E-Paper
Advertisement

నన్ను మించిన‌ విద్యాశాఖ మంత్రి ఉన్న‌డా? పాస్ మార్కులు వేసిండ్రు.. ఇదే ప‌నితీరుకు గీటురాయి!

నన్ను మించిన‌ విద్యాశాఖ మంత్రి ఉన్న‌డా? పాస్ మార్కులు వేసిండ్రు.. ఇదే ప‌నితీరుకు గీటురాయి!
Advertisement

విద్యాశాఖ మంత్రిని మార్చాలి.. సీఎంను నుంచి ఆ శాఖ‌ను వేరుచేయాల‌ని బీజేపీ ఈ మ‌ధ్య చేస్తున్న ఒత్తిడి, ప్ర‌చారాల‌కు సీఎం రేవంత్ రెడ్డి త‌న‌దైన శైలిలో స‌మాధానమిచ్చారు ఇవాళ‌. ఎంసీహెచ్ఆర్డీ( MCRHRD) లో ఫిన్‌లాండ్, జర్మనీ దేశాలలో పర్యటించి వ‌చ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఇంటరాక్షన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

గ‌త ప‌దేళ్ల‌లో విద్యాశాఖ ఎలా ఉండేది.. ఇప్పుడెలా ఉందో టీచ‌ర్ల‌కు బాగా తెలుసున‌న్నారు. తను ఆ శాఖ‌ను ఇష్ట‌ప‌డే త‌న వ‌ద్ద పెట్టుకున్నాన‌ని, ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌తో దీన్ని అన్ని ర‌కాలుగా సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్ట‌డం ద్వారా విప్ల‌వాత్మ‌క మార్పుల‌ను తేగ‌లిగాన‌న్నారు. ప్ర‌భుత్వ పాఠశాల‌ల్లో ప‌దేళ్ల‌లో పెర‌గ‌ని విద్యార్థుల సంఖ్య‌.. ఎందుకు ఈ రెండేళ్ల నుంచి అనూహ్యంగా పెరిగాయి..? డ్రాఫ‌వుట్స్ ఎందుకు మొత్తానికి మొత్తం త‌గ్గిపోయాయి..? అని ఆయ‌న ప్ర‌తిప‌క్షాల‌కు ఎదురుప్ర‌శ్నించారు.

Advertisement

విద్యాశాఖ సీఎం వ‌ద్దే ఉన్న‌ద‌నే అంశాన్ని ప‌దే ప‌దే బీఆరెస్ కూడా త‌న పొలిటిక‌ల్ అస్త్రంగా వాడుకుంటూ వ‌స్తోంది. సీజేపీ ఆందోళ‌న‌కు ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేసిన త‌రువాత.. దీన్ని కాంగ్రెస్ ఓన్ చేసుకుంటున్న‌ద‌నే కోపం బీజేపీలో బాగా పెరిగింది. కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ నిర్వ‌హించ‌డం.. జెన్‌జీకే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఇవ్వాల‌ని, త‌ను పీఎంగా రాహుల్‌గాంధీనీ చేయ‌డ‌మే కాదు.. ఆయ‌న మంత్రివ‌ర్గంలో జెన్‌జీకి చెందిన నేతే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉండాల‌ని కోరుతాన‌ని, ఈ విష‌యంలో ఇండి కూట‌మిని కూడా ఒప్పిస్తాన‌న్నారాయ‌న‌.

అంతే కాదు.. ఇక్క‌డ తెలంగాణ‌లో కూడా ఇక‌పై చ‌ట్ట‌స‌భ‌ల్లో 25 ఏండ్ల వ‌య‌సు అర్హ‌తను 21 ఏండ్ల‌కే మార్చుతూ ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశాల ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామ‌ని ప్ర‌క‌టించ‌డం కూడా రాజ‌కీయంగా అగ్గి రాజేసిన‌ట్ట‌య్యింది. ఈ ప‌రిణామం త‌రువాత బీజేపీ దీన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుని కాంగ్రెస్ పై అస్త్రం ఎక్కుపెట్టేందుకు .. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన ఇద్ద‌రు యువ ఎమ్మెల్యేలు…పాల‌కుర్తి ఎమ్మెల్యే య‌ష‌శ్వ‌నీరెడ్డి, మెద‌క్ ఎమ్మెల్యే.. మైనంప‌ల్లి రోహిత్ పేర్ల‌ను ప్ర‌ధానంగా తెర‌పైకి తెస్తున్నారు.

