E-Paper
Advertisement

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు దూరమవ్వడంపై నూకరాజు క్లారిటీ!

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు దూరమవ్వడంపై నూకరాజు క్లారిటీ!
Advertisement

Kissik Talks on Nookaraju: సెలబ్రిటీ టాక్ షోలు ఈ మధ్యకాలంలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అలాంటి వాటిలో ప్రముఖ న్యూస్ ఛానల్ బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks) షో కూడా ఒకటి. ఇప్పటికే 68 ఎపిసోడ్లు పూర్తవగా.. 69వ ఎపిసోడ్ కి కమెడియన్ నూకరాజు (Nookaraju) గెస్ట్ గా వచ్చారు. ఇందులో ఎన్నో విషయాలను పంచుకున్న ఆయన.. తనకు మంచి గుర్తింపును అందించిన జబర్దస్త్(Jabardasth ), శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi drama company) వంటి షోలకు పూర్తిగా దూరం కావడంపై తాజాగా క్లారిటీ ఇచ్చారు.

షో కోసం ప్రాణం పెట్టాను – నూకరాజు

వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన నూకరాజు మాట్లాడుతూ..” శ్రీదేవి డ్రామా కంపెనీ నాతో, ఇమ్మానుయేల్ (Emmanuel) తోనే మొదలయ్యింది. ముఖ్యంగా ఈ షో కోసం ప్రాణం పెట్టే వాళ్ళం. ఏ రోజు కూడా నెగ్లెక్ట్ చేయలేదు. పైగా ఈ షోలో చేసిన ప్రతి పర్ఫామెన్స్ కి కూడా మాకు మంచి గుర్తింపు లభించింది. అప్పుడే ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన మాతో శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రారంభించడంతో మేము చాలా సంతోషం వ్యక్తం చేసాము. అర్ధరాత్రి కూడా షో కోసం కష్టపడ్డాము. అలాంటి సమయంలో సడన్గా మాకు నాలుగు ఎపిసోడ్లు వచ్చే చోట రెండు ఎపిసోడ్లు రావడం.. ఇక రాను రాను పిలవడం తగ్గించారు. అంతా బాగానే ఉన్నా “రెగ్యులర్ అవుతున్నారు” అనే మాటను తీసుకోలేకపోయాము. షో కోసం ప్రాణం పెట్టాము కానీ ఇలాంటి మాటలు మమ్మల్ని మానసికంగా భాదించాయి ” అంటూ నూకరాజు తెలిపారు.

శ్రీదేవి డ్రామా కంపెనీ , జబర్దస్త్ కి అందుకే దూరం – నూకరాజు

Advertisement

“ఒకప్పుడు మీకు కెరియర్ ను ఇచ్చిన జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలను వదిలేసి దూరంగా వెళ్లిపోవడానికి గల కారణం ఏమిటి?” అని హోస్ట్ వర్ష ప్రశ్నించగా.. “జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలను వదిలేసి వెళ్లిపోవడానికి సరైన కారణం అంటూ ఏమీ లేదు. కాకపోతే చిన్న చేంజ్ మాత్రమే” అంటూ చెప్పి అసలు విషయం బయట పెట్టాడు నూకరాజు.

also read:ఆసియా రూ.5 కోట్ల కట్నంపై క్లారిటీ ఇచ్చిన నూకరాజు!

నూకరాజు చేస్తున్న ప్రస్తుత షోలు..

Advertisement

నూకరాజు ఇటీవలే తన ప్రియురాలు ఆసియా ఏంజెల్ (Asiya Angel) తో కలిసి ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అనే షోలో సందడి చేశారు. మరొకవైపు ‘కుకు విత్ జాతి రత్నాలు’ షోతో పాటు శ్రీముఖి, అవినాష్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోలో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం వివిధ షోలలో పాల్గొంటూ అక్కడ కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ కనబరుస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు నూకరాజు.

Related News

రూ.100 కోట్లు ఉంటేనే ఎమ్మెల్యే.. నిజాలు బయటపెట్టిన ఉదయభాను!

ఈ వారం ఆ సీరియల్ అవుట్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

ఉదయభాను అలా.. ఝాన్సీ ఇలా.. ఎవరు నిజం?

Illu illaalu Pillalu Dheeraj : సీరియల్ లవర్స్ కు షాక్.. ధీరజ్ గుడ్ బై..

మీనా నెలకు అంత సంపాదిస్తుందా..? హీరోయిన్ల కంటే ఎక్కువే సుమీ..!

Podarillu Today Episode : మాధవ్, మనీష పెళ్లి ఫిక్స్.. శైలుకు వార్నింగ్.. మాధవ్ పై అనుమానం..

Ninnu kori Serial Today Episode September 18th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి ఇంట్లోకి కేర్ టేకర్లుగా వెళ్లిన చంద్ర, మదన్   

Illu Illalu Pillalu Today Episodes: భద్ర ప్లాన్ సక్సెస్.. వల్లి ఫుల్ హ్యాపీ.. పోలీస్ స్టేషన్ లో రచ్చ రచ్చ..

Big Stories

Advertisement
×