BigTV English

Trinayani Serial Today September 14th: ‘త్రినయని’ సీరియల్‌: విశాల్ రూపంలో వచ్చిన గజగండ – గాయత్రి పాప దెబ్బకు గజగండ పరార్

Trinayani Serial Today September 14th: ‘త్రినయని’ సీరియల్‌: విశాల్ రూపంలో వచ్చిన గజగండ – గాయత్రి పాప దెబ్బకు గజగండ పరార్
trinayani serial today September 14th Episode:  అంతలా నొప్పి వచ్చే ఇంజక్షన్ నాకెందుకు వేయించాలనుకున్నావు అమ్మా అని విశాల్, తిలొత్తమ్మను ప్రశ్నిస్తాడు. దీంతో తనకేం తెలుసని తిలొత్తమ్మ చెప్తుంది. ఇంతలో చచ్చేంత నొప్పి అని అలా చెప్తుందిరా..? అని సైగ చేస్తుంది. ఇంతలో సిస్టర్ను తీసుకుని డాక్టర్ వెళ్లిపోతాడు. ఆ ఇంజక్షన్ ను విశాల్ కు వేసి ఉంటే బాగుండు అని మనసులో అనుకుంటుంది తిలొత్తమ్మ ఆ ఇంజక్షన్ ను సోఫాలో పెట్టిందెవరు? అని అనుమానిస్తారు.


తిలొత్తమ్మ అంతూ చూస్తానన్న నయని

తర్వాత తిలొత్తమ్మ గార్డెన్లో అటూ ఇటూ తిరుగుతుంటే.. వల్లభ వచ్చి మమ్మీ ఒంట్లో బాగాలేదా? డాక్టర్ దగ్గరకు వెళ్దామా? అని అడగుతాడు. ఏ డాక్టర్ దగ్గరు వెళ్దతామురా? అని తిలొత్తమ్మ ఎదురు అడగ్గానే నయని వచ్చి డాక్టర్ గజగండ అంటుంది. దీంతో వల్లభ ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అని డౌటుగా అడుగుతాడు. ఎందులో స్పెషలిస్ట్ తను అని వల్లభ అడగ్గానే నమ్మించి మోసం చేయడంలో అని నయని చెప్తుంది. వేషాలు వేయడంలో కక్ష్య సాధించడంలో మీలాంటి పేసెంట్ల సాయంతో రాటు దేలిపోయిన దుర్మార్గుడు వాడు అని నయని తిడుతుంటే మమ్మల్ని పేసెంట్లు అంటావేంటి అని తిలొత్తమ్మ తిడుతుంది. ఒకరు బాగుంటే ఓర్వలేని వాళ్లకు రోగం ఉన్నట్లే.. దానికి మందు లేదని చెప్పిన మూర్ఖులకు ఎలా చెప్పిన అర్థం కాదు అంటుంది నయని. దీంతో మమ్మీ ఎవర్ని అంటుంది పెద్ద మరదలు అని అడుగుతాడు.
కోపంగా నయని ఇంకా అమాయకుల్లా మాట్లాడకండి బావగారు. మర్యాదగా మట్లాడుతున్నప్పుడు అంతే మర్యాదగా మీరు చేసిన తప్పులను ఒప్పుకోవాలి అంటుంది నయని. దీంతో గాయత్రి అక్క గత జన్మను నేను నా చేతులతోనే ముగించేశానని చెప్పాను కదా? అంటుంది తిలొత్తమ్మ. దీంతో మీరు చెప్పడం ఏంటి నేనే తెలుసుకున్నాను. బాబు గారి ప్రాణాలు తీయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నావని కూడా చెప్పాను.. అంటుంది నయని. అయితే ఏంటటా అన తిలొత్తమ్మ అడగ్గానే.. డాక్టర్గ ఆ వచ్చింది గజగండ.. అంటున్నాను అని నయని చెప్పగానే నర్సుగా వచ్చింది ఎవరో చెప్పు చూద్దాం అని అమాయకంగా అడుగుతాడు. దీంతో నర్సుగా గజగండ వెంట వచ్చింది గంటలమ్మనే కదా? అని నయని చెప్పగానే వల్లభ, నయనిని మెచ్చుకుంటాడు. దీంతో తిలొత్తమ్మ, వల్లభను తిడతుంది. మీరు మంచిగా ఉంటే సరే లేకుంటే ఏ సమస్యనైనా సమూలంగా తొలగించడం నాకు అలవాటు అని చెప్పి నయని వెళ్లిపోతుంది.

