Sonu Sood -iphone 18: ఆపిల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘ఐఫోన్ 18 ప్రో’ (iPhone 18 Pro) సిరీస్ సేల్స్ ఇండియాలో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఈ కొత్త వెర్షన్ మొబైల్ ఫోన్ కైవసం చేసుకోవడం కోసం ఐఫోన్ లవర్స్ ఇన్ని రోజులపాటు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఇలా ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ కావడంతో పెద్ద ఎత్తున ఢిల్లీ, ముంబై వంటి మహా నగరాలలో ఈ ఫోన్ కైవసం చేసుకోవడం కోసం ఆపిల్ స్టోర్ ముందు గంటల తరబడి క్యూ లైన్ లలో నిలబడి ఐఫోన్ 18 ప్రో కైవసం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ విధంగా యాపిల్ కంపెనీ లాంచ్ చేసిన ఐఫోన్ 18 ప్రో (iphone 18 pro)కోసం ఇలా పడిగాపులు కాస్తూ రోడ్లపై బారులు తీరడంతో ఈ విషయంపై రియల్ హీరో సోనుసూద్(sonu Sood) స్పందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఐఫోన్ లవర్స్ కు గట్టిగా క్లాస్ పీకారు. ఈ విషయంపై సోనూసూద్ స్పందిస్తూ..”కొత్త ఫోన్.. కొత్త ఈఎంఐలు.. కానీ బిల్లులు మాత్రం పాతవే. కేవలం ఫోన్లు అప్‌గ్రేడ్ చేసుకోవడానికే కాకుండా, మన సమాజంలో మార్పు తీసుకురావడం కోసం కూడా ఇలాగే ప్రతి ఒక్కరూ క్యూ లైన్ లలో నిలబడితే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి. నిజమైన అప్డేట్ అంటే మొబైల్ ఫోన్ మార్చుకోవడం కాదని, సమాజాన్ని మెరుగుపరుచుకోవడమే “అంటూ సోను సూద్ పోస్ట్ చేశారు.
ఇలా ఐఫోన్ కోసం రోడ్డుపై బార్లు తీరిన వారిని ఉద్దేశించి సోను సూద్ ఈ విధమైనటువంటి పోస్ట్ చేయడంతో ఈయన చెప్పింది అక్షర సత్యం అంటూ కొంతమంది సోను సూద్ పోస్టు పట్ల పాజిటివ్ గా స్పందిస్తూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఐఫోన్ లవర్స్ మాత్రం సోను సూద్ చేస్తున్న ఈ వ్యాఖ్యలపై విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. పేదలకు సహాయం చేయడానికి లేని ఉత్సాహం ఫోన్ కొనడానికి ఎందుకు అంటూ కొంతమంది కామెంట్లు చేయగా ఒక ఫోన్ కోసం మూడు లక్షలు పెట్టి కొనడం కరెక్ట్ కాదని సోను సూద్ కు మద్దతు తెలుపుతున్నారు.
New phone, new EMI… same old bills! 😂 Maybe it’s time we queue up to make a difference, not just upgrade our phones. The real upgrade is a better society. ❤️ pic.twitter.com/WBVDzGrbaV
— sonu sood (@SonuSood) September 18, 2026
ఇక సోనూ సూద్ సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను భయపెట్టినప్పటికీ నిజజీవితంలో మాత్రం ఈయన హీరో అని చెప్పాలి. దేశవ్యాప్తంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానని ఒక భరోసా కల్పిస్తూ అందరి హృదయాలలో హీరోగా చోటు సంపాదించుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతోమందినీ సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చడమే కాకుండా పెద్ద ఎత్తున ఆక్సిజన్ సిలిండర్లను సప్లై చేస్తూ ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికి కూడా ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే సహాయం చేయడంలో సోను ముందు వరుసలో ఉంటారని చెప్పాలి.
Also Read: అల్లు అర్జున్ కు సంబంధం లేదు.. భూ వివాదంపై మామ చంద్రశేఖర్ రెడ్డి క్లారిటీ!