Udayabhanu: ఉదయభాను టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు టెలివిసన్ రంగంలో యాంకర్ గా తన అద్భుతమైన మాట తీరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె ఒకానొక సమయంలో వరుస కార్యక్రమాల ద్వారా బిజీగా గడిపారు. ఇకపోతే ఇండస్ట్రీకి కొత్త వాళ్ళు వస్తున్న తరుణంలో పాత వారికి అవకాశాలు కనమరగవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఉదయభాను కూడా క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇలా అవకాశాలు లేకపోవడంతో ఉదయభాను కొంత గ్యాప్ తర్వాత నిర్మాతగా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు.
ఈమె ఉదయభాను ప్రొడక్షన్ హౌస్ పేరిట పంచనామా అనే ఒక వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ జీ 5 లో ప్రసారమవుతోంది .ఈ సిరీస్ మంచి టాక్ సొంతం చేసుకోవడంతో ప్రమోషన్లలో భాగంగా ఉదయభాను వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెను ఉద్దేశించి యాంకర్ ప్రశ్నిస్తూ మీరు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. సినిమాలకు డబ్బింగ్ చెప్పొచ్చు కదా అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు ఉదయభాను సమాధానం చెబుతూ తాను హీరోయిన్ ఛార్మి కౌర్ కు డబ్బింగ్ చెప్పాననే విషయాన్ని ఈమె ఈ సందర్భంగా తెలియజేశారు.
నితిన్ చార్మి హీరో హీరోయిన్లుగా నటించిన శ్రీ ఆంజనేయం సినిమాలో తాను చార్మి పాత్రకు డబ్బింగ్ చెప్పానని తెలియజేశారు అయితే ఈ సినిమా తర్వాత తనుకు తదుపరి చాలా సినిమాలలో అవకాశాలు వచ్చాయి కానీ ఒక సినిమాకు డబ్బింగ్ చెప్పాలి అంటే నాలుగు ఐదు రోజుల సమయం పడుతుంది అందుకే తాను తదుపరి అవకాశాలను రిజెక్ట్ చేసానని ఉదయభాను ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా ఛార్మికి డబ్బింగ్ చెప్పాననే విషయం తెలియచేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఉదయభాను కేవలం యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా పలు సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.
ఈ విధంగా యాంకర్ గా నటిగా డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో పని చేసిన ఉదయభాను ఇప్పుడు నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిర్మాతగా తన మొదటి ప్రయత్నంలోనే ఈమె ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఈ వెబ్ సిరీస్ మంచి సక్సెస్ కావడంతో ఈమె తదుపరి మరిన్ని సరికొత్త ప్రాజెక్టుల ద్వారా నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఉదయభాను తన వ్యక్తిగత విషయాలతో పాటు ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో తనకు అవకాశాలు లేకుండా పోవడం గురించి కూడా తెలియజేశారు. ఇండస్ట్రీలో జరిగే రాజకీయాల కారణంగానే తనకు అవకాశాలు లేకుండా చేశారని కానీ దేవుడు ఇచ్చిన సొంత టాలెంట్ తో తాను ఈ స్థాయిలో ఉన్నానని ఈమె తెలిపారు.
Also Read: కొత్తింట్లోకి అడుగుపెట్టిన అమర్ దీప్… తేజు ఎక్కడ అంటున్న ఫ్యాన్స్!