విశాల్ రూపంలో వచ్చిన గజగండ

హాల్లో విక్రాంత్, హాసిని పైళ్లు చూస్తుంటారు. ఇంతలో తిలొత్తమ్మ, వల్లభ అక్కడికి వస్తారు. అమ్మా బ్రో చూడాల్సిన పైళ్స్ వీళ్లు చూసున్నారు అనగానే చూస్తారు కానీ సంతకం పెట్టలేరు కదరా.. అని వెటకారంగా మాట్లాడుతుంటే సంతకం చెల్లి పెడుతుందని ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో విశాల్ నోటితో చెప్పిన సరిపోతుంది అత్తయ్య అంటుంది హాసిని. ఇంతలో విశాల్ వచ్చి కోపంగా నేను అలా చెప్తాననని మీతో చెప్పానా వదిన అని అడుగుతాడు. నేను సంతకం చేయలేదని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? అని అడగ్గానే అందరూ షాక్ అవుతారు. దీంతో దురందర ఇంత చిన్న విషయానికి ఇంత కోప్పడతావేంటి విష్ అంటుంది. విక్రాంత్ సారీ చెప్తాడు. వల్లభ ఏదో తేడాగా కొడుతుందేంటి మామ్ అంటాడు. దీంతో విశాల్ కోప్పడితేనే మనుక మంచిది కదరా? అంటూ గుసగుసలాడుకుంటారు.
ఇంతలో విశాల్ ఇంకా ఎక్కువ సీరియస్ అవుతుంటాడు. ఇంతలో గాయత్రి పాప అక్కడికి వస్తుంది. గాయత్రిని విశాల్ సరిగ్గా చూడడు. పాప వెళ్లిపోతుంది. విశాల్ చెయ్యి పని చేయక మనసులో ఎంతో బాధపడుతున్నాడు. అందుకు తను ఇవాళ ఇలా మాట్లాడుతున్నాడు. నయని పంచకమణి మన చేతికి వచ్చే లోపు ఈ బాధలు తప్పవు అంటుంది. దీంతో ఇంకెప్పుడు వస్తుందని విశాల్ ఎదురు ప్రశ్నిస్తాడు. అందరి మధ్య గొడవ పెద్దదవుతుంది. ఫైళ్స్ చూడకుండానే త్వరగా సంతకం పెట్టమని నయనికి చెప్తాడు విశాల్. దీంతో డౌటు గానే నయన ఫైల్స్ తీసుకుంటుంది నయని.

 విశాల్ ను చూసి మాయం అయిన గజగండ

మరోవైపు బెడ్ రూంలో పడుకున్న విశాల్ ను నిద్ర లేపుతుంది గాయత్రి పాప. దీంతో బయట ఉన్నది ఎవరో విశాల్ వేషం వేసుకుని వచ్చి మోసం చేస్తున్నాడని అర్థం అవుతుంది. బయట హాల్లో  నయని సంతకం పెట్టడానికి ఆలోచిస్తుంటే విశాల్ రూపంలో ఉన్న వ్యక్తి నయనిని తొందరపెడతాడు. దీంతో నయని సంతకం పెట్టబోతుంటే అప్పుడే బెడ్ రూంలోంచి బయటకు వచ్చిన విశాల్ ఆగు నయని అని గట్టిగా కేక వేయగానే విశాల్ ను చూసిన అందరూ షాక్ అవుతారు. నయని ఫైల్స్ కింద పడేస్తుంది. ఇంతలో విశాల్ రూపంలో ఉన్న వ్యక్తి మాయం అయిపోతాడు. మరోసారి అందరూ షాక్ అవుతారు. వచ్చింది విశాల్ కాదు గజగండ అనుకుంటా అని హాసిని అనడంతో అందరూ భయంగా చూస్తుంటారు. విశాల్ దగ్గరకు వచ్చి కంపెనీ ఫైల్స్ మీద నీ  చేత సంతకాలు చేయించి మన కంపెనీ కొలాప్స్ కావాలని ప్లాన్ చేశారు అంటుంది. గాయత్రి పాపే గాఢ నిద్రలో ఉన్న నన్ను నిద్రలేపి ఇక్కడికి తీసుకొచ్చింది కాబట్టి సరిపోయింది అంటాడు విశాల్. ఎప్పుడు ఎవరి రూపంలో వస్తాడో తెలియడం లేదు. జాగ్రత్తగా ఉండకపోతే కష్టమే అని తిలొత్తమ బెదిరించడంతో నేటి త్రినయని సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.

Related News

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Big Stories

×