Advertisement

దీనికి చెక్‌పెట్టే విధంగా సీఎం రేవంత్ ఇవాళ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు ప్ర‌తిప‌క్షాల‌కు. టీచ‌ర్ల ప్ర‌మోష‌న్ల, ట్రాన్స్‌ఫ‌ర్ల అంశం నుంచి మొద‌లుకొని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్ ఏర్పాటు లాంటి విష‌యాల్లో తను ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుని చేశానని గుర్తు చేశారు. టీచ‌ర్లు త‌న‌కు 60 మార్కులు వేస్తున్నారంటేనే త‌ను ఈ శాఖ నిర్వ‌హ‌ణ‌లో పాస్ అయిన‌ట్టేన‌ని ఆయ‌న ప్ర‌క‌టించుకున్నారు.

ఇదే త‌న ప‌నితీరుకు గీటురాయ‌న్నారు. త‌ను కూడా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చదువుకునే ఇక్క‌డి వర‌కు వ‌చ్చాన‌ని, ఉపాధ్యాయులు బెస్ట్ టీచింగ్ మీద దృష్టి పెట్టాల‌ని, వారి నిజ‌మైన స‌మ‌స్య‌లు, అవ‌స‌రాల‌ను త‌నకు వ‌దిలేయాల‌న్నారు. అవ‌స‌ర‌మైతే ఎక్క‌డ్నుంచైనా అప్పు తెచ్చి మ‌రీ నిధులు విద్యాశాఖ‌కు ఖ‌ర్చు చేస్తానన్నారు. ఇంత మంచి కార్య‌క్ర‌మాలు చేస్తున్నందుకు, సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టి విప్ల‌వాత్మ‌క మార్పులు.. విద్యావిధానంలోపురోగ‌తి సాధించినందుకా త‌న‌ను విద్యాశాఖ నుంచి త‌ప్పుకోమంటున్నారు..? అని ప్ర‌తిప‌క్షాల‌ను తిరిగి ప్ర‌శ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.

2034 వ‌ర‌కు తానే సీఎంగా ఉంటాన‌ని కూడా మ‌రోసారి సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌క‌టించారు ఈ వేదిక‌గా. సీఎంగా నేనే ఉంటా కాబ‌ట్టి.. మీరు పాఠ‌శాల‌ల్లో విద్యాబ‌లోపేతం దృష్టి పెట్టండి.. మీ సంక్షేమం విష‌యాన్ని నాకు వ‌ద‌లేయండి.. అని అన్నారు సీఎం. మ‌ళ్లీ నేనే సీఎంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించుకున్న రేవంత్‌రెడ్డి.. విద్యాశాఖ మంత్రిగా కూడా తానే కొన‌సాగుతాన‌ని ఈ వేదిక‌గా అంద‌రికీ క్లారిటీ ఇచ్చారు.

Related News

మియాపూర్ ఘటనతో ఉలిక్కిపడుతున్న హైదరాబాద్.. జంకుతున్న ప్రజలు!

డేంజర్ బెల్స్.. ప్రపంచ చమురు మార్గాలపై మళ్లీ యుద్ధ ప్రభావం..!

చంద్రబాబు నోట మావిగన్ మాట.. జగన్ ఐడియా‌కు స్కెచ్ ఏసారా..?

దమ్ముంటే ఒక్క రాత్రి మా ఊళ్లో నిద్రపోండి.. అధికారులకు నల్గొండ ప్రజల సవాల్!

హైడ్రాను పీకి అవ‌త‌ల పాడేస్తాం.. బీఆరెస్ స్టాండ్ క‌రెక్టేనా? జ‌నామోదం ఎంత‌? సిటీ ఈ దుస్థితికి కార‌ణం ఎవ‌రు?

బీజేపీ నేత‌ల‌ది జెన్‌బీ మంత్రం… ఓటు బ్యాంకును సంతృప్తి ప‌రిచేందుకు తిక్క మాట‌లు త‌ప్ప‌వు మ‌రి!

మాకూ కావాలి బుల్డోజ‌ర్లు.. జిల్లాల నుంచి హైడ్రాకు డిమాండ్…! ఇదో కొత్త కోణం..

Big Stories

Advertisement
×