BigTV English

Pushpa2 : నువ్వు ఎంత ఫైర్ అయిన.. పెళ్ళాం ముందు పిల్లే.. ఈ షార్ట్ అదిరిపోయింది మామా..

Pushpa2 : నువ్వు ఎంత ఫైర్ అయిన.. పెళ్ళాం ముందు పిల్లే.. ఈ షార్ట్ అదిరిపోయింది మామా..

Pushpa2 : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒకటే మాట వినిపిస్తుంది.. పుష్ప 2..అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై జనాల్లో బజ్ ను క్రియేట్ చేసేందుకు సుకుమార్ టీమ్ వరుస అప్డేట్స్ ను వదులుతున్నారు. ప్రమోషన్స్ కోసం భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు పుష్ప 2 మేకర్స్.. పాట్నాలో భారీగా ఈవెంట్ ను నిర్వహించి ఈ ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ లోని ఒక్కో సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ట్రైలర్ మాత్రం అదిరిపోయిందని అంటున్నారు ఫ్యాన్స్. ఇక ట్రైలర్ చూస్తుంటే సినిమా ఇంకో రేంజ్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది..


ఈ ట్రైలర్ లోని ప్రతి సీన్ అదిరిపోయింది.. అందులో పవర్ ఫుల్ డైలాగుల తో మొదలైన కూడా చివరకు భార్య దగ్గర పుష్ప రాజ్ ఇలా ఉంటాడని చూపించిన షార్ట్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మాస్ షాట్స్ తో పాటు రష్మికతో క్యూట్ సీన్స్ లోని షాట్స్ కూడా ఉన్నాయి. అయితే ఓ షాట్ లో రష్మిక కాలు తో అల్లు అర్జున్ తన గడ్డం దగ్గర తగ్గేదేలే అంటూ పుష్ప మేనరిజం చేయడం చూపించారు. దీంతో ఇది వైరల్ గా మారింది. స్టార్ హీరో హీరోయిన్ కాలు పట్టుకోవడం ఒక ఎత్తైతే, ఇలా తన మేనరిజంను హీరోయిన్ కాలితో చేయడం మరో ఎత్తు అంటూ బన్నీని పొగుడుతున్నారు. ఇక భార్యా భాధితులు మాత్రం నువ్వు ఎంత ఫైర్ అయినా కూడా పెళ్ళాం ముందు పిల్లే అని సింబాలిక్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ షార్ట్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ ట్రైలర్ వీడియో తో భారీ అంచనాలు క్రియేట్ చేసుకుంది పుష్ప 2 మూవీ.. గతంలో వచ్చిన అప్డేట్స్ అన్ని ట్రైలర్ ముందు తక్కువే అని చెప్పాలి. నిన్న సాయంత్రం రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. దీంతో పుష్ప 2 పై ఒక్కసారిగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాగా, ఒక్కరోజు ముందుగానే ఓవర్సీస్ లో రిలీజ్ కాబోతుందన్న విషయం తెలిసిందే.. ఇక ఈ మూవీ లో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. శ్రీలీల స్పెషల్ సాంగ్‌ లో కనిపించబోతున్నది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వెయ్యి కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. ఇప్పటికే ఓవర్‌సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అనసూయ, సునీల్ కీలక పాత్ర ల్లో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 3 కూడా రాబోతుందని సమాచారం.. త్వరలోనే దీనిపై కీలక ప్రకటన రాబోతుంది..


Tags

Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×