E-Paper
Advertisement

నిమజ్జనాలతో నీరంతా కలుషితం.. గ్లాసు నీళ్లతో అన్వేష్ ప్రయోగం, చివరికి..

నిమజ్జనాలతో నీరంతా కలుషితం.. గ్లాసు నీళ్లతో అన్వేష్ ప్రయోగం, చివరికి..
Advertisement

Naa Anvesh:నా అన్వేషణ, ప్రపంచ యాత్రికుడు వంటి యూట్యూబ్ ఛానల్స్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకుని, బెట్టింగ్ యాప్స్ విషయంలో కొంతమంది యూట్యూబర్స్ పై తనదైన శైలిలో మండిపడుతూ పలు వీడియోలు చేస్తూ తెగ వార్తల్లో నిలిచిన అన్వేష్.. అటు హిందూ మతాలపై, హిందూ దేవుళ్ళపై చేసిన కామెంట్లకు ఇండియా నుండి లుక్ అవుట్ నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. ఇక అలాంటి అన్వేష్ విదేశాలలోనే ఉంటూ.. మొన్నటి వరకు బిగ్ బాస్, అగ్ని పరీక్ష అంటూ రియాలిటీ షో లలో జరుగుతున్న విషయాలపై కామెంట్లు చేసిన అన్వేష్.. ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా రంగులతో నింపిన వినాయకులను నీటిలో నిమజ్జనం చేస్తే వచ్చే సమస్యలపై స్పందిస్తూ ఒక ప్రయోగాత్మక వీడియో విడుదల చేశారు.

వినాయక నిమజ్జనం పై అవేర్నెస్ కలిగించిన అన్వేష్..

ముఖ్యంగా వినాయకుని తయారు చేయడానికి ఉపయోగించే రంగుల గురించి.. ఈ రంగులతో తయారుచేసిన వినాయక ప్రతిమలను హుస్సేన్ సాగర్ లో కలపడం వల్ల ఆ నీరు ఎంత కలుషితమవుతోంది ఆ నీటి వల్ల ప్రజలకు ఎలాంటి సమస్యలు వస్తాయి అనే విషయాలపై స్పందించారు ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో నీటిని పోసి ఆ నీటిలోకి చిన్న వినాయకుడిని వేశారు. అందులోకి ఎరుపు రంగులో పాదరసం ఉంటుంది. ఇది మన నరాలను తీసేస్తుంది. ఎల్లో రంగులు క్యాడమియం ఉంటుంది. ఇది చాలా ప్రమాదం. పాదరసం కంటే కూడా తెలుపు రంగులో సీసం ఉంటుంది . ఇది కూడా చాలా ప్రమాదం. ఆకుపచ్చ రంగులో క్రోమియం ఉంటుంది. ఇది నరాలను తినేస్తుంది. నీలం రంగులో జింక్ ఉంటుంది.. పర్పుల్ కలర్ లో ప్రాణాంతకమైన కాపర్ రంగు ఉంటుంది .

ఈ రంగుల వల్ల వ్యాధులే వస్తాయి..

Advertisement

ఈ రంగులన్నిటినీ కలిపిన వినాయకుడిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడం వల్ల అవన్నీ ఆ నీటిలో కలిసిపోతాయి. అలాగే వినాయకుడి విగ్రహాల తయారీలో ఇనుప పౌడర్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటివి కూడా వేస్తాము.. ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఇన్ని రకాల కెమికల్స్ తో నిండిపోయింది. ఇంత కలుషితమైన హుస్సేన్ సాగర్ నీటిని మనం తాగగలమా? హుస్సేన్ సాగర్ కట్టింది భూగర్భ జలాల కోసం కట్టారు. చుట్టుపక్కల ప్రాంతాలకు నీళ్లు కావాలి కాబట్టి వాటిని నిర్మించారు. ఇప్పుడు అలాంటి వాటిలో ఇంత విషంతో కూడిన ప్రతిమలను వేస్తున్నారు. ప్రతి ఏడాది ఎన్నో వినాయక విగ్రహాలు కలిపి.. 6 వేల టన్నుల ఇనుముని వేస్తున్నారు. అంతేకాకుండా రెండు లక్షల లీటర్ల కెమికల్స్ ని కూడా అందులో వేస్తున్నారని నా అన్వేష్ తెలిపారు.

పిల్లల భవిష్యత్తు ముఖ్యం..

మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. ఈ మురికి నీరు శుభ్రం అవ్వాలి అంటే ఈ టాబ్లెట్ వేయాలి.. ఇలాంటివి అన్నీ కూడా గవర్నమెంట్ క్లీన్ చేస్తుందా. పండుగ అంటే పర్యావరణాన్ని కాపాడేలా ఉండాలి.. కానీ పర్యావరణాన్ని నాశనం చేసేలా ఉండకూడదు అంటూ చెప్పుకొచ్చారు. హైదరాబాదులో ఎంతోమందికి క్యాన్సర్లు వస్తున్నాయి అందుకు కారణం కూడా ఇవే అంటూ చెప్పుకొచ్చారు. ఈ పిఓపి వీడియోని పిల్లలకి పర్టికులర్గా చూపించండి అంటూ నా అన్వేష్ తెలిపారు.

Advertisement

also read: రోజాని అలా చూసి చాలా హర్ట్ అయ్యా.. ఆమని కామెంట్స్ వైరల్!

ప్రాక్టికల్ గా చేసి చూపించాలి..

ఈ కెమికల్స్ అన్నీ కూడా భూమి లోపల ఉండే కణాలను తుప్పు పట్టి పోయేలా చేస్తాయి.. ఇందులో వేసే సిమెంటు నీళ్లు రాకుండా అడ్డుపడుతాయని తెలిపారు. నీటి ఊట అనేది ఉండకుండా చేస్తాయంటూ తెలిపారు. అందుకే చెరువులలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటివి వేయకూడదు అంటూ తెలిపారు. ఉపాధ్యాయులు కూడా ఇలా ప్రాక్టికల్ గా చేసి చూపిస్తే పిల్లలు వింటారు.. మట్టి బొమ్మ వినాయకుడే మంచిదని అందరికీ చెప్పాలి అంటూ నా అన్వేషణ అన్వేష్ తెలిపారు.

Related News

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

Big Stories

Advertisement
×