటాడు. నేను చెప్పాలనుకుంటుంది కూడా తన గురించే అండి.. అంటుంది. ముందు నన్ను చెప్పనివ్వు  అంటాడు అమర్‌. దీంతో రాథోడ్‌ సార్‌ సార్‌ మిస్సమ్మ చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్‌ సార్‌ అంటాడు. దీంతో అమర్‌ నేను చెప్పేది కూడా ఇంపార్టేంటే.. అంటాడు అమర్‌. డోర్‌ దగ్గర నిలబడ్డ ఆరు ఆయన ఇప్పుడు ఏ విషయం చెప్పాలనుకుంటున్నారు గుప్త గారు అని అడుగుతుంది. నువ్వు దినచర్యలో లిఖించిన విషయం అని గుప్త చెప్తాడు. అమర్‌.. మనోహరి ఇలా రా అంటూ దగ్గరకు పిలుస్తాడు.

Advertisement

మనోహరి దగ్గరకు రాగానే డైరీ చూపిస్తూ.. ఇదేంటో తెలుసా..? ఇది అరుంధతి డైరీ.. ఇందులో అరుంధతి ఏం రాసిందో తెలుసా..? నీకు సంబంధించిన విషయం ఒకటి రాసింది… ఇది ఇవాళ నాకు కనిపించింది. ఈ విషయం నీకు తెలియాలని బయటకు తీసుకొచ్చాను.. అంటాడు అమర్‌.. కట్‌ చేస్తే.. తర్వాత రూంలో పడుకున్న మిస్సమ్మ.. అమర్‌ నిద్రపోయాక ఆరు రూంలోకి వెళ్లి క్యాండిల్‌ లైట్‌లో ఆరు ఫోటో చూస్తుంది. షాక్‌ అవుతుంది.  ఆ ఫోటో చూడగానే ఆరు తనతో గడిపిన రోజులు చెప్పిన మాటలు అన్ని గుర్తు చేసుకుంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×