E-Paper
Advertisement

కొత్తింట్లోకి అడుగుపెట్టిన అమర్ దీప్… తేజు ఎక్కడ అంటున్న ఫ్యాన్స్!

కొత్తింట్లోకి అడుగుపెట్టిన అమర్ దీప్… తేజు ఎక్కడ అంటున్న ఫ్యాన్స్!
Advertisement

Amardeep Chowdary: అమర్ దీప్ చౌదరి పరిచయం అవసరం లేని పేరు. జానకి కలగనలేదు అని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన అమర్ అనంతరం పలుబులు తెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు. అలాగే బిగ్ బాస్ సీజన్ సెవెన్ (Bigg Boss 7)కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న అమర్ రన్నర్ గా బయటకు వచ్చారు. ఇలా బిగ్ బాస్ తర్వాత అమర్ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో, కుకింగ్ షో లలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న అమర్ దీప్..

ఇక అమర్ తన భార్య తేజు ఇద్దరు కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అమర్ తన సొంత ఇంటి కలలను నెరవేర్చుకున్నారని తెలుస్తుంది. ఈయన ఇటీవల కొత్త ఇంటిని కొనుగోలు చేశారని ఈ నేపథ్యంలోనే గృహప్రవేశ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారని తెలుస్తుంది. ఈ గృహప్రవేశ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నటుడు మానస్ తల్లి పద్మిని హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా టేస్టీ తేజ ,శోభా శెట్టి,అరియానా వంటి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

భార్య లేకుండా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన అమర్..

Advertisement

ఇలా బుల్లితెర సెలబ్రిటీలు అందరూ కూడా ఈ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ ఈ వేడుకలలో అమర్ దీప్(Amardeep) భార్య తేజస్విని గౌడ (Tejaswini Gouda) కనిపించకపోవడం గమనార్హం. అమర్ దీప్ ఒంటరిగానే హోమం, పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ వేడుకలలో అమర్ తల్లి పాల్గొన్నారు కానీ తన భార్య తేజు లేకపోవడంతో అసలు కొత్త ఇంటి గృహప్రవేశం జరుగుతూ ఉంటే తేజు కనిపించకపోవడం ఏంటి? తేజు ఎక్కడ? అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి తేజు ఈ గృహప్రవేశ కార్యక్రమానికి దూరంగా ఉండడానికి గల కారణాలు ఏంటి అనేది తెలియదు కానీ ఈమె లేకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

?stkn=MXFha2FydnAxcTVx

Advertisement

ఇక అమర్ కొనుగోలు చేసిన ఇంటిని చూస్తుంటే ఇంకా ఈ ఇంట్లో ఇంటీరియర్ వంటి పనులన్నీ అలాగే ఉన్నాయని కేవలం సాంప్రదాయం ప్రకారం ప్రస్తుతం ఈ గృహప్రవేశ కార్యక్రమాన్ని జరిపించారని తెలుస్తోంది. ఇక తేజు తన బిజీ షెడ్యూల్ కారణంగా ఈ వేడుకకు దూరంగా ఉన్నారా ? లేకుంటే మరి ఏదైనా వ్యక్తిగత సమస్యలు ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. ఇక తేజు ప్రస్తుతం తమిళ కన్నడ సీరియల్స్ తో పాటు పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

Also Read: ఒక్క పాటకు లక్ష జడలు సేల్.. ‘ఆయా షేర్’ రేంజ్ వేరే లెవెల్

Related News

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

Big Stories

Advertisement
×