Indian Railways: భారతీయ రైల్వేస్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రైలు రాజధాని ఎక్స్ ప్రెస్. ప్రీమియం స్పెసిలిటీస్ ను కలిగి ఉంటుంది. ఈ రైలుకు మరిన్ని అదనపు ఫీచర్లను యాడ్ చేస్తూ వందే భారత్ స్లీపర్ రైలును రూపొందించారు. త్వరలోనే సరికొత్త వందేభారత్ స్లీపర్ రైలు ప్రయాణీకుల ముందుకు రాబోతోంది. వందే భారత్ స్లీపర్ అత్యధిక వేగం, సౌకర్యం, భద్రతా ఫీచర్లతో రాత్రిపూట ప్రయాణాన్ని మరింత మెరుగు పరచబోతోంది. ప్రీమియం రైలు ప్రయాణానికి రాజధాని ఎక్స్ ప్రెస్ తో పోల్చితే వందే భారత్ స్లీపర్ లో పలు అడ్వాంటేజెస్ ఉన్నాయి. మెరుగైన బెర్తులు, ఆటోమేటిక్ డోర్లు, బయో-వాక్యూమ్ టాయిలెట్లు, మెరుగైన ఫైర్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది.
రాజధానితో పోల్చితే భారత్ స్లీపర్ లో బెస్ట్ స్పెసిలిటీస్
⦿ వందే భారత్ స్లీపర్ రైలు గరిష్టంగా గంటలకు 160 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.
⦿ భారతీయ రైల్వే సంస్థ ఈ కొత్త రైలులో బెర్తులను మెరుగైన కుషనింగ్ తో రూపొందించారు. అదనంగా, నిచ్చెనలను ఏర్పాటు చేశారు. ఇవి అప్పర్, మిడిల్ బెర్తులకు ఈజీ యాక్సెస్‌ను అందిస్తాయి.
⦿ రాజధాని ఎక్స్ ప్రెస్ లా కాకుండా వందే భారత్ స్లీపర్ స్వీయ చోదకమైనది. అంటే దీనికి లోకోమోటివ్ అవసరం లేదు. రెండు చివర్లలో డ్రైవర్ క్యాబిన్లను కలిగి ఉంటుంది. ఈ డిజైన్ స్టేషన్లలో టర్నరౌండ్ సమయాన్ని తగ్గిస్తుంది.
⦿ ఈ రైలు పూర్తిగా సీలు చేయబడిన గ్యాంగ్ వేలను కలిగి ఉంది. రైలంతా బెస్ట్ ఎయిర్ కండిషనింగ్ ను అందిస్తుంది. రైల్లోకి ఎలాంటి దుమ్ము ప్రవేశించే అవకాశం లేదు.
⦿ మెరుగైన మన్నికతో పాటు భద్రత కోసం, సైడ్ వాల్స్, రూఫ్, ఎండ్ వాల్స్, ఫ్లోర్ షీట్లు, క్యాబ్‌లు ఆస్టెనిటిక్ స్టీల్ తో తయారు చేయబడ్డాయి.
⦿ వందే భారత్ స్లీపర్ రైలులో ఆటోమేటిక్ ఎంట్రీ, ఎగ్జిట్ డోర్‌లు డ్రైవర్ నియంత్రణలో ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం కోచ్‌ల మధ్య ఆటోమేటిక్ ఇంటర్ కనెక్టింగ్ డోర్లు ఉన్నాయి.
⦿ రైలులో బయో-వాక్యూమ్ టాయిలెట్లు ఉంటాయి. టచ్-ఫ్రీ ఫిట్టింగ్‌లు ఉన్నాయి. అలాగే AC ఫస్ట్ క్లాస్ కోచ్‌లో షవర్ క్యూబికల్ కూడా ఉంది.
⦿ హైలెవెల్ సేఫ్టీ కోసం, రైలు క్రాష్ బఫర్లు, డిఫార్మేషన్ ట్యూబ్‌లను కలిగి ఉంటుంది. ఇది EN 45545 HL3 ఫైర్ సేఫ్టీ స్టాండర్డ్ ను కలిగి ఉంటుంది. అదనపు రక్షణ కోసం ఫైర్ బారియర్ వాల్ ని కలిగి ఉంటుంది.
⦿ వందే భారత్ స్లీపర్ సున్నితమైన, కుదుపు లేని రైడ్ అనుభవాన్ని అందిస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రోటో టైప్ లో 16 కోచ్‌లు ఉన్నాయి. ఒక AC ఫస్ట్-క్లాస్, నాలుగు AC 2-టైర్, పదకొండు AC 3-టైర్ కోచ్‌లతో మొత్తం 823 మంది ప్రయాణీకులు వెళ్లే అవకాశం ఉంటుంది.
⦿ వందే భారత్ స్లీపర్ రైలు రాజధాని రైళ్లను మించిన ఫీచర్లను కలిగి ఉంది. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ విషయంలో మరింత మెరుగ్గా రూపొందించారు.
Read Also: ట్రైన్ టికెట్ తో ఇన్ని ఫ్రీ సదుపాయాలా? కచ్చితంగా మీకు ఈ విషయాలు తెలియాల్సిందే!