E-Paper
Advertisement

ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?

ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?
Advertisement

Dhee 10 Raju: ప్రముఖ డాన్స్ షో ఢీ 10 విజేతగా నిలిచిన రాజు (Dhee 10 Raju) ఉన్నట్టుండి లైంగిక వేధింపులు, నగదు మోసం ఆరోపణలతో అరెస్టు కావడంతో మియాపూర్ పోలీసులు రిమాండ్ కి తరలించారు. వాస్తవానికి రాజు సెప్టెంబర్ 9వ తేదీన అరెస్టు అయినప్పటికీ.. సెప్టెంబర్ 12వ తేదీన ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మియాపూర్ పోలీసులు ఈ విషయాన్ని ఎందుకు ఇంత గోప్యంగా ఉంచారు అనే విషయం కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనికి తోడు బాధిత యువతి నుంచి మియాపూర్ పోలీసులు ఆదివారం స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మరో విషయం చర్చకు వచ్చింది. రాజు నేరస్థుడని నిరూపణ అయితే అతడికి ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుంది అనే ప్రశ్న మొదలైంది? మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష?

ప్రముఖ ఢీ 10 టైటిల్ విన్నర్ రాజు మాస్టర్ ఒక అమ్మాయిని పెళ్లి పేరుతో వాడుకొని మోసం చేశాడు అనే నేపథ్యంలో సెక్షన్ 69, సెక్షన్ 420 (ప్రస్తుత కొత్త చట్టం బి ఎం ఎస్ సెక్షన్ 318(4) ) కింద అరెస్టు చేశారు. ఇకపోతే ఈ నేపథ్యంలోనే రాజు చేసిన నేరం నిజమని నిరూపితమైతే ఆయనకు ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుంది అనే కామెంట్లు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి. రాజు పై పెట్టిన సెక్షన్ల విషయానికి వస్తే.. సెక్షన్ 69.. పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తే ఈ సెక్షన్ కింద కేసు ఫైల్ చేస్తారు ఇందులో నేర నిరూపణ అయితే 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష అలాగే జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. ఇక సెక్షన్ 420 విషయానికి వస్తే.. డబ్బులు లేదా ఆస్తి లేదా విలువైన పత్రాలను లాక్కున్నట్లు నిరూపితం అయితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ప్రస్తుతం ఈ రెండు కేసుల కింద రాజుపై కేసు ఫైల్ చేశారు. అటు ప్రస్తుతం రాజు రిమాండ్ లో ఉన్నారు.

అసలేం జరిగిందంటే..?

Advertisement

సదరు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంటులో ఏముంది అనే విషయానికొస్తే.. హైదరాబాదులో ఇతడికి ఒక డాన్స్ స్టూడియో ఉందట. తరచూ అక్కడికి వెళ్తుండేవాడట . అదే బిల్డింగ్ లో బాధిత అమ్మాయి బొటిక్ రన్ చేసేదట . ఆమెతో పరిచయం కూడా అయిందట. ఇద్దరు మెసేజ్లు కూడా చేసుకునే వారని సమాచారం. అయితే ఒక రోజు మిడ్ నైట్ రెస్టు తీసుకోవాలని అక్కడికి వెళ్తే అనుకోకుండా ఫిజికల్ గా ఒకటైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకుంటానని రాజు తనను మోసం చేశాడని ఆమె చెప్పుకొచ్చింది. ప్రేమ, పెళ్లి పేరుతో తనకు దగ్గరైన రాజు.. తన దగ్గర సుమారుగా రూ.12 లక్షల వరకు నగదు తీసుకున్నాడని , పెళ్లి చేసుకోమని అడిగితే ఇప్పుడు తన దగ్గర డబ్బులు లేవని చెప్పినట్లు బాధిత యువతి తెలిపింది.

ALSO READ:తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

మరో సీరియల్ నటితో ఎఫైర్..

Advertisement

అంతేకాదు మరో సీరియల్ నటితో తిరుగుతున్నట్లు ఆరోపణలు కూడా చేసింది. ఇక రాజు పై కేసు పెట్టిన బాధితురాలిన సదరు సీరియల్ నటి బెదిరింపులకు దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు రాజు పై తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. జానీ మాస్టర్, సుమలత , శేఖర్ మాస్టర్ తనకు న్యాయం చేయాలని కోరింది.

Related News

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

బిగ్ బాస్ 10 2వ వారం నామినేషన్స్ రచ్చ.. అందరి టార్గెట్ అతడే!

త్రిగుణ్ పద్ధతి మార్చుకోవాలి.. కామనర్స్ కు మద్దతుగా మాజీ కంటెస్టెంట్!

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ 10!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆమె ఎంట్రీ ఖాయం..

Ninnu Kori Chandra : సీరియల్ లవర్స్ కు షాక్.. చంద్ర అవుట్..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో షాక్.. అడ్డంగా దొరికిపోయిన బాలు.. అరుణ్ తో మళ్లీ గొడవ..

Big Stories

Advertisement
×