Winter AC discounts and offers 2026: సమ్మర్ వచ్చిందంటే చాలు ఎండలకు ఉక్కిరిబిక్కిరి అయిపోయి, హడావుడిగా ఏసీలు కొనేయాలని పరుగులు పెడుతుంటాం. కానీ డిమాండ్ పీక్స్‌లో ఉన్న ఆ టైమ్‌లో రేట్లు చూస్తే చుక్కలు కనిపిస్తాయి! అందుకే..తెలివైన షాపర్స్ ఎప్పుడూ ఫాలో అయ్యే సీక్రెట్ ట్రిక్ ఏంటంటే.. వింటర్ సీజన్‌లో ఏసీని ఇంటికి తెచ్చుకోవడం. చలికాలంలో ఏసీలు కొంటే కేవలం డబ్బులు సేవ్ కావడమే కాదు, ఇంకా బోలెడన్ని లాభాలున్నాయి. సమ్మర్ హడావుడికి దూరంగా, కూల్‌గా ఉంటూ వేల రూపాయలు ఎలా ఆదా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం!
చలికాలంలో ఏసీల కొనే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. దీంతో షాపులు, ఆన్ లైన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు తమ స్టాక్‌ను క్లియర్ చేసుకోవడానికి భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటిస్తాయి. ఎండా కాలంలో రూ. 40,000 ఉండే ఏసీ వింటర్‌లో సుమారు రూ.5,000 నుంచి రూ.10,000 వరకు తక్కువ ధరకు లభిస్తుంది. దీని వల్ల వేల రూపాయల డబ్బు మిగులుతుంది.
సమ్మర్ సీజన్‌లో ఏసీ టెక్నీషియన్లకు విపరీతమైన పని భారం ఉంటుంది. బుకింగ్ చేసినా .. రెండు, మూడు రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. అంతే కాకుండా ఇన్ స్టాలేషన్ ఛార్జీలు కూడా ఎక్కువగా ఉంటాయి. అదే చలికాలంలో అయితే టెక్నీషియన్లు ఫ్రీగానే ఉంటారు కాబట్టి.. మనం ఎప్పుడంటే అప్పుడే వచ్చి ఉచితంగా లేదా చాలా తక్కువ ధరకు ఏసీని పర్ఫెక్ట్‌గా ఫిట్ చేసి ఇస్తారు.
ఎండా కాలంలో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల మనకు నచ్చిన బ్రాండ్ లేదా లేటెస్ట్ ఫీచర్లు.. ఉన్న మోడల్ స్టాక్‌లో దొరకడం కష్టమవుతుంది. కానీ.. వింటర్‌లో మార్కెట్ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మీకు కావాల్సిన ఎనర్జీ-ఎఫిషియంట్, లేటెస్ట్ ఇన్వెర్టర్ ఏసీలను ఎంచుకోవడానికి ఫుల్ ఆప్షన్స్ ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు లేకుండా ప్రశాంతంగా బెస్ట్ ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
Also Read: కోడింగ్ నుంచి ఇల్లు వెతకడం వరకు..ఏఐ చేసే ఈ మ్యాజిక్ చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే!
సమ్మర్ టైమ్‌లో షోరూమ్‌లకు వెళితే.. కస్టమర్ల రద్దీతో సేల్స్‌మెన్ సరిగ్గా పట్టించుకోరు. కానీ వింటర్‌లో షాపులు బోసిపోయి ఉంటాయి. ఏసీలోని ఫీచర్లు, కరెంట్ బిల్లు ఎంత పడుతుంది, వారంటీ వివరాలను నెమ్మదిగా, కూల్‌గా చెక్ చేసి కొనొచ్చు. ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా షాపింగ్ చేయడానికి ఇదే సరైన టైం.
ఏకకాలంలో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టడం కంటే.. వింటర్ సీజన్‌లో ప్లాన్ చేసుకుంటే.. మన బడ్జెట్ పై ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఈజీ ఈఎంఐ ఆప్షన్స్ లేదా క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్లు సద్వినియోగం చేసుకొని ఎలాంటి టెన్షన్ లేకుండా ఏసీని ఇంటికి తెచ్చుకోవచ్చు.
కాలం ఏదైనా ఏసీ అవసరం సమ్మర్‌లోనే వస్తుంది కదా అని ముందుగానే ప్లాన్ చేసుకోకపోతే.. అనవసరంగా వేల రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది.కాబట్టి..చలికాలంలో ఏసీ కొనే ఈ స్మార్ట్ ట్రిక్‌ను ఫాలో అయి మీ కష్టపడి సంపాదించిన డబ్బును సేవ్ చేసుకోండి!