Intinti Ramayanam Serial Today Episode: అవని పూజ చేసి హారతితో హాల్లోకి రాగానే పార్వతి అందిరనీ పిలుస్తుంది. వచ్చి హారతి తీసుకోమని చెప్తుంది. అందరూ వచ్చి హారతి తీసుకుంటుంటారు. పల్లవి మాత్రం అందరి దగ్గర నువ్వు క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నావని నాకు తెలుసు అని మనసులో అనుకుంటుంది. నా గురించి తర్వాత ఆలోచిద్దువు కానీ ముందు హారతి తీసుకో అంటుంది అవని.. ఇంతలో కన్నయ్య వెజిటేబుల్స్ తీసుకుని వస్తాడు. వెంటనే నాకు ఆకలిగా ఉందని ఏదైనా ఇవ్వమని అడుగుతాడు. అవని పాలు ఇస్తానంటే. వద్దని చెప్తాడు. దీంతో చల్లటి జ్యూస్ తీసుకొస్తానని చెప్తుంది అవని. రాజేంద్రప్రసాద్, అక్షయ్‌ని పిలిచి హారతి తీసుకోమని చెప్తాడు. దీంతో అక్షయ్ హారతి తీసుకోకుండా చూస్తుంటాడు. దీంతో రాజేంద్ర ప్రసాద్ కోపంగా పెళ్లాం మీద కోపాన్ని హారతి మీద చూపించకు అంటాడు దీంతో అక్షయ్ హారతి తీసుకుని వెళ్తాడు. ఇంతలో రాజేంద్ర ప్రసాద్ అవనిని మెచ్చుకుంటాడు. దీంతో మిగతా కోడళ్లు ఫీలవుతారు.
అవని ఆఫీసుకు బయలుదేరుతుంది. ఆఫీసు నుంచి కారు వస్తుంది. డ్రైవర్ వచ్చి అవనిని పిలుస్తాడు. అప్పుడే అక్షయ్ ఆఫీసుకు వెళ్లడానికి వస్తాడు. ఇద్దరి మద్య గొడవ జరగుతుంది. దీంతో అక్షయ్‌కి అవని కౌంటర్ ఇస్తుంది. భార్యాభర్తల గురించి మాట్లాడటానికి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదండి అంటుంది. అక్షయ్ వెళ్లిపోతుంటే.. నేను వస్తాను ఆగండి.. మీకోసం నేను కారును కూడా త్యాగం చేశానని చెప్తుంది. దీంతో ఇద్దరూ కలిసి ఆఫీసుకు వెళ్తారు.
ఆఫీసుకు వెళ్లిన అవనికి అందరూ గుడ్‌మార్నింగ్ చెప్తుంటారు.. అక్షయ్‌ని ఎవ్వరూ పట్టించుకోరు దీంతో అక్షయ్ కోపంతో రగిలిపోతుంటాడు. ఇంతలో ఒక ఎంప్లాయి వచ్చి అక్షయ్‌కి గుడ్ మార్నింగ్ చెప్తుంది. దీంతో అక్షయ్ కోపంగా తిడతాడు. అవని రాగానే విష్ చేస్తారు.. నన్ను మాత్రం ఇప్పుడా విష్ చేసేది అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తాడు.
ఇంట్లో పల్లవి సాంగ్స్ వింటూ డాన్స్ చేస్తుంటే.. శ్రియ వెళ్తుంది. శ్రియను చూసిన పల్లవి ఏంటి అని అడుగుతుంది. దీంతో శ్రియ వెటకారంగా నువ్వు చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నట్టు ఉన్నావు.. అని అడుగుతుంది. పల్లవి అది అడగడానికి వచ్చావా..? అంటుంది. అవును అని శ్రియ చెప్పగానే.. నేను ఎందుకు హ్యాపీగా ఉన్నానో.. ఎందుకు మూడ్ ఆఫ్‌లో ఉన్నానో అన్ని నీకు చెప్పాలా..? అని అడుగుతుంది పల్లవి. అవును నువ్వు ఇంత జోష్‌లో ఉన్నావంటే నువ్వు ఏదో ప్లాన్ చేశావని నాకు అర్థం అయింది అంటుంది శ్రియ.
అవునా అర్థం అయినప్పుడు మళ్లీ అడగడం దేనికి అంటుంది పల్లవి. ఇంత నెగ్లెక్ట్ గా చెప్తున్నావేంటి..? అంటూ శ్రియ అడుగుతుంది. నేను క్యాజువల్ గానే చెప్పాను.. అది నీకు రెక్లెస్ గా అనిపిస్తే అది నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదు కదా..? అంటుంది పల్లవి. నువ్వు ఏ ప్లాన్ చేసినా నాకు చెప్పేదానివి ఇప్పుడు నాకెందుకు చెప్పడం లేదు అంటుంది. కొన్ని చెబితేనే బాగుంటాయి. కొన్ని చెప్పకపోతేనే బాగుంటాయి. అని పల్లవి చెప్తుంది. దీంతో నువ్వు ఏం చేయాలనుకున్నా నా సపోర్ట్ లేకుండా ఏమీ చేయలేవు అంటుంది శ్రియ.. దీంతో నువ్వు పెద్ద పోటుదానివని ఫీలవుతున్నావా..? మరీ ఎక్కువ ఊహించుకోకు.. కాన్పిడెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ అయితే చాలా ప్రమాదం అంటుంది పల్లవి.. నాకు చెబుతున్న ఈ మాట నువ్వే తెలుసుకునేలా చేస్తాను అంటూ శ్రియ వెళ్లిపోతుంది. శ్రియకు బాగా ఎక్కువైందని పల్లవి తిట్టుకుంటుంది. ఇంతటితో ఇవాళ్టీ ఇంటింటి రామాయణం సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.