Udaya Bhanu: బుల్లితెరపై ఒకప్పుడు మకుటం లేని మహారాణిలా.. గ్లామర్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఉదయభాను (Udayabhanu) యాంకర్ గా ఉన్నత శిఖరాలను చూసి అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమై.. మళ్ళీ ఇప్పుడు నిర్మాతగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో విషయాలను చెప్పుకుంటున్న ఈమె.. తన వ్యక్తిగత జీవితంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, ముఖ్యంగా పెళ్లి, కుటుంబ విభేదాలు అలాగే సంపాదన కుటుంబాన్ని ఎడబాపుతుంది అంటూ ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది..
మీ వ్యక్తిగత జీవితం టీవీ ఛానల్స్ వరకు రావడం వెనుక అసలు కారణం ఏమిటి ? అని హోస్ట్ ప్రశ్నించగా.. ఉదయభాను.. వ్యక్తిగత జీవితంలోకి అడుగుపెట్టిన ప్రతి అమ్మాయి జీవితంలో కూడా ఒక కఠినమైన దశ ఉంటుంది. నేను పెళ్లి చేసుకున్నప్పుడు కేవలం నా వయసు 23 ఏళ్లు మాత్రమే . ఆ సమయంలో మా ఇంట్లో సంపాదించే వ్యక్తిని నేను మాత్రమే. దాంతో కుటుంబంలో నాపై ఆధారపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది . నా సంపాదన చూసి ఇంట్లో కొంతమంది పనులు చేయడం కూడా మానేశారు. కుటుంబంలో అందరూ నాపైనే, నా సంపాదన పైనే ఆధారపడడంతో మా అమ్మ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంది. అందర్నీ చూసుకోవాలి.. అందరిని సంతృప్తి పరచాలనే తాపత్రయంలో నా వల్ల మా అమ్మ పై విపరీతమైన భారం పడింది. ఏ తల్లి అయినా తన కూతురు బాగుండాలని కోరుకుంటుంది కదా.. మా అమ్మ కూడా అదే ఆలోచించింది. కానీ విపరీతమైన ఆర్థిక డిపెండెన్సీ , బాధ్యతల నడుమ కుటుంబంలో తీవ్రమైన మనస్పర్ధలు, చిన్నపాటి డిస్టర్బెన్స్ వచ్చాయి.
ఇక అవే పెద్దదయ్యి ఆరోజు టీవీ చానల్స్ వరకు వెళ్లాయి. ” అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేసింది ఉదయభాను. ఈమె మాటలు విన్న నెటిజన్స్సం.. పాదన కుటుంబాన్ని ఎడబాపుతుందేమో అని.. అయితే ఒకరు సంపాదిస్తున్నారని కుటుంబంలో అందరూ ఆ వ్యక్తి పైనే ఆధారపడడం కరెక్ట్ కాదు.. రెండు చేతులు కలిపితేనే చప్పట్లు.. నాలుగు చేతుల సంపాదన కలిపితేనే కుటుంబం ఉన్నతంగా జీవిస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఆ తర్వాత అన్ని వాటంతటవే సమిసిపోయాయి. ప్రస్తుతం తామంతా సంతోషంగా ఉన్నామని చెప్పుకొచ్చింది ఉదయభాను. మొత్తానికైతే బుల్లితెరపై నవ్వులు పూయిస్తూ.. కోట్లాదిమంది అభిమానులను అలరించిన ఉదయభాను వెనుక , ఆమె సంపాదన పైన ఆధారపడ్డ కుటుంబం వల్ల ఎంతటి ఇబ్బందులు ఎదుర్కొందో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. మొత్తానికి అయితే ఉదయభాను చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
also read: నిమజ్జనాలతో నీరంతా కలుషితం.. గ్లాసు నీళ్లతో అన్వేష్ ప్రయోగం, చివరికి..
ఉదయభాను 2004లో మిద్దె విజయేంద్ర మౌళిను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కవల కుమార్తెలు జన్మించారు. వివాహం తర్వాత హైదరాబాద్లోనే జీవిస్తున్నారు అప్పుడప్పుడు సినీ పరిశ్రమకు చెందిన కార్యక్రమాలు, ఫంక్షన్లలో బహిరంగంగా కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటారు.